Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మనకు జ్ఞాన స్వరూపులైన దేవతలు ఉన్నారు. వారిలో శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే. ఇక విద్యల గురించి, వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం, గురు గ్రహ అనుగ్రహాన్ని, కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.
* గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణా మూర్తయే నమ:
అన్నిలోకాలకూ గురువు, సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీ దక్షిణా మూర్తికి నమస్కారము.
* అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన షలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమహ
అజ్ఞానమనే చీకటి చేత అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.
* శ్రీ దక్షిణామూర్తి స్వరూపం, మూల మంత్రం - మేధా సంపత్తికి మంత్రం
ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛస్వాహా
ఈ మంత్రమును ఏకాంత ప్రదేశంలో కూర్చుని బ్రహ్మ చర్య దీక్షతో 11 రోజులు 11 వేలు జపించిన యెడల అపార మేధా శక్తి, బుద్ది సూక్ష్మత గ్రాహ్యత ప్రతిభ లభించి అన్ని విద్యలందు అఖండ విజయాన్ని పొందగలరు. విద్యయందు బృహస్పతితో సమానంగా,వాక్శుద్ధి తో సాధకుడు కీర్తిని పొందును.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,261; 104 తత్వాలు (Tatvaalu) and views 226,418 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments