అమ్మా - నా జీవన జ్యోతివి నీవే, నా జీవన దాతవు నీవే - రగిలేజ్వాల - కృష్ణంరాజు, జయప్రద, సుజాత - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,748; 104 తత్వాలు (Tatvaalu) and views 225,707.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Mom - You are the light of my life, You are the giver of my life (Naa jeevana jyothivi nevea, datavu neevea) - Ragilejwala - Krishnamraj, Jayaprada, Sujata*

పాటతో పరమార్ధం - అప్పుడప్పుడు మంచి పాటలు కూడా పాడుకుంటాము, ఆరోగ్యం వాక్సుద్ది మానసిక బలం ప్రశాంతత కోసం. అబ్బో మీరేనా నీతులు చెప్పేది అనే వారికి, మేమే కాదు, మా కన్నా పెద్దలు ఎంతో మంది చెప్పారు అని చూపడానికి ఇదొక సాక్ష్యం/ దోవ.

మన ప్రతి కుటుంబములో, విస్వసనీయత క్రుతజ్ఞత గల, పిల్లలు పెద్దలు ఉంటారు. కూతురు/ కొడుకు తమ తల్లి తండ్రికి, అలాగే అటు ఇటూ కూడా పాడుకోవచ్చు. వారు వారి పెద్దలకి పాడి వినిపించాలని ఈ చిన్న ప్రయత్నం. ఎందుకంటే, వీరు జీవితాంతము, తమకు చేసిన సహాయం ని సేవ ను మరువరు. అలాగే ముదుసలి తల్లిలి తండ్రి అత్త మామలను, ఇలాగే దేవతలు గా తమ ఇంట్లో ఉంచుకుని, పిల్లల తో సమాన వైద్య సౌకర్యాలు ప్రేమ ఆప్యాయత పంచుతూ, క్రుతజ్ఞతలు తెలుపు తారు. పెద్దలు పెట్టిన భిక్షనే, ఈ శరీరం, ఆత్మజ్ఞానం, సంపాదన, ప్రపంచం, మరువకు మా, పుట్టగతులు ఉండవు.

చూడండి ఎంత అర్ధం ఉందో ఈ పదాలలో - అంతా మా అమ్మ మరియు మా, పాట లాగే ఉంది. మీలో కూడా ఇలాగే కొంతమంది అయినా ఉంటారు ఇలాగే. మీ అనుభవాలు పంచుకోవాలి, ఇతర తల్లి దండ్రులకు ఆశలు కల్పించాలి, ఆదర్శముగా నిలవాలి - నా నిదరే దేవుడికిచ్చాను, నా చూపులు కాపుగ చేసాను, ఆ దేవుడు ఇచ్చిన ఆయువునీ, నీ కోసం ధారగ పోస్తాను, మదిలో మెదిలే బంధం నీదేలే, నా జీవన జ్యోతివి నీవే, ఈ కోవెల హారతి నీవే.

అమ్మా - నీ హృదయ కాంతినే వెలిగించి, నను జ్యోతిగ నీవే చేసావు, నీ వెలుగుకు నీడై పయనించి, నీ ప్రేమకు హారతి పడతాను, ఎదిగే రుణమే నిధిగా మిగలనీ, నా జీవన దాతవు నీవే, ఈ భువిలో దేవత నీవే. ఇలాంటివి ఎన్ని చేస్తే అమ్మ నాన్న రుణం తీర్చుకోగలం.

నా జీవన జ్యోతివి నీవే.., ఈ కోవెల హారతి నీ.వే..
ఇహమై.. పరమై.., వరమై..వెలగవే..
నా జీవన జ్యోతివి నీవే.., ఈ కోవెల హారతి నీ.వే..

ఏ ప్రమిద లో.న వెలిగావో.., నా బ్రతుకు నీ.వు.గా మిగిలావు 2
ఏ దేవత కడుపున పుట్టావో, నా జన్మకు దీపం పెట్టావు
కదిలే.. శిలలో.. మమతే.. నీవులే...
నా జీవన జ్యోతివి నీవే.., ఈ కోవెల హారతి నీ.వే..

నా నిదరే దేవుడికిచ్చాను.., నా చూపులు కాపుగ చేసాను
ఆ దేవుడు ఇచ్చిన ఆయువునీ.. 2
నీ కోసం..ధారగ పోస్తాను
మదిలో.. మెదిలే.. బంధం.. నీదేలే..
నా జీవన జ్యోతివి నీవే.., ఈ కోవెల హారతి నీ.వే..

నీ హృదయ కాంతినే వెలిగించి.., నను జ్యోతిగ నీవే చేసావు..2
నీ వెలుగుకు నీడై పయనించి, నీ ప్రేమకు హారతి పడతాను
ఎదిగే.. రుణమే.. నిధిగా.. మిగలనీ....

నా జీవన దాతవు నీవే..ఈ భువిలో దేవత నీ.వే.
తల్లీ.. తంద్రీ.. గురువూ.. నీవులే...
నా జీవన జ్యోతివి నీవే.. నా జీవన దాతవు నీవే..

సంగీతం::K.చక్రవర్తి; రచన::వేటూరిసుందరరామ్మూర్తి
గానం::S.P.బాలు,P.సుశీల
Film Directed By::K Raghavendra Rao
తారాగణం::కృష్ణంరాజు, జయప్రద, సుజాత

Ragile Jwala 1981
Music::K.Chakravarti
Lyrics::Vetoorisundararaammoorti
Singer's::S.P.Baalu,P.Suseela
Cast::Krishnam Raju, Sujatha, Jaya Prada, Kaikala Satyanarayana

naa jeevana jyothivi nevea, datavu neevea Ragile Jwala Krishnam Raju, Sujatha, Jaya Prada  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,748; 104 తత్వాలు (Tatvaalu) and views 225,707
Dt : 21-May-2023, Upd Dt : 21-May-2023, Category : Songs
Views : 344 ( + More Social Media views ), Id : 1755 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : naa , jeevana , jyothivi , nevea , datavu , Ragile , Jwala , Krishnam , Raju , Sujatha , JayaPrada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content