Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Pahi Rama Prabho - Lord Sri Rama - Bhadrachala Ramadasu Kirtana
రామయ్య పాటలు పాడుకునేది, రామయ్య గుణాలను మన కుటుంబములో ఒకరైనా అలవరచుకుని, ఇంటిల్లిపాదీ ని మనశ్శాంతి తో ఉంచాలని, క్రుతజ్ఞత మరియు విశ్వసనీయత ల తో పెద్దలను గౌరవిస్తూ. అయోధ్యా మరియు భద్రాచల రామయ్యలకు, ఈ గీతాన్ని కూడా, శారీరక మానసిక గాత్ర నైవేద్యం తో సమర్పిద్దామా.
Rama songs are sung, Rama qualities should be adopted by any one of our family, and full family should be kept with peace of mind, respecting the elders with gratitude and trustworthiness. To the Rama of Ayodhya and Bhadrachala, let us offer this song too, with a physical mental vocal offering.
పాహి రామప్రభో, పాహి రామప్రభో 2
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో..పాహి రామప్రభో ...
1.ఇందిరా హృదయారవిందాధి రూఢ -
సుందరాకార నానంద రామప్రభో..
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో.. ||పాహి రామప్రభో||
2.బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్షితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో ||పాహి రామప్రభో||
3.నీదు బాణంబులను, నాదు షతృల బట్టి -
బాధింపకున్నావదేమి రామప్రభో...
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే, జగన్నాథ రామప్రభో.. ||పాహి రామప్రభో||
4.శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా, చదువు రామప్రభో..
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో ||పాహి రామప్రభో||
5.కలికి రూపము దాల్చి, కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో..
అవ్యయుడవైన, ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో..||పాహి రామప్రభో||
6.పాహి శ్రీ రామ, నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశీల రామప్రభో..
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో..||పాహి రామప్రభో||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,337,867; 104 తత్వాలు (Tatvaalu) and views 253,478 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.