వైసీపీ ప్రభంజనం, తెదేపా స్వయ పతనం, పవన్ బలం, బీజేపీ నాయక రాజీనామాలా, తాడిపత్రి - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,836; 104 తత్వాలు (Tatvaalu) and views 225,104.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* విజయ సాయి, సజ్జల, బాలినేని కృషి
* తాడిపత్రి లో, తెదేపా జేసీ హవా
* చీరాలలో వైసీపీ రెబల్ అభ్యర్థులు కూడా
* తెదేపా తన గొయ్యి, చంద్రన్న లోకన్న హైదరాబాద్ కే పరిమితం
* వైజాగ్ గంటా అలాగే సజ్జల
* మున్సిపల్ గెలవనందుకు, బీజేపీ రాజీనామా
* జనసేన ఏకసేన పవన్ ఒకరు వల్లనే కష్టం
* పన్నులు పెంచేయి, అప్పులు చేసేయ్
2 min read time.

వైయెసార్సీపీ ని అన్నీ తానై నడిపించాడు. వైయెస్ జగన్ ధైర్యానికి, పోరాటానికి, దీక్షకు, పట్టుదలకు, 10 ఏళ్ళ రాజకీయ ప్రస్థానమే ఉదాహరణ.

* అనుకున్నదే అయింది, జగనన్న ప్రభంజనం కొనసాగింది, అన్ని మున్సిపల్ కార్పోరేషన్ లు, మున్సిపాలిటీ లలో అత్యధిక స్ధానాలలో గెలిచింది. సంబరాలలో కార్యకర్తలు.

* వైజాగ్ లో విజయ సాయి మంత్రాంగం, పట్టు పని చేసింది. విజయవాడ గుంటూర్ లో ఫలించిన సజ్జల శ్రమ. ఒంగోలు లో బాలినేని కృషి ఫలించింది.

* చదువుకున్న మేధావులు అంతా, ఏకపక్షంగా వైసీపీ ని గెలిపించారు. ఓవరాల్ గా జగనన్న ప్రభ మోహం, ఇంకా ప్రజలలో తగ్గలేదు. పంచుడు కార్యక్రమాలు, జనానికి బాగున్నాయి.

* తాడిపత్రి లో, తెదేపా జేసీ హవా కొనసాగుతోంది, పెద్దిరెడ్డి ధాటికి తట్టుకుని.

* చీరాలలో వైసీపీ రెబల్ అభ్యర్థులు కూడా గెలిచారు, సొంత గుర్తు తో కూడా, ఆమంచి వర్గీయులు పట్టు నిరూపించారు. కరణం కృషి ఫలించింది, బాలినేని అండతో.

* తెదేపా నాయకులు, జనం గురించి ఆలోచన చేయని పట్టులేని, ధనం ఉన్న వారిని పార్టీ లో పెట్టుకుని, మేపి పోషించి, ఇప్పుడు తన గొయ్యి తానే తీసుకుంది. సుజనా, సీఎం రమేష్ బీజేపీ తో, నిస్సిగ్గుగా తిరుగుతూ ఉన్నా, నోరెత్తలేని తెలుగు వెలుగుల ఆత్మాభిమానం.

మంత్రులు గా వీర విహారం చేసిన, నెల్లూరు నారాయణ, వైజాగ్ గంటా సైలెంట్. వీరిని నెత్తిన పెట్టుకున్న, ఫలితాలు కనపడ్డాయి.

* కరోనా సమయంలో, రోడ్డు మీద ప్రజలతో, తెదేపా నుంచి ఒక్క స్ధానిక నాయకుడు లేడు. ప్రకాశం లో నాడు వెలుగొందిన, చేవ లేని నాయకులు, సిద్దా గోడ దూకారు, దామచర్ల ఉపయోగం లేదు.

* చీరాల లో కరణం కోసం, పార్టీ ని, అధిష్టానమే కావాలని పాతేసింది.

* చంద్రన్న లోకన్న హైదరాబాద్ కే పరిమితం అవడం, ఇంకో నష్టం. పవన్ ను తూలనాడి, దూరం చేసుకుని, ఇబ్బందులు పడుతున్నారు. తెదేపా అధిష్టానం స్వయంకృతాపరాధం.

* వైజాగ్ గంటా అలాగే సజ్జల, ఒక్క సీటు లేని పవన్ ను, కేంద్రం తో మాట్లాడు అంటున్నారు అంటే, పవన్ బలం ను వారు ఒప్పుకున్నట్లే. తెలంగాణ లో మేమే గెలిచాం సొంతం గా, మాకు ఎవరూ అవసరం లేదు అని బీరాలు పలికి గేళిచేసిన బీజేపీ, ఈరోజు పవన్ ని, తెరాసా పీవీ కూతురు కి ఇచ్చిన మద్దతు ను, తప్పు పట్టడం విడ్డూరంగా ఉంది.

* ఇక గెలుపు భయపెట్టి, ఫించన్ రాదు ఇంకోటి రాదని, బలవంతంగా ఓటు వేయించారు అని అన్నా, తెదేపా అప్పుడు కూడా, అవే మాటలు వచ్చాయి కదా.

దాని బదులు, మన బద్దకం నిర్లక్ష్యం తప్పులు ఒప్పుకుంటేనే, కష్టపడి పని చేసి, రేపు గెలుపు ఉంటుంది ప్రతిపక్ష సభ్యులు కు.

* రాష్ట్ర బీజేపీ నాయకులు మాటలు కోతలు ఎక్కువ, అసలు పని తక్కువ. ప్రకాశం జిల్లా లేదా వైజాగ్ లో మున్సిపల్ ఎన్నికల్లో గెలవనందుకు. పనిచేయని వ్రుధాగా పదవులు అనుభవిస్తున్న, బీజేపీ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, గుంటూరు కన్నా లక్ష్మీనారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నాయకులు, అలాగే ఇతర పార్టీల కు కోవర్టు లుగా పని చేస్తున్న వారు, బాధ్యత గా రాజీనామా చేసి, కొత్త వారితో రాష్ట్ర బీజేపీ బలం ను పునరుద్ధరణ చేయాలని, బీజేపీ అభిమానులు కోరుతున్నారు.

* జనసేన ఏకసేన పవన్ ఒకరు వల్లనే కష్టం కాబట్టి, కనీసం అన్ని నియోజకవర్గాల్లో యువకులు కు అవకాశం ఇచ్చి, స్ధానిక సమస్యలు ను లేవనెత్తి, సోషల్ మీడియా లో ప్రచారం చేస్తూ, జనం ను కలుస్తూ వార్డులలో అడిగినా కూడా, పట్టణ గ్రామ అధ్యక్షుడు ఫోటో మరియు పేరు గుర్తు పట్టే విధంగా ఉంటే నే జనసేన, బీజేపీ, తెదేపా మరలా నిలబడతాయి. లేదంటే, జగన్ మాత్రమే ఉంటారు అధికారములో.

స్ధానిక సోషల్ మీడియా లో రోజు కు ఒక పోస్ట్, స్ధానిక సమస్యలు నాయకులు గురించి ఉండాలి.

కొసమెరుపు - రెండు ఏళ్లుగా ఎన్ని అప్పులు చేసినా, ప్రజల పన్నుల పధకాలు కు జగనన్న వైఎస్సార్ పేర్లు పెట్టకున్నా, మూడు రాజధానులు చేసినా, పన్నులు పెంచినా, నేల కట్టుబడి లేకపోయినా, అన్నింటికీ చదువుకున్న పట్టణ ప్రజలు ఆమోదించారు. జగనన్నా ఇక పన్నులు పెంచేయి, అప్పులు చేసేయ్, ఆంధ్రా ని దున్నేయ్ అంటున్నారు. అందుకే చదువుకున్న వారి కన్నా, ఎవరో మేలు అన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,836; 104 తత్వాలు (Tatvaalu) and views 225,104
Dt : 14-Mar-2021, Upd Dt : 14-Mar-2021, Category : Politics
Views : 821 ( + More Social Media views ), Id : 1030 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ycp , municipal election , prabhanjanam , tdp , jagan , vijay sai , sajjala , balineni , pawan , chandranna , bjp leader , resignation , tadipatri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content