Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. With modern trends, todays education wealth, fellow women intelligence in one word by another woman
మీలో ఒక కుటుంబం వారు రాసిన మూలకధ, తమ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బట్టి. మరి మీరూ చేతులు గొంతు కదిలించే ప్రయత్నం చేస్తారా, మీ సొంత ఆలోచనలు తో, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వ నిర్మూలనకు, ముదుసలి తనం లో పిల్లలతో ఆనందముగా గడపాలి అంటే మీ ఇష్టం, వద్దు అనుకున్నా మీ ఇష్టం. కొన్ని మేమెటూ మీరు రాసిన దానిలో సరిచేయాలి, ప్రోత్సాహం చేయాలి, మీ కలం పేరు లేదా పూర్తి పేరు క్రెడిట్ తో.
నేటి చదువున్న, పెద్ద ఉద్యోగాల/ వ్యాపారాల/ సౌకర్యాల/ సంపదల ఆధునిక పోకడలతో, తోటి మహిళ ల తెలివితేటలు ఒక్క ముక్కలో మరో మహిళ వివరిస్తే, వారి విశ్వసనీయత ఎలాంటిదో చూద్దాం:
అందరినీ ఒక్క గాటిన కట్టలేము, ఇది కొంత మంది విపరీత ధోరణి గురించి మాత్రమే సుమా, అన్యధా భావించవద్దు. నటనలు లేకుండా, చేదుగా ఉన్నా, వాస్తవాలు మాట్లాడుకుందాము మనసు విప్పి. కలియుగ పాపం 80 శాతం కి కారణం లేదు అంటారా?
మగవాళ్ళు ఎలా తిరిగినా, మహిళ నీతి నిజాయితీ తో పిల్లలకు కుటుంబ సంస్కారం గౌరవం మర్యాద నేర్పాలి, మానసిక బలవంతులుగా చేయాలి, వారిని భావి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాలి. అది సాధిస్తూ ఎన్ని ఉద్యోగాలు వ్యాపారాలు పదవులు వెలగబెట్టినా పర్లేదు. కనీసం ముదుసలి తనములో, తమకైనా అండగా ఉండేలా చేసుకోవాలి. కానీ నేడు ఏమి జరుగుతుంది?
నేటి మహిళల ఆధునికతకు, వారి తల్లి దండ్రులే కాక, ఇంటి పురుషులే సిగ్గుతో అవమానముతో తల దించుకొంటున్నారు. కట్నాలకు అమ్ముడుపోయి, గుణం లేని పెళ్ళితో, నోట మాట రాక, తగ్గి ఉంటున్నారు, కోర్ట్ కేసులకు భయపడి. పిల్లలు పెడదారి పడుతున్నారు, ఎవరి మాట వినరు. విదేశం లో ఒంటి మీద దెబ్బ వేయడానికీ లేదు. చివరలో ఒంటరిగా ఇంట్లో లేదా అనాధాశ్రమములో కాలం వెళ్ళబుచ్చుతున్నారు భోరుమంటూ. ఎందుకలా, మరి అసలు కధ కు వెళితే,
సాంప్రదాయముగా మొహానా నిండు బొట్టు ఉన్నా లేకపోయినా, రోజూ పసుపు పూసినా పూయకపోయినా, నిండు చీర కట్టగలిగినా లేకున్నా, పొడవైన జడ ముడి/ మెలికలు పెట్టగలిగినా లేకున్నా, భర్త అమ్మ అత్తకు నమస్కరించినా నమస్కరించకపోయినా, ఆచరణ లో పెద్ద గా సంస్కార మనస్తత్వాలు భావజాలము అనేది కనపడటము చాలా తక్కువ. పెరుగుట విరుగుట కొరకే అన్నది ప్రత్యక్ష ఉదాహరణ. పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మ కూడా, పట్టణాలలో దొరసాని పనులు. ఇక పట్టణాలనుంచి వచ్చిన వారి గురించి అనుకోవడమే అనవసరం.
ఒక్కోసారి అది కూడా కనిపించే పరిస్థితి అయితే లేదు. ఏ మహిళ అయినా డబ్బు కి హోదాకు సౌకర్యాలకు దాసోహం కావడం, నాటి నుంచి నేటి వరకు మార్పు లేదు. దాని కోసం కపటం, నటన, వయ్యారితనం, దొంగ ముసుగు వేసుకొని, 2 నాల్కల ధోరణిలో, ఇతరుల కి నీతులు చెపుతూ బతకడం పరిపాటి అయిపోయింది ఎక్కడ చూసినా.
పేరుకు పెద్ద కాలేజీలో పెద్ద చదువులు చదివినా, తల్లి దండ్రులు చిన్నప్పటినుంచి సంస్కారం నేర్పనిదే, పెద్ద ఉపయోగం ఏమి లేదు. వళ్ళు వంచి ఇంట్లో పనులు చాకిరీ చేయలేరు, భారం పెంచుతారు. ఎందుకు చదువుకున్నారో వాళ్ళకే తెలియకుండా, వక్ర మార్గాలలో ఉన్నవి లేనివి అలవాటు చేసుకొని, అదే నేటి ప్యాషన్ అనే పేరుతో విచ్చలవిడి తనం తో బతకడం, అలా తమలాగా కపటం నాటకం హెచ్చులు లేని వాళ్ళని ఎగతాళి చెయ్యడం, బుద్దవతారాలకు ఏమి తెలియదు అని, ఇతరులకు లోకువగా చెప్పుకొని తిరగడం, నిద్ర లేచిన దగ్గర నుండి, పై పై మేకప్పులతో, ఒంటి సోకులతో పార్టీ లు ఫంక్షన్లు టూర్ లు అని చెప్పి తిరగడం.
ఆ ప్రత్యేక ఫ్రెండ్షిప్ లు కూడా సిద్దం, వాటి కోసం యుద్దం, ఎంతకైనా సిద్దం, లాభాల బిజినెస్ లు ఏమైనా ఉంటే కలిపి చేసుకోవచ్చు, అని కూడా సోషల్ గాదరింగ్ లు అమ్మాయిలు నే కండక్ట్ చేయడం నేటి ప్రత్యేకం. తమ ప్రత్యేక సర్కిళ్ళు ను ఏర్పరుచుకోవడం, అందులోనే మునిగి తేలడం, దూరంగా ఉన్నా లేదా ఉంచిన ఇతరులను హేళన చెయ్యడం, తమ పనులకు అనుకూలమైన కొత్తవారిని, రంగములోకి దింపడం.
ఏమి రాకపోయినా, పక్కనోళ్ళని చూసి చెయ్యడం, రానివి ముందు అడిగి చెప్పించుకొని, తెలుసుకొని అలవాటు చేసుకున్న తరువాత, అన్ని వాళ్ళకే తెలిసినట్లు, పక్క వాళ్ళది అంతా అప్పజెప్పడం, ప్రపంచములో అన్ని మాకే తెలుసు అంతా మాతోనే అని, కపట నటన లో ఆరితేరిపోవడం.
అసూయతో ఒకరి మీద ఒకరు చాడీలతో, చెవులు కొరుక్కోవడం, నోరు నాలిక లూసు తో మాటలు జారడం, కల్పనలు ఎంత దూరమైనా పోవడం.
ఉద్యోగం కూడా అదే విధంగా నెట్టుకు రావడం, ఆఖరికి పిల్లలకి అదే నటన నేర్పించడం, ఏమైనా నోరు ఎత్తిన గుణం లేని పెళ్ళితో వచ్చిన సంపాదన మగ వాళ్ళని బెదిరించడం, అందరూ మా లాగనే పని పాటా చేయకుండా మాటలతోనే అలానే ఉన్నారు బయట ప్రపంచములో అని, నోరు ఎత్తారంటే ఇంటికి వెళ్ళాక ఉతికి ఆరేయ్యడం, బ్లాక్ మెయిల్ చెయ్యడం, ఇదే దిన చర్య తో మధ్య మధ్య లో మొక్కుబడి గుడులు యాత్రలు, వ్రతాలు పూజలు పునస్కారాలు అనే పేరుతో చీరలు, నగలు అలకరించుకొని, సోషల్ మీడియా స్టేటస్ లో, పది మందికి చూపించుకోవడం.
ముదుసలి అమ్మను అత్తను తెచ్చి సేవ చేయడం దేవుడెరుగు, ఎటూ అసాధ్యం, భాగస్వామి మరియు పిల్లలతో చేయించకుంటే చాలు సుమీ. పిల్లలకు సంస్కారం నేర్పడానికే సమయం చాలడం లేదు, తల ప్రాణం తోకకు వస్తుంది, స్కూళ్ళలో కొత్త అలవాట్లు తో. మరి వీరి విపరీత ధోరణితో సంపాదన వ్యసనములో, బయట ప్రపంచాన్ని ఏలుదాము అంటే, మొదటికే మోసం వస్తుంది భవిష్యత్తులో. పెళ్ళి కాని మరియు ఐనవారు కూడా, ఒంటరి వారుగా మిగిలిపోతున్నారు, సర్దుబాటు చేసుకోలేక, తమను తాము అదుపు చేసుకోలేక, అరిషడ్వర్గాలకు అష్టవ్యసనాలు అవసర అవకాశవాదులుగా.
ఆడవాళ్లు మీకు జోహార్లు అని ఎవరు అన్నారో కానీ, అది సార్ధకం చేసే పనిలో, నిత్యం కట్ట కట్టుకొని సఫలం చెయ్యడానికి, అన్ని విధాలుగా కృషి చేస్తున్న, నేటి మహిళా లోకం అందరికి ఆదర్శనీయం. అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం లో ఉన్నారు మీరు అంటే, ఒప్పుకునే వారు, ఎక్కడైనా ఉన్నారా? ధనము గలవారిదే రాజ్యం, గుణం కలవారిదే చేతకాని తనం. ఇదే నేటి కలియుగ పాప పరిస్తితి.
ఓ మగవాడు నిద్రపోతుంటే, తట్టి లేపేది అమ్మ, తిట్టి లేపేవాడు నాన్న, కొట్టి లేపేదే భార్య. కట్నం ఆస్తి పదవి అందం వీసాకు అమ్ముడు బోయాక, అణిగిమణిగి, అన్ని మూసుకుని, తన లాంటి మరిన్ని చవటలను, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసలు ను, తయారు చేయడం కు, కలియుగ పాపం పెంపుకు, భాగస్వామి తో సంధి, ఇంట్లో సుఖ శాంతులకు నాంది ! అనుకోవాలి నేడు.
ముఖ్య గమనిక: చిట్ట చివరిగా చిట్టి చురక, మగవారు కూడా ఏమి తక్కువ కాదండోయ్, నాలుగు ఆకులు మాకన్నా ఎక్కువే. కానీ, మాకన్నా అన్నిటిలో తక్కువే. ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది, ఇంటికో రామాయణం, వీధికో భాగవతం, రామ రామా. పంచభూతాలే, పరిష్కారం చూపాలి.
Photo/ Video/ Text Credit : NariSri
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1766 General Articles and views 1,289,931; 90 తత్వాలు (Tatvaalu) and views 176,191 Dt : 12-Mar-2023, Upd Dt : 12-Mar-2023, Category : General
Views : 98
( + More Social Media views ), Id : 1716 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
modern ,
trends ,
education ,
wealth ,
fellow ,
women ,
thoughts ,
lady Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments