సత్య హరిశ్చంద్ర నాటకం వారణాసి కాటిసీను డీవీ సుబ్బారావు గారి పద్యాలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1769 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1804 General Articles and views 1,395,973; 94 తత్వాలు (Tatvaalu) and views 184,896.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

బలిజేపల్లి లక్ష్మీకాంతం కవి విరచిత ప్రఖ్యాత నాటకం సత్యహరిశ్చంద్రీయము. సత్యనిష్ఠకు నిలిచి దారాసుతులను తనకు తాను అమ్ముడై నిలిచి సత్యహరిశ్చంద్రునిగా పేరు గాంచిన అయోధ్య చక్రవర్తి ఇనవంశోద్భవుడు హరిశ్చంద్రుని కథను నాటకంగా హృద్యంగా మలిచారు బలిజేపల్లి వారు. ఈ నాటకాన్ని బలిజేపల్లివారు 1930 సంవత్సరంలో ఉప్పు సత్యాగ్రహం సమయంలో కారాగారవాస సమయంలో రచించారు. ఈ నాటక రచయిత బలిజేపల్లి లక్ష్మీకాంత కవి బాపట్ల దగ్గర ఇటికలపాడు గ్రామంలో పుట్టారు.

సత్య హరిశ్చంద్ర నాటకం ఆనాడు, డీవీ సుబ్బారావు గారు పాడుతూ ఉంటే, ఆహా ఓహో అనేవారు.

శ్రీరామ నవమికి, రాత్రి వెసే డ్రామాలలో, ఖచ్చితము గా, ఈ డ్రామా వేసే వారు.

వారణాసి సీను నుంచి, కాటి సీను దాకా, చాలా పెద్ద నాటకం. ఆ పెద్ద పెద్ద దీర్ఘ రాగాలు తీయడం, ఆ పద్యాలు గుర్తుపెట్టుకుని పాడటం ఒక కళ, చాలా కష్టమైన సాధన.

కొన్ని పద్యాలు రాతలో, మిగతావి ఆడియోలో వినవచ్చును.

మీరూ గొంతుతో పాడి అందరికీ పంపి, ప్రోత్సహిస్తూ, మరుగున పడిపోతున్న మన కళను బతికిస్తారు కదూ?

అంత పెద్ద రాగాలు రాకపోయినా, కొంత పాడే ప్రయత్నము, దయచేసి వినండి.

*** దేవీ కష్టము లెట్లున్నను మహా పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించితిమి. ఈ వారణాసి

భక్తయోగ పదన్యాసి వారణాసి
భవదురిత శాత్రవఖరాసి వారణాసి
స్వర్ణదీ తటసంభాసి వారణాసి
పావనక్షేత్రముల వాసి 2 వారణాసి.

*** సత్య హరిశ్చంద్ర కాటిసీను

ఎంతమంది సతీమతల్లుల కన్నీటి ధారలు నింపుకున్నదో కదా ఈ రుద్రభూమి

ఇచ్చోటనే....ఇచ్చోటనే....!! సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోన కరిగిపోయే

ఇచ్చోటనే భూములేలు రాజన్యుల, అధికార ముద్రికల్ అంతరించే

ఇచ్చోటనే...!! లేత ఇల్లాలి...నల్లపూసల చౌరు, గంగలో కలిసిపోయే

ఇచ్చోటనే...! ఎట్టి పేరెన్నికల్ చిత్ర లేఖకుని కుంచేయు నశించే

ఇది పిశాచులతో...నిటాలేక్షణుండు...నిటాలేక్షణుండు...

గజ్జ కదిలించి ఆడు రంగస్థలంబు
ఇది మరణదూతా...
మరణదూత...దీక్షణమవు దుష్టులలయ, అవని పాలించు బస్మసిమ్హాసనంబు ఆ ఆ ఆ


*** స్వామి యగు వీరబాహుడు నన్ను "హరిశ్చంద్రుడా! కాదు, కాదు. వీరదాసుఁడా! నేటి రాత్రియందు వల్లకాటియందు గావలియుండి, యుదయమున నింటికి వచ్చుచున్నప్పుడీ కుండ నిండఁ గ్రొత్తకల్లు నింపుకొని రమ్ము" అని యీ సురాభాండమును నాకిప్పించినాడు. ఆహా, సురాభాండమా! నీవు పూజ్యురాలవు. కావుననే, విశ్వామిత్రుని సహాయసంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి నాస్థానంబగు నా భుజపీఠిపై నిట్లధిష్టించి యున్నావు. కానీ, నేనిప్పుడు శ్మశానవాటికకే వెళ్ళెదను. అంధకారమప్పుడే బ్రహ్మాండ మంతయు నావరించి కన్నులున్నవారిని గూడ గ్రుడ్డివాండ్రను జేయుచున్నది.

సీ. కలవారి యిండ్లలోపలి విధానము లెత్త
నరుగు దొంగలకు సిద్ధాంజనంబు
మగలఁ గూరుకనిచ్చి తెగి యంటుగాండ్రకై
తారాడు కులటల తార్పుగత్తె
అలవోక నలతి పిట్టలఁ బట్టి వేఁటాడు
పాడు మూకములకుఁ బాడి పంట
మసనంబులోన నింపెసలారు శాకినీ
ఢాకినీ తతుల చుట్టాల సురభి

రేలతాంగికి నల్లని మేలి ముసుఁగు
కమలజాండంబునకు నెల్ల గన్నుమూత
సత్యవిద్రోహి దుర్యశశ్ఛవికిఁ దోడు
కటికచీకటి యలమె దిక్తటములందు

ఇంకఁ ద్వరపడి శ్మశాన వాటికకే పోయెదను. (పిమ్మట శ్మశాన భూమి కాన్పించును) అహో! ఈ శ్మశానంబునం దెచ్చటఁ జూచినను,

సీ. కాఁబోలు బ్రహ్మరక్షస్సమూహం బిది
ఘోషించుచుండె ఋక్కుల క్రమంబు

కాఁబోలు వీరు విగత జీవబాంధవు
లడలుచుండిరి మహార్తారవములఁ
గాఁబోలు వీరు టక్కరి భూతమాంత్రికుల్‌
నెమకుచుండిరి కపాలముల కొఱకు
గాఁబోలు నిది పిశాచీబాంధవ శ్రేణి
పలలంపు బువ్వంపు బంతి సాగెఁ

చిట్లుచున్నవి కాఁబోలు చితులలోనఁ
గాల్పఁబడెడు శవాల కంకాళ సమితి
నెటఁ బెఠీలను రవములే యొసఁగుచుండు
దిక్కులన్నిండ మార్మోగింత పిక్కటిల్ల.

ఎవరచ్చట! నాకెదురుగా నిలుచున్నారు. పిలిచి చూచెదను. ఓహో, ఎవరువారు?

*** హరి - నేనిది బొత్తిగా నమ్మను. నీ కిప్పుడున్న విభవము శరీరమాత్రమే కాదు. ఆలోచించుకొనుము. చంద్ర: అయ్యో! ఇంకేమున్నది?

హరి - ఏమీ! ఇంకేమీ లేదా? చూడు,


మ. దళమౌ పయ్యెదలో నడంగియు సముద్యత్కాంతు లీరెండలన్‌
మలియింపన్‌ దిశలన్‌ ద్వదీయ గళసీమన్‌ బాలసూర్యప్రభా
కలితంబై వెలుగొందుచున్నదది మాంగల్యంబు కాఁబోలు! నే
వెలకైనం దెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్‌ జెల్లదే?

చంద్ర - (ఉలికిపడి) అయ్యో! దైవమా! రెండవ సురజ్యేష్ఠుండగు వసిష్ఠ మహర్షి ప్రభావంబుచే నా పతికి దక్క నన్యులకు గోచరంబు కాని నా మంగళసూత్రం బొక్క చండాలుని కంటఁ బడెనా! కాదు కా దీతఁడు నా పతి హరిశ్చంద్రుడే.

*** అశ్రాంతంబు పాదాక్రాంతులై నమస్కరించు సామంతులెల్ల నీ కిప్పుడేల యడుగులకు మడుగు లొత్త కుండిరి! కరపల్లవంబుల బంగారు పళ్ళెరంబుల బట్టి పురంధ్రీ జనంబు నీకేల నీరాజనంబుల నెత్తకుండె! నీ సత్యసంభాషామనీషం గుఱించి ప్రబంధముల నుడువు వందిమాగధ జనంబెందు బోయె! రాజచూడామణీ!

సీ. పసిఁడిమేడలలోన వసియించు ప్రభునకా
కటకటా! యీ వల్లకాటి వసతి
కనుసన్న దొరలచేఁ బనులందికొను మీక
యీ నికృష్టపు మాలవాని సేవ!
అలరుఁ దేనియలతో నారగించెడు మీకా
యకట! శవాల పిండాశనంబు
జిలుగు బంగారు దుస్తుల ధరించెడు మీక
పొలుసు కంపొలయు నీ బొంతకోక!

కనుల మీ యిట్టి దుస్థితిం గనిన నాకుఁ
జావురాకున్న దెంతని సంతసింతు!
హా హరిశ్చంద్ర! సార విద్యాఫణీంద్ర
బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర!  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1804 General Articles and views 1,395,973; 94 తత్వాలు (Tatvaalu) and views 184,896
Dt : 24-May-2021, Upd Dt : 24-May-2021, Category : Songs
Views : 13846 ( + More Social Media views ), Id : 1177 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : satya , harishchandra , natakam , drama , varanasi , katisinu , dv subbarao , padyalu , poems
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content