Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. Who is the reason for bad behavior of children? We, the people around us and habits, more?
నేటి కుటుంబం, సామాజిక, రాజకీయ పరిస్తితులు, ఏవైనా సరే, పురాణాలు దేవుడు భగవద్గీత సజీవ గురువు లైన తల్లిదండ్రులు తో, వివిధ ఉదాహరణలతో, వివరం గా నిస్వార్ధం గా, పంచభూతాల శిక్షల నుంచి మనం తప్పించుకోవడం కోసం మార్గం చెప్పే, ఒకే ఒక కధన విశిష్ట శైలి మనది. 1700 పైగా కధనాలు, 400 పైగా గొంతు పాటలు, ఇంకా ఎన్నో ప్రతి శనివారం మీ సాక్ష్యం తో ఏళ్ళు గా చూసారు, ఆశీర్వదించారు.
మీరు చదవడమే కాదు, మీ పిల్లలకు బంధువులకు స్నేహితులకు కూడా, చదివి చెప్పాలి, నేర్పాలి, పంపాలి. ఊరంతా, అంటే బంధువులు స్నేహితులు సహా ఉద్యోగులు, చెడుతో మునిగిపోతే నలిగిపోతే తగలపడితే, మన ఒక్క ఇల్లు మాత్రం ఆనందముగా సంస్కారముగా ఉండలేదు మిత్రమా. మన పిల్లలు, వారి పిల్లలతో కలవరా, తిరగరా, నేర్వరా? మనం మారాలి, మన చుట్టూ మారాలి. లేకపోతే నష్టం, మనకు, మన పిల్లలు కు, మన మనుమలకు, భావి తరాలకు.
రోజూ వాట్సాప్ మరువద్దు. మొన్న మీరు మన వాట్సాప్ స్టేటస్ గమనించి ఉంటే, తన 6 ఏళ్ళ పిల్లల మాటలు, ఓ కన్నతల్లి, చదువు కున్న మేతావుల విదేశాల్లో ఉన్న వేలమంది ఉన్న మన దేశ గ్రూపు లో, బాధతో వివరించింది ఇలా.
1)నా 6 ఏళ్ళు కొడుకు అడుగుతున్నాడు - ఇవి ఎప్పుడు చిన్న గా అవుతాయి. మగ మగ పెళ్ళి చేసుకుంటారా అని. ఎలా జవాబు సర్ది చెప్పాలి అని. నేను ఎప్పుడూ పద్దతి గా ఉంటాను అని. 2) ఇంకొకరు 11 ఏళ్ళు పిల్లలు, పెద్దల కు మాత్రమే వెబ్సైట్ లు, రాత్రి గదిలో ఫోన్ కంప్యూటర్ లో చూడడం ఆపడం లేదు అని. 3) ఇంకొకరు 18 ఏళ్ళ మా పిల్ల అర్ధరాత్రి ఇంటికి వచ్చి తలుపు వేసుకుని గమ్ముగా ఉంటుంది, మాతో ఏమీ చెప్పడంలేదు అని.
మరి పిల్లలు చెడిపోవడం కు కారణం ఎవరు? మనం, మన చుట్టూ ఉన్న జనం మరియు వారి వింత అలవాట్లు, టీవీ, సినిమా, ఓటీటీ, ఆన్లైన్ కార్యక్రమంలు. మన కుటుంబం లో అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వీడనిదే, మన పిల్లలకు మానసిక బలం పెంచలేము. ముందు పెద్దలైన మనకు, మానసిక బలం, స్తిరత్వం లేదు.
ఏళ్ళుగా ప్రతి శనివారం, అది ఎలా పెంచాలి అని, ఉదాహరణ లు ఇచ్చాం. మరి మీరు మీ పిల్లలు, ఎంత వరకు సాధన చేశారు తెలీదు. మానసిక బలం పెరిగితే, ఇంక ప్రాపంచిక విషయాల వ్యామోహం, పిల్లల ను ఏమీ చేయలేదు. నైతిక విలువలు తో బలం గా స్ధిరంగా, మనలాగా ఉంటారు. ముదుసలి తల్లిదండ్రులు అత్తమామలు కు సేవ చేస్తారు.
ఏళ్ళుగా, మా బాధ్యత, ఈ అక్షరాల ఆధ్యాత్మిక గుళికలు రాయడం పంచడం, నిత్యం భుజం తట్టి మేల్కొలపడం దైవం వైపు ఆత్మ జ్ఞానం వైపు మరల్చడం.
మరి మీ బాధ్యత ఏమిటి, రోజూ నిస్వార్థంగా మనసా వాచా కర్మణా, దేవునికి అలాగే దేవుని సంతానానికి, మీకు, మీ కుటుంబం కు? అదే ఆ జవాబే, మీ/మన వంశాన్ని, ముదుసలి తనం ను, సంతానం ను, రాబోయే తరాలను, పంచభూతాల సాక్షిగా కాపాడుతుంది లేదా పతనం చేస్తుంది. బాధ్యులం మనమే, శిక్షణ మనకే. అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వీడనిదే, ఈ సామాజిక మానసిక చైతన్యం, పంచభూతాల సాక్షిగా అసాధ్యం.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1792 General Articles and views 1,383,300; 93 తత్వాలు (Tatvaalu) and views 184,014 Dt : 18-May-2023, Upd Dt : 18-May-2023, Category : General
Views : 81
( + More Social Media views ), Id : 1751 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
reason ,
bad ,
behavior ,
children ,
people ,
habits Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments