Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
వైసీపీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకత్వం కు ఇటువంటి జాబ్ మేళా కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు.
శభాష్ మా ఎమ్మెల్యే కరణం బాబాయ్. ఇది ఎప్పుడూ మేము వినలేదు, చూడలేదు, చీరాలలో జాబ్ మేళా గురించి ఇప్పుడే చూస్తున్నాము. మరి గతంలో జరిగినవి మేము మిస్ అయ్యామేమో తెలీదు. ఇలా కొత్త కొత్త అవకాశాలు విధానం రావాలి, చిన్న పట్టణాలకు.
అనంత ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు లా, మనం ఎప్పుడూ జనం లోనే జనం తోనే ఊళ్ళో నే, అందుబాటులో ఉండాలి. వారం కు రెండు రోజులు అయినా, జనం వెంటపడుతూనే వారి సమస్యలు కు పరిష్కారం చూపించాలి. అధికారులు తో పని చేయించాలి, వీడియో ఫోటో సాక్ష్యం ఉండాలి.
గతం 2 ఏళ్ళు పైగా మేము నిస్వార్థంగా, జగనన్న కోసం, ఆయన తరపున ప్రాధేయపడి వెంటపడి కోరిన విధంగా, ఏ ఒక్క అధికారి కూడా ఇంతవరకు, జగనన్న పధకాల అమలు అలాగే నేలపై అభివృద్ధి గురించి, తమ సోషల్ మీడియా లో రాయడం లేదు.
వైసీపీ అధిష్టానం దీనిపై తగిన చర్యలు, కనీసం ఇప్పుడు అయినా మొదలు పెట్టాలి. ఇది వారికి కూడా పంపుతున్నాము.
సోషల్ మీడియా లో అన్ని జిల్లా శాఖలతో, వినూత్న ప్రయత్నం చేసిన ఒకే ఒక్క మొనగాడు నిబద్ధత కలిగిన, అనంత కలెక్టర్ గంధం గారిని కూడా, అనంత నాయకులు బదిలీ చేయించి, ఆ పని ఎదుగుదల ను ఆపుచేయించారు, జగనన్న ఖ్యాతి పెరగకుండా. ఇప్పుడు ఆ జిల్లా అధికారులు సోషల్ మీడియా ఎలా ఉందో, ఇంకా చూడలేదు.
రాష్ట్రంలో ప్రతి పంచాయతీ సెక్రటరీ, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆర్డీవో, మున్సిపల్ కమీషనర్, విద్య, వైద్య అధికారులు, తమ గ్రామ పట్టణ జిల్లా రాష్ట్ర స్ధాయిలో, జగనన్న నేలపై అభివృద్ధి ని, తమ అధికారుల సోషల్ మీడియా లో పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారో తెలియాలి. ఆ అడ్డంకులు తొలగించాలి.
మన చీరాల చుట్టుపక్కల ప్రాంతానికి, కావాల్సిన రావల్సిన, మిగతా అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నవి అని , ఫోటోలు తో సాక్ష్యం తో సహా ప్రజలకు తెలియచేయగలరు. మనకు ఎంతో సమయం లేదు తర్వాత ఎన్నికలకు.
మా కరణం బాబాయి, బాలినేని, సజ్జల, జగనన్న నాయకత్వం లో హయాంలోనే, ఇవన్నీ వచ్చినాయి అని అందరూ అనుకోవాలి. చిరకాల వాంఛ నెరవేరి, వారి గుండెల్లో గూడు కట్టాలి.
అధికారం మీ చేతుల్లో ఉంది, మరి ఆచరణలో, మన నేలపై అభివృద్ధి చూపించడం మొదలు పెడదాం.
కేవలం పంచుడు కార్యక్రమం వలన మనం గెలవలేము. చంద్రన్న అక్కడ నే మోసపోయారు. నేలపై అభివృద్ధి, అధికారుల సోషల్ మీడియా అభివృద్ధి సాక్ష్యం తోనే, అవకాశాలు పెరుగుతాయి. 125 స్థానాలకు కి ఒకటి తగ్గినా, జనానికి మన మీద వెగటు పుట్టినట్లే.
మన నాయకుల నుంచి, బూతులు ఆవేశ మాటలు రాకూడదు. అధికారంలో ఉండి అణిగి ఉండకపోతే, చంద్రన్న పతనం మనం కూడా రుచి చూడాలి. ఎదుటివారి తిట్టులకు, తలవంచడం మనకు ఖ్యాతే గానీ చిన్నతనం కాదు. మన జనం దాడులకు పోయి, ప్రతిపక్షం కు మనకు తేడా లేదని, నిరూపిస్తే, జనం పవనన్న వైపు చూడవచ్చు.
బీహార్ కన్సల్టెంట్స్ మనకు వద్దు, మన అభివృద్ధి మీద నమ్మకం ఉంటే, అని అభిమానుల అభిప్రాయం.
ఎమ్మెల్సీ సునీత అక్క కూడా, ఇంఛార్జి ఆమంచి కూడా తమ పలుకుబడి ఉపయోగించి, మన అభివృద్ధి పనులు ముందుకు కదలించాలి. మరలా మన ప్రాంత అభివృద్ధి లిస్టు ఇదుగో
దయచేసి మీ అందరి ఊరి కోసము కూడా ఇలాంటివి అడగరూ - 1. చీరాల జిల్లా, కొత్త జిల్లా శాఖల కార్యాలయాలు, 2. చీరాల పార్లమెంటు, 3. గంగ పుత్రుల ఫిషింగ్ హార్బర్, మోటుపల్లి పోర్ట్ రేవు, 4. బడుగు నేతన్నల చేనేత పార్కు, 5. అభివృద్ధి తో స్మార్ట్ సిటీ, 6. టూరిజం స్మార్ట్ బీచ్, 7. సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్, రిమ్స్ స్ధాయిలో, 8. విద్యార్థుల ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల, కొత్త హంగులు తో కోర్సులు తో, 9. జీడిపప్పు పరిశ్రమ అభివృద్ధి, 10. కార్మికుల ఐఎల్టీడీ, కేపాల్ స్ధాయిలో ఇతర పరిశ్రమ లు.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2192 General Articles and views 2,441,216; 104 తత్వాలు (Tatvaalu) and views 263,057
Dt : 24-Oct-2021, Upd Dt : 24-Oct-2021, Category : Politics
Views : 997
( + More Social Media views ), Id : 1264
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
state ,
rural ,
urban ,
district ,
development ,
jagan ,
social ,
media ,
authorities ,
chirala ,
job mela
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments