Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. అన్న ఎన్టీఆర్ ఆశయసాధనే లక్ష్యంగా తెలుగుదేశం పిలుస్తోంది - పసుపు దళపతులారా డిజిటల్ మహానాడు 2020 కు సంసిద్ధులు కండి అని పిలుపు నిచ్చారు నేటి మహానాడుకు తెలుగు దేశం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
తెలుగు దేశం అభిమానులు కు మొదలైన పండుగ సంబరాల శుభాకాంక్షలు.
చంద్రన్న ఆంధ్రా లో అడుగు పెట్టగానే, పసుపు కళ రెప రెప లాడింది. తెలుగు తమ్ముళ్లు లో చైతన్యం ఉత్సాహం పెల్లుబికింది.
కొత్త లుక్ తో యువరాజు లోకేష్ వినూత్నమైన మార్పు లాక్ డౌన్ తర్వాత. పార్టీలో మరలా జీవం మొదలు అయింది, మరి ప్రభంజనం అవుతుంది ఏమో చూడాలి.
జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన తెలుగు దేశం అధ్యక్షుడు. మొదటి ఆహ్వానం ఫోటో చూడండి, వీడియో లు చూడండి.
సాంకేతిక పరిజ్ఞానం అనేది ఎలాంటి సమస్యలకైనా, ఒక పరిష్కారం చూపుతుందనే నా నమ్మకం ఎప్పటికప్పుడు బలపడుతూనే ఉంది. లాక్ డౌన్ కాలంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూనే, డిజిటల్ సోషలైజేషన్ దిశగా మనం వెళ్ళామంటే, దానికి కారణం సాంకేతికత. ఈసారి జరుగుతున్న డిజిటల్ మహానాడు 2020 కూడా అలాంటిదే అన్నారు.
ప్రతి ఏడాది అసంఖ్యాక జన సందోహం మధ్య వేడుకగా జరుపుకునే మహానాడుకు ఈసారి లాక్ డౌన్ నిబంధనలు అడ్డొచ్చాయి. అయితేనేం జూమ్ వెబినార్ పేరిట సాంకేతికత మనకో మార్గం చూపింది. దేశంలోనే మొదటిసారిగా జరుగుతున్న ఒక డిజిటల్ రాజకీయ సమావేశం మన మహానాడు 2020
తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులంతా మీ మొబైల్ లేదా ట్యాబులలో జూమ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని మే 27,28 తేదీలలో జరిగే ఈ డిజిటల్ మహానాడులో పాల్గొనండి. ప్రతి మహానాడు మాదిరిగానే ఈ మహానాడుని కూడా విజయవంతం చేయండి.
అన్నగారి ఆశయజ్యోతి అందుకున్న నువ్వు మా స్ఫూర్తి, అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురించి కూర్చిన, ఉత్తేజకరమైన ఈ పాట(వీడియో) తెలుగుదేశం అభిమానులకోసం.
తెలుగుదేశం పార్టీని తొలిసారి అధికారంలోకి తెచ్చిన తర్వాత 1983, మే 26,27,28 తేదీలలో విజయవాడలో మహానాడు నిర్వహించారు ఎన్టీఆర్. అత్యంత ఘనంగా జరిగిన ఆ వేడుకలకు జాతీయస్థాయి నాయకులందరూ హాజరయ్యారు.
మహానాడు వేడుకవేళ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహనీయునికి ప్రణమిల్లిన పార్టీ జాతీయాధ్యక్షుడు బాబు గారు.
మహానాడు అంటే తెలుగుదేశం నేతలకు, తెలుగు తమ్ముళ్ళకు, పార్టీ కార్యకర్తలకు పండుగ ఒక వేడుక.
నా ఇష్టం నా రాజ్యం అన్నట్లుగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు - యనమల రామకృష్ణుడు అన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక స్వర్గీయ నందమూరి తారకరామారావుగారు. ఆయన తెలుగుదేశం పార్టీని ఎందుకు స్థాపించారు? పార్టీ లక్ష్యాలేంటి? పార్టీ ఎవరికోసం? అన్న సందేహాలకు ఆనాడు ఒక్క వాక్యంలో సమాధానం చెప్పారు ఎన్టీఆర్. నాడు ప్రతి తెలుగు హృదయాన్నీ పులకింపజేసిన ఆ మాటలు నేటి తరం కోసం, వీడియో చూడండి.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహానాడు సందర్బంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాళా పరిస్థితికి తీసుకువచ్చి, ప్రజలపై భారం మోపుతూ రూ. 50వేల కోట్ల పన్నులు పెంచిందని విమర్శించారు. లాక్ డౌన్‌తో పనులులేక, తినడానికే తిండి లేకపోతే ఈ ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచిందని విమర్శించారు. టీడీపీ హయాంలో భవిష్యత్‌లో కరెంట్ చార్జీలు పెంచమని చెప్పిన విషయాన్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. మద్యం, ఇసుక, సిమ్మెంట్, ఆర్టీసీ, అన్నింటిపై చార్జీలు పెంచిందని ఆరోపించారు.
కరోనా వైరస్ వస్తే ఉద్యోగస్తులు, పెన్షనర్స్‌కు 50 శాతం జీతాలు తగ్గించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు వైసీపీ కాంట్రాక్టర్లకు మాత్రం డబ్బులు ఇచ్చారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లే ముఖ్యమని, ఉద్యోగస్తులు ముఖ్యంకాదా? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ పీపీఈలు ఇవ్వమని అడిగినందుకు ఆయనను ఏకంగా సస్పెండ్ చేసి, ఆయనపై పిచ్చోడని ముద్ర వేశారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి, జైల్లో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఇంతకు ముందుకూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తే..ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టామన్నారు. వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామన్నారు. డ్వాక్రా సంఘాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఆడబిడ్డలపై దాడులు చేస్తున్నారని, దిశ చట్టం తీసుకువచ్చి ఏం చేసిందని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1981 General Articles and views 1,679,450; 102 తత్వాలు (Tatvaalu) and views 207,836 Dt : 27-May-2020, Upd Dt : 27-May-2020, Category : News
Views : 1644
( + More Social Media views ), Id : 10 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
yellow troopers ,
digital mahanadu ,
celebration ,
festivity ,
telugu desam ,
nara chandrababu ,
nara lokesh ,
yanamala ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments