శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. కర్త కర్మ క్రియ కరోనా ఆయనే, కధానాయకుడు ఆయనే - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,863,763; 104 తత్వాలు (Tatvaalu) and views 224,709.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. కానీ ఆ శివయ్యే చెప్పాడు ఇంటి వైద్యం, గ్లౌజులు, మాస్కులు, 6 అడుగు ల దూరం. కర్త కర్మ క్రియ కరోనా ఆయనే, కధానాయకుడు ఆయనే

మూడు వారాల నుంచి, మూడు షాప్ ల కు, మొత్తం గంట సమయంలో, ఇంటి చుట్టూ మాత్రమే, శని లేదా ఆది ఉదయం 8 తొ 10 లోపు, తాజా కూరలు సామగ్రి తెస్తున్నా. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ.

ఆన్లైన్ లో డెలివరి వారం దాకా కనపడటం లేదు. మా ఆరోగ్య వ్రతాలకు కావల్సిన వస్తువులు కూడా దొరకవు అన్ని ఆన్లైన్లో. ప్రతి రూపాయి కూడా, రేపటికి అమ్మకు కావాలని, వృధా చేయను. ఉన్న దాంట్లో నే దాచాలి కదా కొత్తగా రానప్పుడు, మనవి మనకు ఇతరుల నుండి రానప్పుడు.

అమ్మకు బలమైన తిండి ఖర్చు లో రాజీ లేదు, కేవలం వృధా వద్దు అంతే. అలా ఇరవై ఏళ్ళు ఉండ బట్టే, ఆదాయం లేకపోయినా, జనం మనల్ని మోసం చేసినా, నెట్టుకు వస్తున్నాము, మొండి ధైర్యంగా ఏళ్లుగా.

తప్పో ఒప్పో, ఇంకో దోవ లేదు. అమ్మ కు శ్రమ లేకుండా చేయాలి. కరోనా రావాలని రాసి ఉంటే, ఏ వస్తువు ద్వారా అయినా వస్తుంది, ఇంట్లో మూలన దాంకున్నా కూడా, ఆపలేము.

ఇంటికి రాంగాల్నే గ్లౌజులు మాస్కులు తీసి, అన్ని శుభ్రంగా కడిగి, వేడి నీళ్ల లో పసుపు తో కలిపి తాగుతాము వెంటనే. అమ్మ కారులో ఉంటుంది, దిగకుండా. మరచిపోయినవి చెబుతుంది. బయట పెద్ద లైన్స్ ఉంటే, సీనియర్ టైం లో అమ్మ ఉపయోగం. కానీ ఆ అవసరం రాలేదు నెల రోజులు గా, రాకపోవచ్చు కూడా.

నారాయణుడి మీద భారం వేసి, అమ్మ కు చేయగలిగిన మంచి చేద్దాం , రాతను మనం మార్చలేము. 39 వారాలు 108 ప్రదక్షిణలు లేదా ఆరేళ్ళ శనివార వృతం చేయించింది ఆయనే. మూర్కుడా తొందరపడకు 40 కి, కాస్తంత టైం ఉంది లే అని ఆపింది ఆయనే. మనం నిమిత్త మాత్రులం.

ఇదంతా అంటే కరోనా గురించి, ముందే వేపాకు అల్లం వెల్లుల్లి నిమ్మ కాకర అలవాటు చేయించింది ఆయనే, పదిమందికి చెప్పించింది ఆయనే, వివరంగా ప్రతి వారం మరవకుండా, ఎంతమంది తిట్టుకున్నా కూడా.

అందుకే శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. కానీ ఆ శివయ్యే చెప్పాడు ఇంటి వైద్యం, గ్లౌజులు, మాస్కులు, 6 అడుగు ల దూరం. కర్త కర్మ క్రియ కరోనా ఆయనే, కధానాయకుడు ఆయనే. మనము జీరోలము.

ఆయనను అనుసరించడమే తేలికైన పని, జీవిత గమ్యానికి చేర్చే భారం ఆయనకు వదలి, కేవలం మంచి మాత్రమే మనకైనా, ఇతరుల కైనా చేస్తూ పోతూ ఉంటే, ఆయనదే మన బాధ్యత బరువు. నడిపిస్తాడో వెలుతురు లో, పడుకోపెడతాడో చీకటి లో ఆయన ఇష్టం.

వ్యామోహం లేనప్పుడు, దేనిమీదైనా మమకారం ఎందుకు? అందుకే ఇంద్రుడు లేదా యముడు వచ్చినా, నేను ఆపమని అడగను, అమ్మకు తోడుగా, నేనూ వస్తా అంటా అంతే. అంటే అమ్మ మీద కూడా, వ్యామోహం లేదు, కేవలం తోడు, అనే బాధ్యత మాత్రమే.

ఆత్మ పరమాత్మ లో లీనమైయ్యేటప్పుడు సంతోషంగా ఉండాలి. బాధ పడితే, మరు జన్మ తప్పదు. మనము తెచ్చిన ది ఏదీ లేదు, మనము తీసుకు పోయేదీ లేదు, మీరైనా నేనైనా అంతే. అంగీకరించడానికి మనసు ఒప్పదు కదూ, దానికే సాధన కావాలి, ఆత్మ శోధన చేయాలి.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,863,763; 104 తత్వాలు (Tatvaalu) and views 224,709
Dt : 12-Apr-2020, Upd Dt : 12-Apr-2020, Category : General
Views : 989 ( + More Social Media views ), Id : 490 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : carona , kovid 19 , God responsible for everything
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content