Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. Song Spirit - Rallallo Isakallo (Parody) - Seetharama Kalyanam - Balakrishna, Rajani - Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు
మనశ్శాంతి లేక లేదా సరదాగా, ఎన్నో గుళ్ళు గోపురాలు యాత్రలు తిరిగి, యాగాలు పూజలు దానాలు, చేసి ఉంటారు. కానీ చేదు దోసకాయ చేదు, కాశీ వెళ్ళినా రామేశ్వరము వెళ్ళినా మారదు, ఎందుకంటే దాని గుణము అదే.
మరి మనము, కపట నటన 2 నాల్కల, రజో తమో గుణాలలో తేలియాడుతూ, ఎక్కడ తిరిగినా, మనశ్శాంతి రాదు. ఆ శాంతి బయట లేదు, మనలోనే, మన మనసులో నే ఉన్నది. అంటే, మనసును నియంత్రణతో అదుపు తెచ్చుకుని, మానసిక బలం పెంచుకుంటే, ఎక్కడకు పోవాల్సిన పని లేదు.
ఒక్కోసారి అన్ని చేతికి అంది వస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మన కలలన్నీ పంటలై పండెనేమో, దైవ సంకల్పము కలిసింది కన్నుల పండగేమో అని పిస్తుంది. 78+ ఏళ్ళ అమ్మ, మన దగ్గరకు రావడం, 10 ఏళ్ళుగా సజీవ గురువు సేవ భాగ్యం కలిగించడం, అమ్మ వైద్యం ప్రయాణ అన్నిటికీ దేవుడు మార్గాలు ఏర్పరచడం, మనకు ఏమీ సంబంధము లేదు, అన్ని సమకూరాయి. ఆఖరికి, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, దైవ సంకల్పం, ఎలా అండగా నిలబడిందో మీకు తెలుసు కదా? కఠినమైన 230+ వారాల 108 ప్రదక్షిణలు, గంటా 15 నిమిషాలు ఆగకుండా, సాధ్యమా ఎండ వాన చలికి? అది దైవ సంకల్పం మాత్రమే కదా?
మరి అది చిననాటి సాధన మనకు అందమేమో, అది పెరిగి పెరిగి, నేటి వేదరాగ బంధమేమో అయినది. అందుకనే చిన్నప్పటి నుంచి, తొలకరి సాధనలలో ఉంటే, పులకించు హృదయాలలో, ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా, ఎన్నాళ్ళ కైనేడు, విన్నాము, వింటాము, శాంతుల, మేళాలు. ఆ మేళ తాళాలు, దైవ పెళ్ళి మంత్రాలై, వినిపించు వేళలో, సాత్విక మనసులో, ఎన్నెన్ని భావాలో.
చూశాము ఎన్నడో బ్రమలలో, వచ్చాయి కొత్తగా కష్టాలుఎన్నో. మనము 30 ఏళ్ళ దాకా మోహాలలో ఉండవచ్చు, తప్పులు చేసి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే, హృదయాన సాధన పొంగెనాడు, మదిలోన పూచెను శాంతులెన్నో. ఇంక మరలా అదే తప్పు చేయము, బుద్ది జ్ఞానం ఉంటే. అప్పుడు, వెన్నెల వానల్లో, వనరైన జలకాలలో, మనము మునగాలి, తేలాలి, తడవాలి, ఆరాలి, ధ్యానములో! ఆ దేవ ధ్యానాలు, మన కంటి పాపల్లో, కనిపించు నోములో, ఎన్నెన్ని సాధనలో.
Parody
రాళ్ళల్లో ఇసకల్లో, రాశాము దైవము పేర్లు ....
కళ్ళు మూసి చిన్నగా, మదిని తలచుకో
ఒక్కసారి.. ఇలలోని సాధన, గురుతు తెచ్చుకో - 2 సార్లు
కలలన్నీ పంటలై పండెనేమో., కలిసింది కన్నుల పండగేమో..
చిననాటి సాధన అందమేమో.., అది నేటి వేదరాగ బంధమేమో..
తొలకరి సాధనలలో., పులకించు హృదయాలలో .. 2
ఎన్నాళ్ళ కైనేడు, విన్నాము, శాంతుల, మేళాలు??
ఆ మేళతాళాలు, దైవ పెళ్ళి మంత్రాలై, వినిపించు వేళలో..
ఎన్నెన్ని భావాలో.. ||రాళ్ళల్లో ||
చూశాము ఎన్నడో బ్రమలలో., వచ్చాయి కొత్తగా కష్టాలుఎన్నో..
హృదయాన సాధన పొంగెనాడు., మదిలోన్ పూచెను శాంతులెన్నో..
వన్నెల వానల్లో., వనరైన జలకాలలో.. 2
మునగాలి, తేలాలి, తడవాలి, ఆరాలి, ధ్యానములో!!
ఆ దేవ ధ్యానాలు, మన కంటి పాపల్లో, కనిపించు నోములో..
ఎన్నెన్ని సాధనలో.. ||రాళ్ళల్లో ||
Original
రాళ్ళల్లో ఇసకల్లో, రాశాము ఇద్దరి పేర్లు ....
కళ్ళు మూసి చిన్నగా, కలిపి చదువుకో
ఒక్కసారి..కలలోన తీయగా, గురుతు తెచ్చుకో - 2 saarlu
కలలన్నీ పంటలై పండెనేమో., కలిసింది కన్నుల పండగేమో..
చిననాటి స్నేహమే అందమేమో.., అది నేటి అనురాగ బంధమేమో..
తొలకరి వలపులలో., పులకించు హృదయాలలో .. 2
ఎన్నాళ్ళ కీనాడు, విన్నాము, సన్నాయి, మేళాలు??
ఆ మేళతాళాలు, మన పెళ్ళి మంత్రాలై, వినిపించు వేళలో..
ఎన్నెన్ని భావాలో.. ||రాళ్ళల్లో ||
చూశాను ఎన్నడో పరికిణిలో., వచ్చాయి కొత్తగా సొగసులేవో..
హృదయాన దాచిన పొంగులేవో., పరువాన పూచెను వన్నెలేవో..
వన్నెల వానల్లో., వనరైన జలకాలలో.. 2
మునగాలి, తేలాలి, తడవాలి, ఆరాలి, మోహంలో!!
ఆ మోహదాహాలు, మన కంటి పాపల్లో, కనిపించు గోములో..
ఎన్నెన్ని కౌగిళ్ళో.. ||రాళ్ళల్లో ||
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,892,462; 104 తత్వాలు (Tatvaalu) and views 227,121 Dt : 19-Apr-2024, Upd Dt : 19-Apr-2024, Category : Songs
Views : 62
( + More Social Media views ), Id : 2086 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Song Spirit ,
Rallallo Isakallo ,
Parody ,
Seetharama Kalyanam ,
Sitarama Kalyanam ,
Sita rama ,
Seetha rama ,
Seeta rama ,
Kalyanam ,
Balakrishna ,
Rajani Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments