అమ్మా నీకు వందనం, మా యమ్మా నీకు వందనం - అమ్మ మీద ఒట్టు - నారాయణ మూర్తి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2094 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2129 General Articles and views 1,930,211; 104 తత్వాలు (Tatvaalu) and views 230,244.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

అమ్మ గురించి ఎంత అందముగా రాశారో చూడండి ఈ పాటలో, అమ్మా నీకు వందనము అంటూ. మనలో కదిలేది అమ్మ కణాలే కదా, అమ్మే తొలి గురువు కదా అని.

ఆకలేస్తే కేక వేయమని చెప్పింది అమ్మే కదా, మనిషి రాజైనా అమ్మకు పురిటి గుడ్డే కదా, తీర్చుకోలేని రుణం ఇది ఒకటే కదా అని ఎంత చక్కగా రాశారు.

గోంగూర పచ్చడి కన్నా, రాగి ముద్ద కన్నా, పచ్చి పులుసు కన్నా, అమ్మ పాలే రుచి అని ఎంత మధురముగా చెప్పారో కదా?

అమ్మ పరిస్థితి అంటే ఒక మహిళ పరిస్థితి, ఎవరో ఒకరి అండతో ఉండాలి చిన్నప్పటి నుంచి అని కూడా చెప్పారు. ఆ రచయితకు అలాంటి వాటిని ప్రోత్సాహం చేసే నారాయణ మూర్తి గారికి శతకోటి వందనాలు.

1. అమ్మా నీకు వందనం, మా యమ్మా నీకు వందనం
ప్రాణము పోసిన దాతా, నీ పాద పాదాన వందనం
ఓ.. అమ్మ నీకు వందనాలు వందనమో, కన్న, తల్లి నీకు వందనాలు వందనం

2. అమ్మా అంటే ఆది అంతం లేని కమ్మని ప్రేమే గా, అది కొంటే దొరకని ప్రేమేగా
అణువణువులో జీవి అణువులో, కదిలే అణువు అమ్మేగా, పొత్తిళ్ళే మన ఇల్లేగా
తొమ్మిది నెలల తొలిచూరు గుడ్డుకు, తొలి గురువు మన అమ్మే గా, నుడుగుల అడుగుల జాడే గా
కన్న తల్లి మాయా గురుతు ఏదమ్మా, ఓ.., కడుపులో దాగున్న పాల బొడ్డమ్మా ||ఓ.. అమ్మ నీకు వందనాలు||

3. ఆకలేసితే కేకలేయమని పాపకు నేర్పినదమ్మేగా, పాపకు అమ్మే పాటే గా
పులిరాజైనా డిల్లీ రాజైనా, తల్లికి పురిటి గుడ్డే గా, బాలా సేపుల గుర్తే గా
తీర్చుకోలేని రుణము ఒకటే, కన్న తల్లి రుణమే గా, అది దేవుని తరమే కాదు గా
స్రుష్టి కే ప్రతి స్రుష్టివి నీవమ్మా, ఓ.., బిడ్డకే దిష్టి కాటుక మాయమ్మా ||ఓ.. అమ్మ నీకు వందనాలు||

4. పచ్చ మిరపకాయవేసి పెట్టిన గోంగూర పచ్చడి చూడమ్మా, అది సచ్చిన మరువని రుచమ్మా
రాయలసీమా రాగి ముద్దలో, వేరు సెనగా కలుపమ్మా, అరె నోరూ ఊరి నిండమ్మా
తెలంగాణా పచ్చీ పులుసు చప్పారించి చూడమ్మా, అది పేదోళ్ళ బిరియానమ్మా
ఎన్నో రుచులు ఉన్నా గాని ఓయమ్మా, ఓ.., కన్నతల్లి చనుబాల రుచే వేరమ్మ||ఓ.. అమ్మ నీకు వందనాలు||

5. చిన్ని తనములో తండ్రి కాపలా, కన్నె వయసులో అన్న కాపలా, మల్లెకు ముళ్ళా కంచేగా
చచ్చే దాకా మొగుని కాపలా, చావుకి దేవుని కాపలేగా, స్త్రీజన్మకు అది శిక్షేగా
కత్తుల బోనుల నడుమ ఒయమ్మో, ఓ.., చల్లని పున్నమి వెన్నెల నీవమ్మా ||ఓ.. అమ్మ నీకు వందనాలు||

Amma Meda Ottu, Amma Neeku Vandanam, Prabha, R.Narayana Murthy
అమ్మ మీద ఒట్టు, అమ్మ నీకు వందనం, ప్రభ, ఆర్.నారాయణ మూర్తి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2129 General Articles and views 1,930,211; 104 తత్వాలు (Tatvaalu) and views 230,244
Dt : 08-May-2022, Upd Dt : 08-May-2022, Category : General
Views : 736 ( + More Social Media views ), Id : 1383 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : amma , ottu , vandanam , prabha , narayana , murthy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content