Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Ye Thalli Ninu Kannadho - Daana Veera Soora Karna - NTR, Balakrishna, Harikrishna, B Saroja, Prabha
*పాటతో పరమార్ధం - ఏ తల్లి నిను కన్నదో (Parody) - దాన వీర శూర కర్ణ - ఎన్టీఆర్, బాలకృష్ణ, హరికృష్ణ, బి సరోజ, ప్రభ*
నాటి ఒక సంస్కార తల్లి, తన పిల్లలకు ఎలా మంచి బుద్దులు నేర్పాలో చెప్పే, మంచి పదాల పాట ఇది. ఈ నాటి తల్లి తండ్రులు కూడా, ఇలా మన పురాణాలు వేదాలు నీతి ధైర్య కధలు చెప్పి, పిల్లలను మానసిక బలవంతులుగా చెయాలి.
ప్రాపంచిక బతుకు సంపాదన విద్య బడిలో చెప్పినా, మానసిక విద్య ఇంట్లోనే చిన్నప్పటి నుంచే, తల్లి దగ్గర ఉండి నేర్పాలి. ఇది చాలా పెద్ద బాధ్యత. మరి నేటి తల్లులు ఉద్యోగాలు వ్యాపారాలు సంఘాలు సమావేశాలు ఓటీటీలు సోషల్ మీడియా, వీలైనన్ని కుటుంబ పతన దోవలు అంటూ బిజీ బిజీ.
దుష్ట చతుష్టయములో ఉన్న కర్ణుని గురించి, మనము మంచిగా చెప్పకూడదు కాబట్టి, పేరడీ పాటగా మార్చి, అందులో అవే మంచి లక్షణాలతో ఉన్న మన రాఘవుడుని అంటే శ్రీ రాముని, అలాగే తన రాజ్యాన్ని మరియు తన సర్వస్వము ను దానం ఇచ్చి, ఒట్టి చేతులతో అడవులకు తరలిన, ఆఖరికి కాటి కాపరిగా నిలచిన, సత్య హరిశ్చంద్రుని తలుద్దాము, పిల్లలకు వారి గురించి కధలు గుణాలు లక్షణాలు చెపుదాము.
కాకపోతే, కర్ణునికి కొన్ని మంచి లక్షణాలు అలవాటు పడ్డాయి కాని, అరిషడ్వర్గాలకు లొంగి, చెడువైపు నడవకూడదు, రాజ్యాన్ని క్షత్రియ వీరుడు దానం తీసుకోడు, తన ఉనికి కోసం అన్న తెలివి కలగలేదు. దుష్ట చతుష్టయములో ఉన్న, వ్యక్తులను తీసుకుని ఎవరూ ఇలాంటి సినిమా తీయకూడదు, చెడును ప్రోత్సహించకూడదు. ప్రోత్సహిస్తే, జీవిత చరమాంకములో అయినా, ఘోరముగా అదే చెడుతో దెబ్బ తింటారు, ప్రత్యక్ష సాక్ష్యం చూసాము.
రారాజు నుంచి రాజ్యాన్ని దానము గా, అప్పనముగా పొంది, ఇంక మనము చేసే దానం ఏమిటి? కవచ కుండలాలు ఇచ్చి కూడా, అస్త్రం తీసుకున్నారు. పోనీ ఇవన్నీ నిజమే అనుకున్నా, ఉన్నది చెడు వైపు, ఇంక ఏమని పొగడాలి?
కర్ణుడు దాన కర్ణుడు అయితే, ప్రభుత్వ భూములు ఎకరాలు ఎకరాలు దోచి, తాకట్టు పెట్టి, అమ్మి, లేదా ఫైనాన్స్ లో 10 మంది దగ్గర 10 కోట్లు దోచి, జనాలకు 10 వేలు పంచే నాయకులు/ నటులు/ దురాశాపరులు కూడా దాతలే కదూ మనకు, అవ్వ? అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలకు? అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదే సామెత.
మన అమ్మ కూడా, మనల్ని చూసి, ముదుసలి తనములో, ఇలా గర్వముగా పాడాలి - ఏ జన్మ రుణ మున్నదో, నేను నీ తల్లినైనానురా, నా వరాల పంటగా, నీవు నా ఇంట వెలశావురా అని.
మరి మీరూ అంత ఉన్నత విలువలతో ఎదుగుతారు/ ఎదిగారు కదూ? ముదుసలి తల్లి తండ్రికి, చేతి కర్రగా ఉండి, రోజూ 1 మైలు నడిపించి, ఇంటి ఆయుర్వేద మందులు ఇస్తూ, సజీవ గురువు గా సేవ చేస్తూ, ఆరోగ్యం ఆయువు పెంచుతారు, రుణం తీర్చుకుంటారు కదూ. మీరూ, మీ అమ్మకు నాన్నకు పాడి వినిపిస్తారు కదూ?
అజస్త్ర సహస్ర, నిజ ప్రభలతో, అజేయుడవు కావలెరా...నీ శౌర్యము గని, వీర రాఘవుడని నిఖిల జగంబులు వినుతించవలెరా. బలి శిభి దధీచి లను, తలదన్ను మహా దాతవై, అడిగినదానికి, లేదన్నది, ఏనాడు నీ నోట రానిదై, నీ నామము విని, హరిశ్చంద్రుడని, యుగయుగాలు నిను స్మరియించవలెరా.. అంతేనా? వీరికన్నా గొప్ప ఎవరు? కనీసం మనము క్రుతజ్ఞత విశ్వసనీయత సజీవ గురువు సేవ లో ఉన్నా, గొప్పగా ఉందాము.
Parody -
ఏ జన్మ రుణ మున్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ..
నీ తల్లినైనానురా...
నా వరా.ల తొలిపంటగా... ఆ.. ఆ..
నా వరా.ల తొలిపంటగా... నీవు నా ఇంట వెలశావురా..ఆ..
నా ఇంట వెలశావురా ...
ఏ జన్మ రుణ మున్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ..
నీ తల్లినైనానురా...
చరణం 1:
లలిత లలిత జల, లహరుల ఊయల లూ.గినావు... అలనా.డే
తరుణ తరుణ రవి, కిరణ పధంబుల, సా.గినావు తొలినా.డే
అజస్త్ర సహస్ర, నిజ ప్రభలతో, అజేయుడవు కావలెరా...
నీ శౌర్యము గని, వీర రాఘవుడని...
నీ శౌర్యము గని, వీర రాఘవుడని... నిఖిల జగంబులు వినుతించవలెరా
చరణం 2:
మచ్చ ఎరుంగని, శీల సంపదకు, స్వఛ్ఛమైన ప్రతిరూ..పమై
బలి శిభి దధీచి, వదాన్యవరులను, తలదన్ను మహా..దా.తవై...
అడిగినదానికి, లేదన్నది, ఏనాడు నీ నోట రా.నిదై...
నీ నా.మము విని, హరిశ్చంద్రుడని...
నీ నా.మము విని, హరిశ్చంద్రుడని... యుగయుగా.లు నిను స్మరియిం.చవలెరా.
Original -
ఏ తల్లి నిను కన్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ..
నీ తల్లినైనానురా...
నా వరాల తొలిపంటగా... ఆ.. ఆ.. ఆ..
నా వరాల తొలిపంటగా... నీవు నా ఇంట వెలశావురా
నా ఇంట వెలశావురా ...
ఏ తల్లి నిను కన్నదో... నేను నీ తల్లినైనానురా.. ఆ.. ఆ..
నీ తల్లినైనానురా...
చరణం 1:
లలితలలితజల లహరుల ఊయలలూగినావు... అలనాడే
తరుణతరుణ రవి కిరణ పధంబుల... సాగినావు తొలినాడే
అజస్త్ర సహస్ర నిజ ప్రభలతో అజేయుడవు కావలెరా...
నీ శౌర్యము గని వీర కర్ణుడని...
నీ శౌర్యము గని వీర కర్ణుడని... నిఖిల జగంబులు వినుతించవలెరా
చరణం 2:
మచ్చ ఎరుంగని శీల సంపదకు స్వఛ్ఛమైన ప్రతిరూపమై
బలిశిభిదధీచి వదాన్యవరులను తలదన్ను మహాదాతవై...
అడిగినదానికి లేదన్నది ఏనాడు నీ నోట రానిదై...
నీ నామము విని దాన కర్ణుడని...
నీ నామము విని దాన కర్ణుడని... యుగయుగాలు నిను స్మరియించవలెరా
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1950 General Articles and views 1,574,009; 97 తత్వాలు (Tatvaalu) and views 198,580 Dt : 31-May-2023, Upd Dt : 31-May-2023, Category : Songs
Views : 172
( + More Social Media views ), Id : 1767 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Thalli ,
Ninu ,
Kannadho ,
Daana ,
Veera ,
Soora ,
Karna ,
NTR ,
Balakrishna ,
Harikrishna ,
Saroja ,
Prabha Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments