Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. *మంగళ గౌరి మహేశ్వరీ, మంగళ గౌరి దేవి దీవెనలు, శ్రీ గౌరి శ్రీ గౌరీయే, గౌరమ్మ తల్లీ కోరిన కోర్కెలు - దేవీ హారతులు*
అమ్మల గన్న అమ్మ చాలా పెద్దమ్మ ను ఎన్ని విధాలుగా కీర్తించినా తనివి తీరదు, మనసు ఆగదు. ముందుగా, మన వచ్చీ రాని రాగాల పాటలను ఆస్వాదిస్తూ ప్రోత్సహిస్తూ, తామూ ప్రయత్నం చేస్తూ, తమ ఇంట్లో సాత్వికుల చే పిల్లల చేత చేపిస్తూ పాడిస్తూ, వాటిని వినిపించి, తరింప చేస్తున్న మంచి గురువులకు నమస్సుమాంజలి.
గులాబి అయినా, మల్లె అయినా, చామంతి అయినా అన్ని పూలే, దైవానికి అర్పించే పూజా కుసుమాలే. దోశలు ఎన్ని రకాలు పేర్లతో ఉన్నా మనము తిన్నా, అందులో ఉన్నది, మూలం దోశ పిండే, అన్న కనీస జ్ఞానం ఉండాలి.
అది తెలియని వారు, మనల్ని చూసి నవ్వుకుంటే, వారిని చూసి జాలి పడదాము. ఎందుకంటే వారికి అందరిలోనూ దైవాన్ని, సమానత్వాన్ని చూడడం రాదు. నియంత లాగా, ఒకరే అని గిరి గీసుకు కూర్చుంటారు. వారు వీరు, వేరు వేరు అని వారి భావన.
మరలా తిండి దగ్గర మాత్రం, పది రకాల కూరలు తినుబండారాలు రుచులు కావాలి తింటారు, అలాగే 100 రకాల శారీరక మానసిక సంతోషాలు కావాలి సుమా, ఒక దానితోనే సర్దుకోవచ్చు గదా?
కానీ సనాతన ధర్మం, దేహమే దేవాలయం అంది, ధర్మములో నిజాయితీ గా నడిస్తే జీవుడే దేవుడు అంది. అందరిలోనూ ఆ పరమాత్మ ను చూడమంది.
గంగా నది నుంచి, పది గ్లాసులలో నీరు పట్టిన, ఏది గంగ నీరు కాదు? ఆ పది గ్లాసులలో 10 మంది సూర్యులను చూసినా, 10 మంది 10 రకాలుగా వివిధ రీతులలో కొలిచినా, నిజానికి ఉన్నది ఆ పూజలు అందుకునేది, ఒకరే సూర్యుడు? అంతేనా? ఇక్కడ చిత్తశుద్ది భక్తి మాత్రమే ముఖ్యం.
అలాగే ఇష్ట దేవతలను ఎన్ని రకాలుగా కొలిచినా తలచినా కీర్తించినా, ఆ పరాశక్తి ఆదిశక్తి ఒక్కరే. ఆ శక్తి తోనే మనము రాయగలుగుతున్నాము, పాడగలుగుతున్నాము, చూడగలుగుతున్నాము, ఇంటి సజీవ ముదుసలి గురువు సేవతో పాటుగా, ప్రతి రోజూ ఇతరుల సేవ చేయ గలుగుతున్నాము, జాగ్రత్తలు చెప్పగలుగుతున్నాము.
శక్తి నశించిన నాడు, మనము ఏదీ చేయలేము, జీవచ్చవాలము. అందుకే అన్ని కదిలేటప్పుడు మంచి చెయ్యాలి, లేదా కనీసం మంచి పనులను రోజూ మెచ్చుకుంటూ ఉండాలి, మంచివారితో కలసి అడుగు వెయ్యాలి, మంచి మాటలు పాటించాలి. అప్పుడు మనలో కూడా, మంచి ఆలోచన మొదలు అవుతుంది.
అందరమూ నిత్య జాగరూకులై ఉండాలి సుమా, మొన్న చదివాము కదా, తస్మాత్ తస్మాత్ జాగ్రత్త అన్న శ్లోకాలు. మనల్ని కబళించడానికి, బయట శత్రువులకన్నా భయంకరమైనవి, మనలోనే అరిషడ్వర్గాలు అనే 6 శత్రువులు పొంచి ఉన్నాయి, వాటికి ఏనాడూ లొంగకూడదు.
అలా లొంగకుండా ఉండాలి అంటే, మనసుపై ఆధిపత్యం ఉండాలి. అది ఉండాలి అంటే, దైవం గురించి ఆలోచన, రాత, పాట, మాట, యోగా, ప్రదక్షిణ, ధ్యానం, పూజ, మంచిని మెచ్చుకుని ఆదరించడం, నిరంతరం ఉండాలి. అదే మన పిల్లలకూ నేర్పాలి, మానసిక బలం చైతన్యం కలిగించాలి, సంస్కారము నేర్పించి ఆచరింప చేసి.
మానసిక బలం, నీతి నియమము గల ఉద్యోగానికి వ్యాపారానికి కూడా ఉపయోగమే కదా?
వర లక్ష్మి గౌరీ, ఏ వ్రతము చేసినా, మన తాహతును బట్టి ఇతరులకు మేలు చేయడానికి, వాయనాలు ఇచ్చి పుచ్చుకోవడం, ఇతరులను గౌరవించి వారి ఆశీర్వాదాలు పొందడం, సమాజ శ్రేయస్సును కలిగిస్తుంది. పాటలోని మాటలను చూడండి.
సువాసినిభ్యో దాస్యామి, వాయనాని ప్రసీదతు
సౌభాగ్యం, సచ్చిదానందం, దేహాంతేహి సర్వ మంగళా
పసుపు కుంకుమలు పవ్వులు గాజులు, ఇస్తినమ్మ వాయనం
పుట్టెడు ఐదోతనమె దీవెనగ, పుచ్చుకుంటిని వాయనం
శ్రీ గౌరి శ్రీ గౌరీయే..! శివుని శిరమందు ఏ గంగ, చిందులు వేసిన అన్న పాటలో అర్ధము, భార్యకు మించిన శ్రేయోభిలాషి ఇంకొకరు ఉండరు అని. పైకి దేవుళ్ళ పేర్లు కనిపించినా, మొత్తము మన బ్రతుకులు సరిచేసుకోవడమే సనాతన ధర్మ మంచి ఉద్దేశ్యము.
పెళ్ళికాని పిల్లలు చూడండి, గౌరమ్మ తల్లిని ఈ పాటలో ఎలా కొలుస్తున్నారో, తమకు గుణమున్న మనసున్న మంచి వరుడిని ఇవ్వమని చూపించమని,
గౌరమ్మ తల్లీ, గౌరమ్మ తల్లీ, కోరిన కోర్కెలు, తీర్చేతల్లీ.
సిరులిచ్చినావు గుణమిచ్చినావు, మనసుకు తగిన, మనువీయవమ్మా.
పేదవాడైనా ప్రేమున్న చాలు, లేనివాడైనా గుణమున్న చాలు
అమ్మల గన్న అమ్మవ ఆమే, అభయము నొసగే, శుభమూర్తి ఆ తల్లే. మీరూ పాడాలి, అందరినీ తరింపచేయాలి సుమా.
1) మంగళ గౌరి మహేశ్వరీ
మముగన్న తల్లి పరమేశ్వరీ ||మంగళ గౌరి||
కరుణామయి నీ, కంటి పాపలో,
చల్లగ వెలుగును ముల్లోకాలు 2
తల్లి నీ. పేరు, తలచిన చాలు
జరిగేను, శతకోటి, కల్యా.ణా.లు
కల్యా.ణా.లు ||మంగళ గౌరి||
అమ్మల గన్న., అమ్మవు నీవే
అభయము నొసగే, శుభమూర్తి నీవే..2
వెండి కొండపై, వెలిసింది నీవే
ఇంటింట, నెలకొన్న, ఇలవేల్పు నీవే.
మా ఇలవేల్పు, నీవే.. ||మంగళ గౌరి||
maa ilavelpu mangala gouri lyrics
మా ఇలవేల్పు - మంగళ గౌరి మహేశ్వరీ
2) మంగళ గౌరి, దేవి దీవెనలు, మహిలో మగువల మాంగల్యం - 2
పార్వతి పాద పరాగమే పడతుల, పసుపు కుంకుమల సౌభా.గ్యం ||మంగళ గౌరి దేవి||
పసుపు కుంకుమల సౌభాగ్యం
హాలాహాలాధరు నాకర్షించిన చూపే, శివం మనోహరం
సఖుని పదముగా, నిలిచి వెలుగు, ఆ రూపే సత్యం సుందరం - 2 లైన్లు మొత్తము
అంజని నిరత, నిరంజని దురిత, విభంజనియై శివ రంజనియై
కాంచీపుర, కామాక్షిగ వెలసిన, మంజుల కంజదరాయతలోచన ||మంగళ గౌరి దేవి||
అనంత లయునికి, తద్యంత జతియై, అనుసరించు సతి పార్వతి...
అఖిలాండేశ్వరి, కనువగు పతియై, ఆదరించు గిరిజాపతి.. - 2 లైన్లు మొత్తము
సదా సతీ పతి, హితార్ది రతిపతి, వ్రతా లలామల కులసతియై 2
తనంతగా, శ్రీశైలము నెక్కిన, నిజా పతుకార, సాంచిత మతి ఆ ||మంగళ గౌరి దేవి||
సువాసినిభ్యో దాస్యా.మి, వాయనా.ని ప్రసీదతు
సౌభాగ్యం, సచ్చిదానందం, దేహాంతేహి సర్వ మంగళా.., దేహాంతేహి సర్వ మంగళా ..
