Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్, ఘోర సంఘటన చూసారు కదా. నిన్నటి ఘటనలో, దుండగులను ఫోన్ లో ఫోటో తీసి, చెల్లెలు కు లేదా చుట్టాలకు పోలీసులకు, పంపి ఉంటే దుండగులు భయపడే వారు.
ఏది ఏమైనా కూడా,ఇది అందరూ ఖండించాల్సిన విషయము, అందరమూ తల వంచుకోవాలి ఇలాంటి సంఘటనలకు.
పొలీసులకు ఫోన్ చేస్తే? బండి వదిలి గమ్ముగా ఇంటికి వెళితే? కార్ మాట్లాడుకుని బండి తీసుకుని వెళితే? చుట్టాలు/ స్నేహితులు వచ్చిన దాకా అక్కడే ఉంటే?
తెలంగాణ ప్రభుత్వము కూడా ఎన్నో యాప్ లు, ఫోన్ నంబర్లు ఇచ్చారు, ప్రకటనలు ఇచ్చారు, కానీ మన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోరు, లెక్కలేని తనము లేదా మనకు ఏమి కాదులే అని ధీమా.
ఎంతోమంది స్నేహితులు కు, తమ పిల్లలకు జాగ్రత్తలు చెప్పండి నేర్పండి అని మొత్తుకుంటున్నా కూడా పట్టించుకోరు సరిచేసుకోరు.
ఆ, ఆ మాత్రం మాకు తెలీదా? మా పిల్లలు తెలివి గలవారు అని, తమను తమే మోస పుచ్చుకుంటున్నారు. తమ కుటుంబానికి, తామే ద్రోహము చేసుకుంటున్నారు.
మా చుట్టాల అమ్మాయి కి, కొత్త చోట ఉద్యోగం కి వెళితే, రోజూ ఉదయం సాయంత్రం, ఆటో బస్సు లేదా ఎక్కడకు వెళ్ళినా, అన్ని ఫోటోలు మీ అమ్మ కు పంపు అని చెప్పాను. రెండు రోజులు పంపింది అయిష్టముగా. మూడోరోజు మానేసింది.
వాళ్ళ అమ్మ కూడా, మా పిల్లకు తీసే ఓపిక, నాకూ చూసే తీరిక లేదు. ఫోటోలు వద్దు లే అంది. ఏమి చేస్తాము, మనమూ గమ్ముగా నే ఉన్నాము, జాగ్రత్తలు చెప్పగలమే గాని, తన్ని తిట్టి అమలు చేయలేము కదా. ఎవరి కుటుంబము మీద వారికి బాధ్యత ఉండాలి.
ఇదే సంఘటన మన ఇంట్లో, బజారు లో, చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆపవచ్చు. ఆలోచన చెయ్యాలి, మన కుటుంబం ను, మనమే కాపాడుకోవాలి. కానీ అందరమూ మోహం, భ్రమలో ఉంటే, ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఇకముందు కూడా.
మన ఇంట్లోనో లేదా పైన చెప్పిన చుట్టాల పిల్లకు ఏదన్నా జరిగితే, ఏమంటాము. జగన్, బాబు, పోలీసులు, ప్రభుత్వము, మిగతా జనము ఏమి చేస్తున్నారు? మా పిల్లను కాపాడలేకపోయారు అంటాము, అంతే కదా.
అంతే గాని, నా పిల్లకు నేను బాధ్యత నేర్పలేదు, నా పిల్ల డిగ్రీ చదివి కూడా బాధ్యత తెలీదు , బయట వారు చెప్పినా మేము వినలేదు అని వారు అనుకుంటారా?
వారు మారకుండా, మిగతా అందరూ మారాలి అంటే సాధ్యమయ్యే పనేనా? చదువుతో పాటూ, లోక జ్ఞానము నేర్పాల్సిన బాధ్యత తల్లి దండ్రులు మరువకూడదు. మగ పిల్లలైనా కూడా, అవే జాగ్రత్తలు నేర్పాలి, కిడ్నాప్ లూ జరుగుతునాయి కదా.
* మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు, అందరూ తిరిగే దారి మంచిది, ఒంటరిగా కొత్త దారి వద్దు.
* మీరు రాత్రి పార్టీలకు, ఎవరు పిలిచినా పేరెంట్స్ లేదా స్నేహితుల తోడు సురక్షితం. రాత్రి పార్టీలు పనులు మానితే మంచిది ఎవరూ తోడు లేక పోతే.
* మీకు ఆలస్యం, ఒంటరి అనిపిస్తే, వెంటనే కుటుంబ సభ్యులు తో మాట్లాడి పిలిపించుకోవాలి.
* వాహనాలను సీసీ కెమెరాలు ఉన్న దగ్గరనే పార్క్ చేయండి.
* ప్రయాణంలో ఒంటిమీద నగలు వద్దు.
* మీరు కాబ్/ ఆటోలో ప్రజలు ఉంటేనే వెళ్లాలి, కార్ నుంబెర్ డ్రైవర్ ఫోటో తీసి వాట్సాప్ లో, మీ వారికి పంపండి. అదే మాట వారికి చెప్పండి.
* వాహనానికి సమస్య తలెత్తితే, అక్కడే వదిలి బస్‌లో లేదా కార్ పిలిచి లగ్గేజ్ పైన వేసుకొని వెళ్ళండి.
* ఎవరి కోసమైనా ఆగితే, జనం ఉన్న ప్రాంతంలోనే ఉండాలి, ఒంటరిగా వద్దు.
* ప్రమాదం ఉందనిపిస్తే, డయల్ 100కు కాల్‌చేసి చెప్పండి. రక్షణ జోన్ లోకి తీసుకెళ్తారు.
* మహిళల రక్షణకోసం తయారుచేసిన హ్యాక్ ఐ అనే యాప్‌ను(hawk eye mobile app) డౌన్‌లోడ్ చేసుకోండి
* 112 కు కాల్‌చేసినా జీపీఎస్ ద్వారా పోలీసులు వస్తారు
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,034; 97 తత్వాలు (Tatvaalu) and views 199,695 అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments