20 ఏళ్ళుగా మంచి గురువు కోసం ప్రయత్నం. ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞానం కోసం, ఫలితం లేదు. యోగ్యత లేదా? - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2060 General Articles and views 1,787,142; 104 తత్వాలు (Tatvaalu) and views 217,161.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ 20 ఏళ్ళుగా మంచి గురువు కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞానం కోసం, ఫలితం దక్కలేదు. నిరాశగా ఉంది, ఈ జన్మ కు మాకు యోగ్యత లేదా?

We are trying for 20 years for guru, for spiritual and soul knowledge, but we have not got any results. Desperate, do we not deserve in this birth?

మా జీవితం మొదటి దశ తప్పులు, ఇప్పుడు ఒక్కొక్కటి గా ఎదురు వస్తూ ఉంటే, కన్నీళ్లు తో కుమిలిపోతూ ఉన్నాము, మనశ్శాంతి లేదు. ఎంత పలుకుబడి పదవి అధికారం ఆస్తులు ఉన్నా, బయటకు చెప్పుకోలేక, కుళ్ళి పోతూ.

సిగ్గు గా ఉంది, మీరేమో మమ్మల్ని గురువులు అని అంటున్నారు, అందరి భవిష్యత్తు బ్రహ్మాండంగా చెబుతూ, ఎందుకంటే ఇవి అందరి ఇళ్ళలో ఉన్న సమస్య లే. చివరకు ముదుసలి తనం లో ఛీత్కారాలు అవమానాలు దూరం గా ఒంటరిగా ఎవరి చేతిలో నో పెట్టి లేదా వదిలేసి, మన అరిషడ్వర్గాల అష్టవ్యసనాల పాపం కు.

జవాబు - ధన్యవాదాలు గురువు లకు, మనసు విప్పాలని ఆలోచన పశ్చాత్తాపం పొందాలన్నా ఆవేదనే మొదటి మెట్టు, మానసిక ప్రగతికి.

ప్రకృతి లో కనపడే ప్రతి జీవి, ఓ గురువే. ఆఖరికి చెట్టు, రాయి, కాకి, కోడి, పంచభూతాలు కూడా. సంస్కార తల్లిదండ్రులు/ అత్తమామలు కూడా సజీవ గురువు లే. 15 సంవత్సరాల వయసులో నే లేదా పెళ్లి అయిన 15 నెలలు లోనే, వీరి నీతి నియమాలు నిబద్దత గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉంటుంది.

కష్టం గా నష్టం గా ఉన్నా, ఇతరులు ఎంత ఎగతాళి చేసినా, మంచి మాత్రమే నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మనకు అరిషడ్వర్గాల ను జయించే మానసిక బలం లేకపోయినా, అది ఉన్న వారు దొరికితే, వారిని అనుసరించాలి. స్ధితప్రజ్ణత, స్ధిర బుద్ధి, ఒకే మాట బాట పట్టిన, పరమాత్మ మన తోనే.

నేర్పేవారు, గుణవంతుడు గా, కనీసం 5 ఏళ్ళు పైగా, తాము మంచి ఆచరిస్తూ, మనకు పదిమంది కి ఉచితం గా బహిరంగంగా నేర్పుతారు, వీరు మంచి గురువు లు. ఉదాహరణకు సజీవ గురువు లు, ముదుసలి సంస్కార తల్లి తండ్రులు అత్త మామలు సేవ కూడా, ఓ కఠిన పరీక్ష నే సాధకుడు కు.

అయితే వారికి, మన అంతరంగ తరంగాలు తెలియాలి. దాపరికాలు, 2 నాల్కలు మనకు ఉండకూడదు. ఉన్నా, వదులు కోవాలి. మన మానసిక స్ధాయి స్ధితిని బట్టి, మనకు సాధన చెబుతారు. కఠినమైన కూడా ఆచరించాలి. పది జన్మలు ఎత్తి కూడా, పంచేంద్రియాలు ను అదుపు చేయలేని, మానసిక బలహీనులు, మనలో 80 శాతం ఉన్నారు. వీరందరూ కష్టాలు కన్నీళ్లు పడాల్సిందే. ఎందుకంటే ప్రాపంచిక సుఖాలు మరిగి, తమ స్వస్వరూపం ను మరచారు. మసిబట్టిన గుడ్డను, బండకేసి బాదాలి. అదే పని పంచభూతాలు చేస్తాయి ఆత్మ శుద్ది కోసం. లేదంటే, ఈ జన్మల పరంపర కొనసాగాలి, అది ఇంకా భయంకరం.

చూడండి, కౌరవులు పూర్తి గా నాశనం అయినా, ఆఖరు కు పాండవుల కష్టాలు తగ్గలేదు వనవాసం లో, కృష్ణుడు అండ ఉన్నా. 18 రోజులు యుద్ధం చెయ్యాల్సిందే, శ్రమ ఒత్తిడి పొందాలి కదా.

బడి లో, గుడిలో ఎంత విన్నా చూసినా నేర్చుకున్నా ఆస్వాదించినా, సొంతం గా మనం కూడా సాధన చేయాలి. ప్రాపంచిక భ్రమలు వీడాలి. వాటిలో ఎంత పరుగులు తీసినా, చివరికి పిల్లలు అల్లుడు కోడలు భాగస్వామి లేదా ఎవరో ఒకరు, అవే మోహ భ్రమలతో, ఎదురు లేదా వెన్నుపోటు తో, మనకు ప్రాపంచిక విషయాల తోనే గుణపాఠాలు చెబుతారు.

తప్పుడు గురువు లు గా ఇంకొంత మంది, తాము పతనం అవుతూ, ఇలా మీరు చేయకూడదు అని కూడా, వ్యతిరేక పద్దతి లో నేర్పుతారు. ఆ తేడా గ్రహించాలి, ఆ శక్తి మనకు 15 ఏళ్ళు వయస్సు లోపే రావాలి. అంటే తాగుబోతు, పతనం అవుతూ, కుటుంబం ను నాశనం చేసుకుంటూ, మీరు ఇలా చేయవద్దు అని చెబుతారు. 15 ఏళ్ళు వయస్సు తర్వాత కూడా నేర్చుకోవచ్చు కానీ , ఇంకా ఎక్కువ కఠిన సాధన అవసరం, లేదంటే మధ్యలో మరలా బండి పట్టాలు తప్పుతుంది, తొందరగా పతనం అవ్వాలని, రోగాలతో పోవాలని.

ఆ సాధన బలం గా మనసు లో, 15 ఏళ్ళు వయస్సు నాడు కు ముందే నాటుకుంటే, ఇంక ఏ మాయలు మర్మాలు మోసాలు మన దరి చేరవు. చేరినా, తొందరలోనే తొలగి పోతాయి మనల్ని వీడి. మన జీవితంలో లో సగభాగం మనతో నడిచే, ఏలినాటి శని, రాహు కేతువులు కు, తలవంచి నమస్కరించి, ఆనందం గా దూరం గా ఉంటారు. ఎందుకంటే బలి చక్రవర్తి కి కాపలా ఉన్నట్లు గా, ఆ పరంధాముడే, మీతో మీ మనసులో తిష్ట వేసి కూర్చుని, కాపాడతారు. అందుకే పిల్లలకు, రామాయణ భారత భాగవత భగవద్గీతలు భోదించాలి, మానసిక ఉత్తేజులు అవుతారు.

ఇద్దరు నిరుద్యోగులు కలిసినప్పుడు, నేను ఎమ్మెస్సీ చేశా, నేను ఎమ్బీఏ చేసిన అని తమ అర్హతలు చెప్పుకుంటారు. ఇద్దరు ఓటర్లు కలిసినా, నేను ఈ ముగ్గురు దగ్గర ఇంత తీసుకున్నా, వీరికి అమ్ముడు పోయిన అని గర్వంగా చెబుతున్నారు. నీతి లేని ఇద్దరు నాయకులు/ కోటీశ్వరులు/ అధికారులు కలిస్తే, నల్లధనం బినామీ ఆస్తులు ఎన్ని ఉన్నాయో, తమ లాగే జాలి దయ కృతజ్ఞతలు విశ్వసనీయత లేని మొద్దు పిల్లల ను కూడా జనం మీదికి వదలడం కు, ఎంత మాయ చేయబోతున్నారు అని అర్హత చెబుతారు.

మరి ఇలాంటి ప్రపంచిక బానిసత్వాలు వీటికే ఇన్ని అర్హతలు ఉంటే, దైవం కు గురువు కు, భక్తులు గా శిష్యులు గా, మనకు అర్హతలు ఎందుకు ఉండవు? ఉన్నాయి. మరి మీ అర్హతలు చెప్పలేదు కదూ ప్రశ్న లో. కాబట్టి మీకు మీకు, రావణ దుర్యోధనుని లాగా, రాముడు కృష్ణుడు, ఎదురు గా ఉన్న కూడా, కంటి కి ఉన్న ప్రాపంచిక వ్యామోహం పొరలు, వారిని గుర్తించము, దరిచేరనీయము. ఎందుకంటే మన స్వయం పతనం ఆగకూడదు, కలియుగ ఒంటి పాద ధర్మం ప్రకారం.

కాబట్టి ముందుగా అర్హతలు సంపాదించుకోండి, దైవం భక్తి గురు భక్తి గురించి మాట్లాడాలి అంటే, ఉదాహరణకు భవిష్యత్తు లో మీరు ఇలా అడగాలి గురువు కోసం, మానసిక బలం కోసం, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం నియంత్రణ కోసం - 20 ఏళ్ళు గా చాప నిద్ర, ఒంటి మీద వీసమెత్తు బంగారం లేదు, రూపాయి అప్పు లేదు, ఇంటి శాఖాహారం, మందు, చిందు, బజారు పొందు, పొగ, మత్తు లేదు. 20 ఏళ్ళుగా రోజూ, యోగా వాక్సుద్ధి రాతశుద్ధి, మంత్ర ఉచ్చారణ నాభి నుండి. 9 ఏళ్ళుగా సజీవ గురువు సేవ చేస్తున్నా. 180 వారాలు, 108 ప్రదక్షిణలు చేతి వేళ్ళు లెక్క తో చేస్తున్నా. 9 ఏళ్ళుగా ప్రతి శనివారం నియమం తప్పకుండా, శివ శని నేతి నిమ్మ దీపం పెడుతున్న. 9 ఏళ్ళుగా ముదుసలి తల్లి ని చేతబట్టుకొని, మైలు నడిపించా. ఇలా మన సాధన అర్హతలు చెప్పగలిగితే, అప్పుడు గురువే మీ దగ్గర కు వస్తారు. మీరూ ఇంకొకరు కు దోవ చూపుతారు. ధన సంబంధము లేని, మానసిక శారీరక సాధనలు మాత్రమే, అర్హత కలిగి ఉంటాయి.

డిగ్రీ లేదా సమాన చదువు చదవకుండా, ఐయెయెస్ పరీక్షలు రాయకుండా, నాకు కలెక్టర్ ఉద్యోగం రాలేదు అని, 100 ఏళ్ళు ఎదురు చూస్తే లాభం ఉందా? కలెక్టరేట్ చుట్టూ పూజ కొబ్బరికాయ దండతో పొర్లు దండాలు పెడితే వస్తుందా?

పాత తప్పులు కు శిక్ష విధించేది భగవంతుడు, అంటే మన ఆత్మ ఆ పరమాత్మ, ఎందుకంటే శుద్ది కావాలి కాబట్టి, కష్టమైన మరు జన్మలు తగ్గాలి కాబట్టి. తప్పించుకోలేము. ఇప్పుడు అయినా మారదాం, తప్పు లు తగ్గించుకోవచ్చు. కాబట్టి, మీ గురించి మీరు తెలుసుకోవాలి, మిమ్మల్ని మీరే మార్చుకోవాలి. మీరే దైవం, గురువు కావాలి, మానసిక శారీరక బలహీనులు కు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2060 General Articles and views 1,787,142; 104 తత్వాలు (Tatvaalu) and views 217,161
Dt : 26-Apr-2023, Upd Dt : 26-Apr-2023, Category : Devotional
Views : 550 ( + More Social Media views ), Id : 91 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trying , 20 , yrs , guru , spiritual , soul , knowledge , results , desperate , deserve , birth
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు