జడమైన దేహము, జడమైన చిత్తము, నీ స్వరూపము కాదు - మానస బోధ - విద్యాప్రకాశానందగిరి - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,867,176; 104 తత్వాలు (Tatvaalu) and views 225,030.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శుభోదయం, శుభదినం, శుభసంకల్పం, గురువులందరికీ, నమస్కారములు. మనము ఇలా 3 ఏళ్ళు పైగా సత్సంగము లో కలసి ఉన్నాము అంటే, ప్రతి సందేశము లో కూడా, మీ జీవిత సమస్యలకు ఏదో సమాధానం ఖచ్చితముగా ఉంటుంది. జాగ్రత్త గా చదివి అర్ధం చేసుకోవాలి. శివ ఆజ్ఞ లేనిదే, మీరు మేము కలవము, ఇలా పలకరించుకోము, మరువద్దు, పంచభూతాల సందేశాన్ని.

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి (శివైక్యం 1998) ఒక సాధారణ గొప్ప ఆధ్యాత్మికవేత్త, ఆయన శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకుడు, బహుభాషా కోవిదుడు. తలవంచి, సధ్గురువులకు ప్రణామములు.

10 వ తరగతిలో ఉన్నప్పుడు, మానసబోధ పాటలు విన్నాము. అందులో పదాలు, చాలా ఆకట్టు కున్నాయి. ఎవరు అని ఆరా తీసాము, గీతామకరందం అన్న పుస్తకం దొరికింది. చాల భాగము చదివాము, వామ్మో ఇంత జ్ఞానమును ఆయన ఎంత తేలిక పదాలలో సామాన్యుడికి అర్ధమయేలా రాసారు అనుకున్నాము.

మన గురు దేవులు గా తప్పక చెప్పుకోవలసిన వారు వీరు, ఇతరులు లాగా, ఆర్భాట సభలు ఉండవు, కింద కూర్చుని మామూలు కాషాయం గుడ్డ చుట్టుకుని, సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు. చాలా వీడియోలు చూసాము.

వారి రచన, మానస బోధ, మనసును ఎలా నియంత్రించాలి అన్న దానిపై, ఎంత సరళముగా, ఎంత వివరముగా, తన ప్రజ్ఞానముతో అనుభవముతో రాసారో, మీరు చదవండి, వినండి, పాడండి, ఆచరించండి.

శ్రావ్యమైన గొంతుతో శైలజ పాడిన ఈ పాటను లింక్ లో వినగలరు, తన్మయత్వము పొందగలరు.

1. సంసార కూపమున, దిక్కుతోచక యుండి, విలపించు టేలకో మనసా
గురు పాదముల బట్టి, తత్త్వంబు తెలిసికొని, తప్పించుకో ఓయి మనసా

2. ఎన్ని జన్మలనుండి, బంధంబు తొలగక, దుఃఖించుచున్నావు మనసా
నరజన్మ మందున, జ్ఞానంబు ఆర్జించి, తాపంబు బాపుకో మనసా

3. సంసార మందలి, అల్ప సుఖమును జూచి, మురిసిపోవగనేల మనసా
ఆనందముగ తోచు, విషయభోగము లన్ని, ముణ్ణాళ్ళ ముచ్చటే మనసా

4. దారుణం బైనట్టి, సంసార వ్యాధిని, పోగొట్టుకో ఓయి మనసా
పుట్టి చచ్చుట యందు, పురుషార్థ మేమియో, బాగుగా యోచించు మనసా

5. రామ రామా యనుచు, నిరతంబు మదిలోన, స్మరణ చేయుము ఓయి మనసా
పరమ పావనమైన, దైవనామము చేత, పాపమంతయు తొలగు మనసా

6. కోటికిని పడగెత్తి, కొండంత ధనమును, కూడబెట్టిన నేమి మనసా
దానధర్మము లేక, దాచిన సొమ్మంత, పరులపాలై పోవు మనసా

7. జగతిలో నున్నట్టి, దేహంబు లన్నియు, నీయొక్క రూపాలె మనసా
సత్యంబు తెలిసికొని, ప్రాణులన్నిటి యెడల, దయగల్గి యుండుమూ మనసా

8. రేపు రేపని చెప్పి, దైవకార్యాలను, విరమించబోకుము మనసా
ధర్మకార్యాలను, దైవకార్యాలను, వెనువెంటనే చేయి మనసా

9. జడమైన దేహము, జడమైన చిత్తము, నీ స్వరూపము కాదు మనసా
సచ్చిదానందమగు, ఆత్మయే నీ వని, బాగుగా తెలిసికో మనసా

10. చావు పుట్టుక లన్ని, పాంచభౌతికమైన, దేహానికే యగును మనసా
నిత్య శుద్ధంబైన, ఆత్మయే యగు నీకు, జన్మాదులే లేవు మనసా

11.కనుపించునది యంత, కాలగర్భమునందు, నాశంబు నొందునూ మనసా
నాశ మేమియు లేని, బ్రహ్మమే నీ వని, త్వరితముగ తెలిసికో మనసా

12. విశ్వమందెల్లెడల, ఆత్మయొక్కటె కాని, రెండవది లేదోయి మనసా
నీకంటె వేరుగ, మఱియొకటి లేదని, తెలిసి ధైర్యము నొందు మనసా

13. ధ్యానయోగము చేత, ఆత్మలో స్థితిగల్గి, ద్భశ్యభావన వీడు మనసా
దృశ్యంబులేనట్టి, స ద్రూపమే నీవు, సత్యమును తెలిసికో మనసా

14. అనుభూతి బడసిన, సద్గురూ త్తమునికై, బాగుగా వెతకుము మనసా
గురుపాదముల జేరి, ఆత్మానుభూతికై, ధ్యానంబు సలుపుమూ మనసా

15. ఋషులు పొందిన శాంతి, కలుగునా నాకని, సంశయింపకు ఓయి మనసా
అభ్యాస వశమున, సర్వులకు మోక్షంబు, సమకూరు ధరణిలో మనసా

16. బలహీనుడను నేను, అని తలంచుచు నీవు, పరితపించెదవేల మనసా
శక్తులన్నియు నీలోనే, కలవంచు భావించి, ధైర్యమును చేబట్టు మనసా

17. జన్మంబు లన్నిటిలో, నరజన్మ శ్రేష్ఠమని, చక్కగా నెరుగుము మనసా
దైవభావము గలిగి, మనుజత్వ మంతను, సార్థకంబుగ జేయి మనసా

18. శాస్త్రాల సారము, వివరించి తెలిపెద, శ్రద్ధగా వినుము ఓ మనసా
పరహితమె పుణ్యము, పరపీడ పాపము, దయచూపు ఎల్లెడల మనసా

19. మార్గంబు లన్నిటిలో, భక్తిమార్గమె చాల, సులభమైనది ఓయి మనసా
శ్రద్ధతో శుద్ధితో, భక్తిమార్గమును బట్టి, గమ్యాన్ని చేరుకో మనసా

20. పెక్కు జన్మల నుండి, విషయ సంస్కారాలు, వెంటాడుచున్నవీ మనసా
అభ్యాస బలముచే, వానినెల్లను నీవు, పోగొట్టుకో ఓయి మనసా

ఇక్కడ 20 మాత్రమే చెప్పినా, మొత్తము 108 సరళ మాటల పద్యాలు ఉన్నాయి, పాటలో.

శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి (ఏప్రిల్ 13, 1914 - ఏప్రిల్ 10, 1998) ఒక ఆధ్యాత్మికవేత్త. శ్రీకాళహస్తి లోని శ్రీ శుకబ్రహ్మాశ్రమం స్థాపకుడు, బహుభాషా కోవిదుడు, గీతామకరంద ప్రకాశకులు, భగవద్గీతా ప్రచారకులు, వేదాంతభేరి వ్యవస్థాపకులు. మలయాళ స్వామి శిష్యుల్లో ముఖ్యమైన వాడు.

ఆయన జన్మనామం ఆనందమోహనుడు. బందరులో జన్మించిన అతను, 1950 లో శ్రీకాళహస్తిలో శ్రీ శుకబ్రహ్మాశ్రమం ఏర్పాటు చేసి, ప్రజలలో ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించాడు. దేశంలో పలు ప్రాంతాల్లో గీతాజ్ఞాన యజ్ఞాలు నిర్వహించాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. పలు పుస్తకాలు రచించాడు. భగవద్గీతపై అతను రచించిన విపులమైన వ్యాఖ్యాన గ్రంథం గీతామకరందం చాలా ప్రాచుర్యం పొందిన గ్రంథం.

వ్యాసాశ్రమంలో ఉన్నపుడు యథార్థ భారతి, శుకబ్రహ్మాశ్రమం తరపున వేదాంతభేరి పత్రికలను ప్రచురించడం ప్రారంభించాడు. పలు పత్రికల్లో అతను రాసిన పరమార్థ కథలు ప్రచురితమయ్యాయి. ఈ కథలు పామరులు కూడా అర్థం చేసుకోగలిగిన సులభ శైలిలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రచారం చేశాయి.

శ్రీకాళహస్తిలో ఆయన మొట్టమొదటి డిగ్రీ కళాశాలను స్థాపించడానికి తన వంతు విరాళం అందించారు. ఈ కళాశాలను ఆయన పేరు మీదుగా శ్రీ విద్యాప్రకాశానంద డిగ్రీ కళాశాల అని వ్యవహరిస్తున్నారు.

MANASA BODHA SRI VIDYAPRAKASHANANDAGIRI SWAMY  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,176; 104 తత్వాలు (Tatvaalu) and views 225,030
Dt : 18-May-2022, Upd Dt : 18-May-2022, Category : Devotional
Views : 1088 ( + More Social Media views ), Id : 48 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jaḍamaina , dehamu , chittamu , svarupamu , manasa , bodha , vidyaprakasanandagiri , swami
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు