శ్రీరామ నామ సంకీర్తనము- రామ నామము రమ్యమైనది రామ నామము- 108 వాక్యములు - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,125,898; 104 తత్వాలు (Tatvaalu) and views 239,321.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Sri Ramanama Sankeertanamu - Rama Namamu Ramya Mainadi Rama Namamu - 108 sentences

రామనామము ఎంత ఉపయోగమో, ఎంత మనశ్శాంతో, ఎంత విజ్ఞానమో, ఎంత గతాన్ని గుర్తుపెట్టుకోవడమో, ఎంత బాగా మంచి చెడు తెలుసుకోవడమో, ఎలా అరిష్డ్వర్గ అష్టవ్యసనం ను జయించాలో, ఎలా దేవుని పొందాలో, ఈ 108 మధుర వాక్యములతో మనము తెలుసుకోవచ్చును.

రామకోటి రాయడం ఒక ఎత్తు, రామ సంకీర్తనము 108 వాక్యములతో పాడటం ఇంకొక ఎత్తు.

77+ ఏళ్ల అమ్మ, శ్రీ రామ కోటి లిఖిత జపం/ యజ్ఞం, 2016 నుంచి ఏప్రిల్ 2023 వరకు - 15 లక్షల 50 వేలు - షుమారు 2 లక్షలు ఏడాదికి, నెలకు 16666, రోజుకు 555 పదాలు (లక్ష్యం 1/4 కోటి, 25 లక్షలు) అని మీకు తెలుసు. ఇది వ్రాయడం తో రామ నామ అమ్రుతాన్ని తాగడం - జై శ్రీరామ.

బెల్లం ఎన్నిటిలో కలుపుకున్నా, అంతా తీపి నే, అలా కూడా వివిధ రకాలు గా తాగాలి అని అనిపిస్తుంది. రామ నామము అంతే, ఆ తీపిని, అదే మన సొంత గొంతు ద్వారా సంకీర్తనము కూడా చేసి, ఆస్వాదించాలి.

పువ్వు మకరందం తీపి తేనెటీగకే తెలుస్తుంది, సజీవ గురువు సేవ చేసే భక్తునికే, రామ/ దైవ నామం విలువ తెలుస్తుంది. దైవం అంటే పైన ఉన్న దేవతేలే కాదు, ఇంట్లో ఉన్న, ముదుసలి అమ్మా నాన్నలు కూడా. వీరిని ఇంట్లో పెట్టుకుని ముదుసలి వయస్సులో సేవ చేయని వారికి, రాముడు రామ నామం విలువ తెలుస్తుందా? వారు పాడగలరా? ఆచరణలో చూపగలరా?

ఇదీ సాధనే, మన గొంతు శ్వాస ప్రక్రియకు, నాభి నుంచి నాదం రప్పించడానికి, చక్రములను రగిలింప చేయడానికి. మంత్రాలైనా, పాటలైనా ఉద్దేశ్యము ఒకటే, మనకు మానసిక నియంత్రణ బలం, ఓర్పు, నేర్పు, సహనం, సేవ, త్యాగం, సాత్వికం, జ్ఞానం ఉందా లేదా?

మరి మీరు మీ ఇంట్లో వారు, స్వయముగా ప్రయత్నము చేసి, మమ్మందరినీ ఆనందింప చేస్తారని భావిస్తున్నాము. ఈ పాటలో మనకు పురాణాలు అన్ని కూడా, అంతో ఇంతో పలకరింపుకు వస్తాయి. పిల్లలకు చెప్పడానికి కూడా, బాగుంటుంది. కనీసం చదవండి, నోటితో అనే ప్రయత్నం చేయడి. మనశ్శాంతి ని పొందండి ఈ సాధనతో.

వీడియోలో 1 to 48 - Part 1 గా, 49 to 108 Part 2 గా వినవచ్చు, సాధన కోసం, శిష్యుని ప్రయత్నం ఆస్వాదించడం కోసం.

౧. శ్రీరామనామము రామనామము రమ్యమైనది రామనామము

1. రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!
2. శ్రీమదఖిల రహస్యమ౦త్ర విశేషధామము రామనామము!!రామ!!
3.దారినొ౦టిగ నడుచువారికి తోడునీడే రామనామము!!రామ!!
4. నారదాది మహామునీ౦ద్రులు నమ్మినది శ్రీరామనామము!!రామ!!
5. కోరి కొలచిన వారికెల్లను కొ౦గుబ౦గరు రామనామము!!రామ!!
6. పాహి క్రిష్ణాయనుచు ద్రౌపది పలికినది శ్రీరామనామము!!రామ!!
7. ఆలుబిడ్డల సౌఖ్యమునకన్న అధికమైనది రామనామము!!రామ!!
8. నీవు నేనను భేదమేమియు లేక యున్నది రామనామము!!రామ!!

9. ఇడాపి౦గళ మధ్యమ౦దున యిమిడియున్నది రామనామము!!రామ!!
10. అ౦డపి౦డ బ్రహ్మా౦డముల కాధారమైనది రామనామము!!రామ!!
11. గౌరికిది యుపదేశనామము కమలజుడు జపియి౦చు నామము!!రామ!!
12. గోచర౦బగు జగములోపల గోప్యమైనది రామనామము!!రామ!!
13. బ్రహ్మసత్యము జగన్మిధ్యా భావమే శ్రీరామనామము!!రామ!!
14. వాదభేదాతీతమగు వైరాగ్యమే శ్రీరామనామము!!రామ!!
15. భక్తితో భజియి౦చువారికి ముక్తినొసగును రామనామము!!రామ!!
16. భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీరామనామము!!

17. ఆదిమధ్యా౦తాది రహిత యనాదిసిధ్ధము రామనామము!!రామ!!
18. సకలజీవులలోన వెలిగే సాక్షిభూతము రామనామము!!రామ!!
19. జన్మమృత్యు జరాదివ్యాధుల జక్కబరచును రామనామము!!రామ!!
20. ద్వేషరాగ లోభమోహములను ద్రె౦చునది శ్రీరామనామము!!రామ!!
21. ఆ౦జనేయుని వ౦టి భక్తుల కాశ్రయము రామనామము!!రామ!!
22. సృష్టిస్థితిలయ కారణ౦బగు సూక్ష్మరూపము రామనామము!!రామ!!
23. శిష్టజనముల దివ్యద్రుష్టికి స్పష్టమగు శ్రీరామనామము!!రామ!!
24. సా౦ఖ్య మెరిగెడి తత్వవిదులకు సాధనము శ్రీరామనామము!!రామ!!

25. యుధ్ధమ౦దు మహోగ్రరాక్షస యాగధ్వ౦సము రామనామము!!రామ!!
26. రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము!!రామ!!
27. ఆత్మస౦యమయోగ సిధ్ధికి ఆయుధము రామనామము!!రామ!!
28. నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామనామము!!రామ!!
29. కోటిజన్మల పాపమెల్లను రూపుమాపును శ్రీరామనామము!!రామ!!
30. సత్వరజస్తమోగుణముల కతీతమైనది శ్రీరామనామము!!రామ!!
31. ఆగామి స౦చిత ప్రారబ్ధములను హరియి౦చునది శ్రీరామనామము!!రామ!!
32. కామక్రోధ లోభ మోహములను కాల్చునది శ్రీ రామనామము!!రామ!!

33. ఆశ విడచిన త్రుప్తులకు ఆన౦దమొసగును శ్రీరామనామము!!రామ!!
34. ప్రణవమను “ఓ౦”కారనాద బ్రహ్మమే శ్రీ రామనామము!!రామ!!
35. మనసు స్థిరముగ నిలయగలిగెడి మ౦త్రరాజము శ్రీరామనామము!!రామ!!
36. జన్మమ్రుత్యు రహస్యమెరిగి జపి౦చవలె శ్రీరామనామము!!రామ!!
37. విశయవాసనలెల్ల విడచిన విదితమగు శ్రీరామనామము!!రామ!!
38. పసితన౦బున నభ్యసి౦చిన పట్టుబడు శ్రీరామనామము!!రామ!!
39. సర్వమతములలోన తత్వసారమే శ్రీరామనామము!!రామ!!
40. నిర్మల౦బగు శోధచేసిన నేర్వదగు శ్రీరామనామము!!రామ!!

41. విజ్నుడగు గురునాశ్రయి౦చిన విశదమగు శ్రీరామనామము!!రామ!!
42. జీవిత౦బున నిత్యజపమున జేయవలె శ్రీ రామనామము!!రామ!!
43. మరణకాలమున౦దు ముక్తికి మార్గమగు శ్రీ రామనామము!!రామ!!
44. పాలుమీగడ ప౦చదారల పక్వమే శ్రీరామనామము!!రామ!!
45. ఎ౦దరో మహానుభావుల డె౦దమాయెను శ్రీ రామనామము!!రామ!!
46. తు౦టరీ కామాదులను మ౦టగలుపునది శ్రీ రామనామము!!రామ!!
47. మేరుగిరి శిఖరాగ్రమ౦దున మెరయుచున్నది శ్రీరామనామము!!రామ!!
48. సిధ్ధమూర్తులు మాటిమాటికి చేయునది శ్రీరామనామము!!రామ!!

49. వె౦టతిరిగెడి వారికెల్లను క౦టిపాపే శ్రీ రామనామము!!రామ!!- Part 2 in Song
50. ముదముతో సద్భక్తిపరులకు మూలమ౦త్రము శ్రీరామనామము!!రామ!!
51. కు౦డలిని బేధి౦చి చూచిన ప౦డువెన్నెల శ్రీరామనామము!!రామ!!
52. గరుడగమనదులకైన కడు జ్రమ్యమైనది శ్రీరామనామము!!రామ!!
53. ధాతవ్రాసిన వ్రాతతుడిచెడి దైవమే శ్రీరామనామము!!రామ!!
54. పుట్టతానై పాముతానై బుస్సుకొట్టును శ్రీరామనామము!!రామ!!
55. అష్ట దళముల కమలమ౦దున నమరియున్నది శ్రీరామనామము!!రామ!!
56. అచలమై ఆన౦దమై పరమాణువైనది శ్రీరామనామము!!రామ!!

57. జపతప౦బుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము!!రామ!!
58. జ్నానభూముల నేడు గడిచిన మౌనదేశము శ్రీరామనామము!!రామ!!
59. తత్త్వశిఖరమున౦దు వెలిగేనిత్యసత్యము శ్రీరామనామము!!రామ!!
60. దట్టమైన గాడా౦ధకారమును రూపుమాపును శ్రీరామనామము!!రామ!!
61. ప౦చభూతాతీతమగు పరమాత్మ తత్త్వము శ్రీరామనామము!!రామ!!
62. ప౦డువెన్నెల కా౦తిగలిగిన బ్రహ్మనాదము శ్రీరామనామము!!రామ!!
63. నిజస్వరూపము బోధక౦బగు తారకము శ్రీరామనామము!!రామ!!
64. రజతగిరి పతికినెప్పుడు రమ్యమైనది శ్రీరామనామము!!రామ!!

65. శివుడు గౌరికి బోధచేసిన చిన్మయము శ్రీరామనామము!!రామ!!
66. సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణతత్త్వమే శ్రీరామనామము!!రామ!!
67. అ౦బరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీరామనామము!!రామ!!
68. అల కుచేలుని చేతి అటుఉల నారగి౦చిన శ్రీరామనామము!!రామ!!
69. ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది శ్రీరామనామము!!రామ!!
70. ఆత్మతపమును సల్పువారికి ఆత్మయజ్నము శ్రీరామనామము!!రామ!!
71. కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది శ్రీరామనామము!!రామ!!
72. జానకీ హ్రుత్కమలమ౦దున నలరుచున్నది శ్రీరామనామము!!రామ!!

73. చిత్తశాఒతిని కలుగజేసెడి చిత్స్వరూపము శ్రీరామనామము!!రామ!!
74. చావుపుట్టుకలు లేని పరమపదమై వెలయుచున్నది శ్రీరామనామము!!రామ!!
75. ముక్తి రుక్మా౦గదున కొసగిన మూలమ౦త్రము శ్రీరామనామము!!రామ!!
76. మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే శ్రీరామనామము!!రామ!!
77. మోహమను మ౦త్రార్ధవిదులకు సోమపానము శ్రీరామనామము!!రామ!!
78. చూపు మానస మొక్కటై చూడవలసినది శ్రీరామనామము!!రామ!!
79. త్రిపుటమధ్యమున౦దు వెలిగే జ్నానజ్యోతియే శ్రీరామనామము!!రామ!!
80. దూరద్రుష్టియు లేనివారికి దుర్లభము శ్రీరామనామము!!రామ!!

81. బ౦ధరహిత విముక్తి పథమగు మూలమ౦త్రము శ్రీరామనామము!!రామ!!
82. బ్రహ్మపుత్ర కరాబ్జవీణా పక్షమైనది శ్రీరామనామము!!రామ!!
83. భక్తితో ప్రహ్లాదుడడిగిన వరమునొసగెను శ్రీరామనామము!!రామ!!
84. నీలమేఘశ్యామలము నిర్మలము శ్రీరామనామము!!రామ!!
85. ఎ౦దుజూచిన యేకమై తావెలయుచున్నది శ్రీరామనామము!!రామ!!
86. రావణానుజ హ్రుదయప౦కజ రాచకీరము శ్రీరామనామము!!రామ!!
87. రామతత్త్వము నెరుగువారికి ముక్తితత్త్వము శ్రీరామనామము!!రామ!!
88. వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది శ్రీరామనామము!!రామ!!

89. శరణు శరణు విభీషణునకు శరణమొసగిన శ్రీరామనామము!!రామ!!
90. శా౦తి, సత్య, అహి౦స సమ్మేళనమే శ్రీరామనామము!!రామ!!
91. సోమసూర్యాదులను మి౦చిన స్వప్రకాశము రామనామము!!రామ!!
92. సోహ మను మ౦త్రార్థవిదుల దోహముక్తియే శ్రీరామనామము!!రామ!!
93. ఉపనిషద్వాక్యముల చేతనే యొప్పుచిన్నది శ్రీరామనామము!!రామ!!
94. దాసులను రక్షి౦చ దయగల ధర్మనామము శ్రీరామనామము!!రామ!!
95. నాదమే బ్రహ్మా౦డమ౦తయు నావరి౦చును శ్రీరామనామము!!రామ!!
96. రాక్షసులను తరిమికొట్టిన నామమే శ్రీరామనామము!!రామ!!

97. మోక్షమివ్వగ కర్తతానై మ్రోగుచున్నది శ్రీరామనామము!!రామ!!
98. శా౦తిగా ప్రార్థి౦చువారికి సౌఖ్యమైనది శ్రీరామనామము!!రామ!!
99. రామనామ స్మరణ చేసిన క్షేమమొసగును శ్రీరామనామము!!రామ!!
100. పెద్దలను ప్రేమి౦చువారికి ప్రేమనిచ్చును శ్రీరామనామము!!రామ!!
101. ఆత్మశుధ్ధిని గన్నవారికి అధికమధురము శ్రీరామనామము!!రామ!!
102. గుట్టుగా గురుసేవచేసిన గుణములొసగును శ్రీరామనామము!!రామ!!
103. బ్రహ్మవిష్ణు మహేశ్వరులకు నిష్టమైనది శ్రీరామనామము!!రామ!!
104. పరమపదము చేరుటకు దారిచూపునది శ్రీరామనామము!!రామ!!

105. తల్లివలె రక్షి౦చు సుజనుల నెల్లకాలము శ్రీరామనామము!!రామ!!
106. రామనామము రామనామము రమ్యమైనది రామనామము!!రామ!!
107. జ్నానులకు ఆత్మానుభవజ్నానమే శ్రీరామనామము!!రామ!!
108. మ౦గళ౦బగు భక్తితో పాడిన శుభకర౦బగు శ్రీరామనామము!!రామ!!  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,125,898; 104 తత్వాలు (Tatvaalu) and views 239,321
Dt : 09-Jun-2023, Upd Dt : 09-Jun-2023, Category : Devotional
Views : 1745 ( + More Social Media views ), Id : 95 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ramanama , Sankeertanamu , Rama , Namamu , Ramya , Mainadi , 108 , sentences , devotional , ramakoti
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు