వైఎస్సార్ రాజా జగనన్న, ఎన్టీఆర్ చంద్ర లోకేష్ - రాబోయే పధకాల పేర్లు, మోహం వదలదా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1437 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1471 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ట్రంప్ బైడెన్, మంచి ఉత్కంఠ పోటీలో ఉన్నారు. బైడెన్ ముందు వరసలో విజయానికి చేరువలో ఉన్నారు. 264 ఎలక్టోరల్‌ ఓట్లతో బైడెన్‌, 214 ఓట్లతో దూరంలో ట్రంప్‌. ఇద్దరికీ అనుకూలముగా, అనుచరులు దేశమంతా ధర్నాలు చేస్తున్నారు.

చిత్రము ఏమిటి అంటే, ప్రజల పన్నులతో వారు పెట్టే ఏ పధకానికి, వారి పేరు ఉండదు. ఎందుకంటే, వారికి ఆత్మాభిమానము ఉంది, మా పనులు జనుల గుండెల్లో మాత్రమే నిలవాలని. మరి మన దగ్గర, ఈ పేర్ల పిచ్చి ఏమిటి?

ఉత్తరాది వాళ్ళు మరియు మోదీ అమిత్షా నవ్వు కుంటారు, ఏమిటి, ఈ తెలుగు వారి పధకాల, పేర్లు పిచ్చి అని. 5 లేదా 10 ఏళ్ళకు ప్రభుత్వం మారుతుంది అని తెలిసి కూడా, ఇంత మోహము ఎందుకు మనకు? తమ వ్యక్తిత్వం మీద నమ్మకము లేకనా?

లోకేష్ అన్నా, ముందు నువ్వే ధైర్యముగా ప్రకటించు, జరిగింది జరిగింది, ఇకనుంచి మేము గెలిస్తే, మా పేర్లు ప్రభుత్వ పధకాలకు చేర్చము. ప్రభుత్వం మారినప్పుడు, ఫోటో మారిస్తే చాలు. పేర్లు రంగులు మార్చక్కరలేదు, ధనము సేవ్ చేద్దాము, అని మన తెదేపా అభిమానుల ఆలోచన.

ఈ మెస్సేజ్ జగనన్న కు చేరితే, వారు ముందు ప్రకటిస్తే ఈ విధానం, మనకు పేరు క్రెడిట్ ఉండదు. ఎందుకంటే, ఇది సలహా దారుల మాయ మాత్రమే.

జగనన్న కు ఇష్టం లేదు, ఉపయోగం లేదు. చంద్రన్న ను మొన్న కాపాడలేదు.

ఇలా చేసిన వారిని తప్పకుండా, మోదీ గౌరవిస్తారు.

వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరు నిర్ణయించినట్లు మంత్రి కన్నబాబు ప్రకటించారు.

దీనిని వైఎస్సార్ పార్టీ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు, పేరు ఈ విధంగా మార్చిన బాగుంటుంది, తాత పేరు ఎందుకు వదిలేసారని ఆవేదన చెందుతున్నారు. మనకు వీరిని ఇచ్చిన ఆయనను ఎందుకు కలపకూడదు అని వీరి వాదన.

వైఎస్సార్ రాజారెడ్డి జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ, పధకం అంటే బాగుంటుంది ఏమో?

తర్వాత, లోకేష్ అన్న వస్తే, ఎన్టీఆర్ చంద్రన్న లోకేష్ శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ, అని పేరు మారుస్తారు.

మనం చూపిన దోవలో నే వారూ నడుస్తారు కదా, అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చూడండి, సలహా దారులు, జగనన్న ను ఎలా మాయ చేస్తున్నారో.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1471 General Articles, 48 Tatvaalu
Dt : 05-Nov-2020, Upd Dt : 05-Nov-2020, Category : Politics
Views : 406 ( + More Social Media views ), Id : 794 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ysr , raja , jagannanna , ntr , chandra , lokeshanna , names , upcoming schemes , passion , leave , andhra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content