పసుపు కుంకుమలు పవ్వులు గాజులు, ఇస్తినమ్మ వా.యనం
పుట్టెడు ఐదోతనమె దీవెనగ పుచ్చుకుంటిని, వా.యనం - 2 లైన్లు మొత్తము
శివాని దుర్గా, భవాని భార్గవి, మహి.కదంబ నివాసిని యై
రాజేశ్వరియై, వేముల వాడను, రాజిల్లే, వరదాన వినోదిని||మంగళ గౌరి దేవి||
అందరికంటే మొనగాడు | మంగళ గౌరికి పాట
Andarikante Monagadu | Mangala Gowriki song
3) శ్రీ గౌరి శ్రీ గౌరీయే..! శివుని శిరమందు
ఏ గంగ, చిందులు వేసిన.. ||శ్రీ గౌరి శ్రీ గౌరీయే..||
సతిగా, తన మేను, చా.లించి,
పా.ర్వతిగా మరుజన్మ ధరియించి - 2
పరమేశునికై తపియిం..చి 2
ఆ హరు మేన సగమై, పరవశిం.చి.న.
శ్రీ గౌరి శ్రీ గౌరియే...
నగ కన్యగా.., తాను జనియించినా..
జగదంబ యై.నది, హైమవతి - 2
సురలోకమున తాను ప్రభవించినా., సరళాత్మమైనది మందాకిని
ఒదిగి ఒదిగి పతి పదములందు, నివసించి యుండు గౌరి
ఎగిరి ఎగిరి పతి సిగను, దూకి నటియించుచుండు గంగ
లలితరాగ కలితాంతరంగ గౌరి, చలిత జీవన తరంగ రంగ గంగా
దవళాంశు కీర్తి గౌరి, నవఫేనమూర్తి గంగ
కల్పాంతమైన భువనాంతమైన
క్షతియెరుగని, మృతి యెరుగని, నిజమిది
శ్రీ గౌరి శ్రీగౌరీయే! శివుని శిరమందు, ఏ గంగ చిందులు వేసినా, శ్రీగౌరి శ్రీగౌరియే...
చిత్రం : విచిత్ర దాంపత్యం (1971), సంగీతం : అశ్వద్ధామ, రచన : సి.నారాయణరెడ్డి,
గానం : పి.సుశీల
SREE GROWI SONG |Vichitra Dampatyam| MOVIE SHOBAN BABU | SAVITHRI | VIJAYANIRMALA
4) గౌరమ్మ తల్లీ, గౌరమ్మ తల్లీ, కోరిన కోర్కెలు, తీర్చేతల్లీ - 2
సిరులిచ్చినా.వు గుణమిచ్చినా.వు,
చక్కని సొగసిచ్చినా.వు, సొగసును మించిన మనసిచ్చినా.వు - 2
మనసుకు తగిన, మనువీయవమ్మా.. 2
నా మనుగడ, నిలకడ చే..యవమ్మా ||గౌరమ్మ తల్లీ||
చరణం1 : చదువుకున్న వాడా? సరి అందగాడా? ఎవరమ్మ నీకూ తగుజోడు !
నను మెచ్చువాడు, మనసిచ్చువాడు,
వలపించి, బులిపించి, వయసేలు వాడు ||గౌరమ్మ తల్లీ||
చరణం : 2
నిరుపేదనైనా వరియించగలవా, వలపులు కురిపించగలవా? కులమేదైనా పెండ్లాడగలవా 2
పేదవాడైనా ప్రేమున్న చాలు, లేనివాడైనా గుణమున్న చాలు, పొత్తుకుదిరితే పూరిపా..కైనా చాలు
చిత్రం: బంగారు బాబు (1973), సంగీతం: కె.వి. మహదేవన్, సాహిత్యం: ఆత్రేయ,
గానం: పి. సుశీల కోరస్
Bangaru Babu Telugu Movie Song | Gowramma Thalli | Vanisri | ANR
------------
mangala gowri mahesvari, devi divenalu, sri gouri sri gouriyea, gowramma talli korina koarkelu
మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1763 General Articles and views 1,277,738; 90 తత్వాలు (Tatvaalu) and views 175,519 Dt : 06-Aug-2022, Upd Dt : 06-Aug-2022, Category : Songs
Views : 472
( + More Social Media views ), Id : 1486 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
mangala ,
gowri ,
mahesvari ,
devi ,
divenalu ,
sri ,
gouri ,
gowramma ,
talli ,
korina ,
koarkelu Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments