డిక్లరేషన్ లేదా నియమాలు ఎందుకు? జగన్ ఎప్పుడో, హిందువుగా మారారు, లక్ష్మీపార్వతి గారి మాట, నిజమేనా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2152 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2187 General Articles and views 2,373,403; 104 తత్వాలు (Tatvaalu) and views 256,980.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

డిక్లరేషన్ లేదా నియమాలు ఎందుకు? జగన్ ఎప్పుడో, హిందువుగా మారారు, అంటూ లక్ష్మీపార్వతి గారి మాట, నిజమేనా?

జవాబు, ఇంట్లో కి వెళ్ళేటప్పుడు, కాళ్ళు చేతులు మొఖం కడుక్కొని లోనికి వెళ్ళాలి, ఇంటి తిండి నీళ్ళు తాగండి. ఇవి మన పెద్దలు ఏళ్లుగా పెట్టిన నియమాలు, పాటించక, అందరం చాదస్తం అని, వదిలి, కరోనా వచ్చిన తర్వాత, జనం ను బలి తీసుకున్న తర్వాత, మరలా కొంతమంది మి మొదలు పెట్టాము.

అంటే మన పెద్దలు పెట్టిన, ప్రతి నియమం లోనూ, గూఢార్ధం ఉపయోగం, ఏదో ఉంటుంది. ఒక పద్ధతి ఉండటం మంచిది. అందరం గౌరవించాలి. ఇతర మతస్థులకు కూడా వారి మందిరములో డిక్లరేషన్ ఉంటే, మనం పాటించాలి, లేకపోతే వెళ్ళకూడదు.

చంద్రన్న, పవనన్న ఇతర మతాల మందిరాలకు వెళ్ళినప్పుడు, టోపీలు ధరించి, ఆ మత సాంప్రదాయం ప్రకారం, ప్రార్ధనలు చేశారు. కానీ స్వతహాగా హిందువులు వారు, అలాంటి వి బయట ఎన్ని చేసినా, సొంత ఇంటి కార్యక్రమంలో, హైందవ పూజలు పునస్కారాలు ఉంటాయి, అవి మారవు కదా.

ఎందుకు టోపీలు పెట్టుకోవాలి, ప్రభుత్వ లేదా పార్టీ అధినేత గా, మా పార్టీలో అన్ని మతాలు ఉన్నాయి, ఆ మందిరం వారే, ఆహ్వానించారు అని వితండవాదం చేయలేదు, చేయకూడదు.

ఇక మన జగనన్న ఏం సాంప్రదాయం, సహజంగా పాటిస్తారు అనేది అందరికీ తెలుసు, దాని గురించి వాదన అనవసరం. లోటస్ పాండ్ గోడ మీద వెంకన్న, లక్ష్మీ, గణపతి లాంటి హిందూ దైవ బొమ్మలు చెక్కి ఉన్నాయో లేక ఇతర ములు ఉన్నాయో, అందరం చూసాం.

మొన్న మన రాజన్న, వర్ధంతి రోజు ప్రార్ధనలు కూడా చూసాము టీవీల్లో, వారి వారి విశ్వాసం కు ఆచరణకు అణుగుణంగా, అది సమ్మతం, మంచి పని. కాబట్టి, జగన్ బయట హైందవ పద్దుతులు కొన్ని లేదా అన్ని పాటించినా, ఆయా పరిస్థితి ని బట్టి, పూర్తిగా హిందువు కాలేరు, ఆయన ప్రకటించలేదు, సొంత ఇంటి అలవాట్లు మార్చుకోలేరు.

నాయకులు గా, ఆదర్శంగా ఉండాలి, ఆచరణలో చూపాలి. లేదు అధికారం మాది అని, మన ఇష్టం వచ్చిన విధంగా, ఒక్కోపని చేసుకుంటూ పోతే, నష్టం మన పార్టీ కే. ఒక్క అవకాశం, ఎంత అనర్ధం తెచ్చింది అని జనం, తల పట్టుకుంటారు. హైందవ ఎమ్మెల్యేలు గమ్ముగా సమర్ధన చేస్తూ ఉంటే, అది నాయకునికి వీరే నష్టం చేస్తున్నారు.

తర్వాత ఒక్క ఛాన్స్ కోసం, బీజేపీ జనసేన, అలాగే తిరిగి తెదేపా రెడీ గా ఉన్నారు. మన విలువ ల పతనం తో, వారికి రెడ్ కార్పెట్ పరుస్తూ వెళుతున్నాము, మంత్రుల బాధ్యత లేని కట్టడి లేని మాటల తో. జాగ్రత్తలు సుమా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,373,403; 104 తత్వాలు (Tatvaalu) and views 256,980
Dt : 23-Sep-2020, Upd Dt : 23-Sep-2020, Category : Politics
Views : 886 ( + More Social Media views ), Id : 717 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : declaration , rules , jagan , hindu , lakshmi parvati , true
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content