1.
బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన ఐసీసీ.. టీ 20 వరల్డ్‌కప్ షెడ్యూల్లో నో ఛేంజ్! - 2026-01-07T09:11:02+05:30
భారత్‌లో జరిగే టీ 20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. భద్రతా కారణాలు చూపి ఐసీసీ లేఖ రాసిన బీసీబీకి షాక్ తగిలింది. పాల్గొనడం సభ్య దేశాల బాధ్యత అని, రాకపోతే పాయింట్లు కోల్పోతారని ఐసీసీ స్పష్టం చేసింది. ముస్తాఫిజుర్ రహ్మాన్ విడుదల వివాదమే దీనికి ప్రధాన కారణం. ఇప్పటికే ఈ వివాదం నేపథ్యంలో బంగ్లాలో ఐపీఎల్ చూడటాన్ని కూడా బ్యాన్ చేశారు.
ఇంకా
2.
రూ.816 కోట్లతో కృష్ణానదిపై భారీ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్.. తిరుపతికి తర్వగా వెళ్లిపోవచ్చు - 2026-01-07T11:14:04+05:30
రెండు తెలుగు రాష్ట్రాలను కలిపే కృష్ణా నదిపై సోమశిల వద్ద రూ.816 కోట్లతో కిలోమీటరుకు పైగా పొడవునా ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మించనుంది కేంద్రం. దీనితో నంద్యాల, తిరుపతి ప్రయాణాలకు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు టెండర్లు ఆహ్వానించడంతో కీలక ముందడుగు పడింది. ఈ వంతెనతో రవాణా సౌకర్యంతో పాటు పర్యాటకం కూడా మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 36 నెలల్లో దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంకా
3.
సిడ్నీ టెస్టులో ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. గాయంతో గ్రౌండ్ వీడిన బెన్ స్టోక్స్ - 2026-01-07T11:21:02+05:30
యాషెస్ సిరీస్ చివరి టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయంతో మైదానం వీడటంతో జట్టులో ఆందోళన నెలకొంది. ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడిన ఇంగ్లండ్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. గాయం తీవ్రతపై వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉన్నా, జట్టు పరిస్థితి క్లిష్టంగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆధిక్యం సాధించగా, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 55 ఓవర్లకు 228/5తో ఉంది.
ఇంకా
4.
విజయవాడలో 'ఆవకాయ అమరావతి' ఉత్సవాలు.. మూడు రోజుల షెడ్యూల్ ఇదే - 2026-01-07T11:15:24+05:30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడలో జనవరి 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు 'ఆవకాయ అమరావతి ఉత్సవాలు' నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. భవానీ ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం, సంగీతం, సినిమా, సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి. ఆవకాయ అమరావతి ఉత్సవాలకు ప్రవేశం ఉచితం. ఆన్‌లైన్‌లోనూ వీక్షించవచ్చు. అయితే ఆన్లైన్లో చూడాలనుకునే వారు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి.
ఇంకా
6.
నివాస భవనాలకు బిల్డింగ్ కోడ్ తప్పనిసరి.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. - 2026-01-07T10:17:43+05:30
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నివాస భవనాలకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ECBC)ను తప్పనిసరి చేసింది. 4 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఈ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుంది. కాగా, భవన నిర్మాణంలో విద్యుత్ ఆదా, నీటి సంరక్షణ, పర్యావరణ హితమైన మెటీరియల్స్ వాడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక ఈ ఈసీబీసీని అనుసరించి నిర్మించిన నివాస భవనాలను ఎకో నివాస్ సంహితగా ప్రభుత్వం గుర్తిస్తుంది
ఇంకా
7.
వెనిజులాలో అమెరికా మెరుపుదాడి: ప్రాణభయంతో పారిపోతున్న గెరిల్లా కమాండర్లు.. సరిహద్దుల్లో హై అలర్ట్! - 2026-01-07T11:10:36+05:30
అధ్యక్షుడు నికోలస్ మదురో పతనం కావడంతో.. దశాబ్దాలుగా వెనిజులాను సురక్షిత స్థావరంగా మార్చుకున్న కొలంబియా గెరిల్లా నేతలకు ఇప్పుడు చావు భయం పట్టుకుంది. ఇన్నాళ్లూ మదురో అండతో డ్రగ్స్ మాఫియాను శాసించిన ఈఎల్ఎన్ (ELN), ఫార్క్ (FARC) తిరుగుబాటుదారులు ఇప్పుడు అడవుల బాట పట్టారు. అమెరికా క్షిపణులు తమ స్థావరాలను ఊడ్చిపారేయడంతో ప్రాణాలు దక్కించుకోవడానికి సరిహద్దుల వైపు పరుగులు తీస్తున్నారు. మరోవైపు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరికలు జారీ చేయడం.. దానికి పెట్రో "మాతృభూమి కోసం ఆయుధాలు పడతానంటూ" ప్రతిన బూనడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇంకా
8.
ఎల్ఐసీ, ఎస్బీఐ స్కీమ్స్‌తో భారీ నష్టాలు.. మూడేళ్లలో ఇదీ పరిస్థితి.. మరీ ఇలా అయితే ఎలా? - 2026-01-07T10:38:57+05:30
Tata Small Cap Fund: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకొని ఉంటాయని చెప్పొచ్చు. ఇక్కడ స్టాక్ మార్కెట్‌కు లింక్ అయి ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడి అందిస్తుంటాయని చెబుతుంటారు. అయితే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఎక్కువ రిస్క్‌తో కూడుకొని ఉంటాయి. గత మూడేళ్లలో నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చిన టాప్ ఫండ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంకా