పాపం 4 పాదాల పెంచుతుంది? కరోనా గురువు లు కి, తోడ్పాటు అందిస్తుంది ఎవరు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2111 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2146 General Articles and views 2,140,877; 104 తత్వాలు (Tatvaalu) and views 240,219.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనం ఉన్న ఈ కలియుగంలో, పాపం 4 పాదాల పెంచుతుంది ఎవరు? ఇంకా ఎక్కువ కరోనా గురువు లు రావడానికి, తోడ్పాటు అందిస్తుంది ఎవరు?

ధనమే ప్రాణంగా, పిల్లల సంస్కారం పట్టని, మంచి చెడు విచక్షణ నేర్పని, ముదుసలి అమ్మ నాన్నలు అనాథాశ్రమంలో లేదా ఇంట్లో పని మనుషుల సంరక్షణ లో,

మనసు ఎదగని, మానవత్వం తెలియని, సంపాదనా ధ్యేయ పిల్లలు, ఉద్యోగాలలో, పక్క రాష్ట్రాలలో, విదేశాల్లో . .

నటనా అవసర అవకాశ స్నేహితులు, సోషల్ మీడియా లో . .

ఉత్తుత్తి పలకరింపులు లేదా దానికి జవాబు లేని, నీరస నిర్లక్ష్య జనం, వాట్సాప్ లో . .

పిల్లల సంస్కార సాంస్కృతిక బాధ్యత గాలికి వదిలేసి, భార్య టీవీ సీరియల్స్ లేదా బయట వ్యవహారాలు లో . .

ప్రాపంచిక మోహం లో, ఇంటి విషయాలు పట్టని, భర్త స్మార్ట్ ఫోన్ లో ఇంటర్నెట్ లో . .

పక్కన పిల్లలు పెద్దలు తో, గౌరవం గా మాట్లాడే సంస్కారం లేని, పిల్లలు వీడియో ఇంటర్నెట్ గేమ్ లో . .

పని పాట, బాధ్యత లేని పెద్దలు, క్యాండీ క్రష్ లో ఇంకో ఆట లో . .

పదిమంది కి కష్టపడి అన్నం పెట్టే, రైతులు పట్టించుకుని ఆదుకునేవారు లేక ఉరికంభంలో . .

అందరి దగ్గర మాయ చేసి కమీషన్లు దోచే, దళారిలు బ్రోకర్లు ఊరేగింపులలో . .

చదువు సాంస్కృతి సంస్కారం పట్టని, విద్యార్థులు, విహారాలలో ఆనందాలలో. .

ఉచితంగా విద్య అందిచాల్సిన గురువులు, వ్యాపారాలలో స్వార్ధ వ్యాపకాలలో . .

అప్పు పుచ్చుకున్నవాడు, హాయిగా ఎగకొట్టి, అద్దాల మేడలో లేదా రాజకీయాలు లో . .

వడ్డీ ఆశించి మోసపోయి, ఇచ్చినవాడు పిచ్చాసుపత్రులలో . .

విని ఆచరించే వారు లేకపోయినా, నీతిమంతుడు రాసే నీతులు పుస్తకాలలో, వెబ్సైట్ లలో . .

నీతి విలువ మానవత్వం మంచితనం సంస్కారం జవాబు దారీ తనం లేని వాడు, రాజకీయాలలో . .

వారికి మడుగులు వత్తే పనిలో, జీతాలిచ్చే ప్రజాల సంక్షేమం పట్టని బాధ్యత లేని అధికారులు . .

అలాంటి వారిని మాత్రమే, తరాలుగా ఎన్నుకునే మత్తులో, కేవలం వర్గ అవసర అవకాశ ధన మోహ, ఓటర్లు . .

ఇలా ఓ వంద రాసినా, మన గొప్పతనం కు అంతులేదు. చాటుగా అయినా, చేతులెత్తి, మనసు లో ఆత్మ విమర్శలు, ఎవరికి వారు చేసుకోవచ్చు.

మనం మనుషుల మంచి మాట వినం. నువ్వెవరు మా వంశ వినాశనం, ఆపడానికి? మా సొంత ఇంట్లో వాళ్ళే, ప్రోత్సాహం చేసి గోతిలో పెడుతుంటే, అని ఎదురు వాదిస్తున్నారు.

అందుకే ఇలాంటి మూర్ఖులకు, సంస్కార హీనుల కు, బుద్ధి చెప్పడానికి, జీవిత పాఠాలు తో, వారి సొంత రాక్షస పిల్లల తో పాటుగా, కరోనా లాంటి ఉత్తమ గురువు లు వస్తున్నారు రావాలి ఏమో? కరోనా ను పుట్టించింది మనము కాదా?

ఇదే కలియుగం, మన వలనే, పక్వానికి వచ్చిందనడానికి, ఇంకా వస్తుంది అనడానికి నాంది....

ఇది ముమ్మాటికి నిజం, మనమే కారకులం, మన తర్వాత తరాలు కూడా వీటి బారిన పడుతున్నారు, ఇంకా పెంచేస్తూ.

40 శాతం సేకరణ మరియు 60 శాతం సవరణ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2146 General Articles and views 2,140,877; 104 తత్వాలు (Tatvaalu) and views 240,219
Dt : 21-Apr-2021, Upd Dt : 21-Apr-2021, Category : General
Views : 833 ( + More Social Media views ), Id : 1121 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sin , walking , feet , supports , encourages , corona , kovid , guru , spread
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content