Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Goruvanka Vaalagane - Gandeevam - ANR, Balakrishna, Mohanlal, Roja
Malayalam superstar Mohanlal made a cameo appearance in the song Goruvanka Vaalagane. This song is about the child Krishna, and it goes on at a very fast pace, touching on various topics in a funny way. This was sung by 2 singers in the movie. We hope you will try to sing it with your voice and without getting tired. This is a good song for health and breathing and mind relaxing, my friend. Since we changed some words, it could also be called a parody.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గోరువంక వాలగానే పాటలో అతిధి పాత్రలో కనిపించారు. ఈ పాట బాల క్రిహ్నుడు గురించి పాడుతూ, వివిధ అంశాలను గమ్మత్తుగా పలకరిస్తూ, చాలా స్పీడ్ గా సాగుతుంది. ఇది సినిమాలో 2 గాయకులు పాడారు. మరి మీరు గొంతు విప్పి, జీర పోకుండా, పాడే ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాము. మనసుకు విశ్రాంతి, ఆరోగ్య సాధనకు, శ్వాస ప్రక్రియకు, ఇది మంచి పాట మిత్రమా. కొన్ని పదాలు మార్చాము కాబట్టి, పేరడీ అని కూడా అనవచ్చును.
గోరువంక వాలగానే గోపురానికి, స్వరాల గణ గణ, గంటలే మోగనేలా..
గోపబాలుడొచ్చినాక గోకులానికి, పెదాల గిల గిల, పువ్వులే పుట్టలేదా..
బాలక్రిష్ణుడొచ్చినప్పుడే, వయ్యారి నందనాలు నాట్యమాడగా.
[వారసుడ్ని చూసినప్పుడే, వరాల వాంఛలన్నీ పల్లవించగా.]
ఈశ్వరుడ్ని చూసినప్పుడే, వరాల వాంఛలన్నీ చల్లబడగా.
[నందుడింట చిందులేసే, అందమైన బాలుడే, తన వాడై...]||గోరువంక వాలగానే||
నందుడింట చిందులేసే, అందమైన క్రుష్ణుడే, మన వాడై...||గోరువంక వాలగానే||
ఏటి మనుగడ, కోటి అలలుగా, పొంగు వరదల, వేగాన
పడి లేచు అలలకు, తీపి కలలకు, లేని అలసట నీకేలా
నల్ల నల్ల నీళ్ళలోనా, ఎల్లాకిల్లా పడ్డట్టున్నా
అల్లో మల్లో ఆకాశానా చుక్కల్లో
అమ్మాయంటే జాబిలమ్మా, అబ్బాయంటే సూరిడమ్మా
ఇంటి దీపాలవ్వలంటా దిక్కుల్లో
ఎవరికి వారే.... యమునకు వీరే....
రేవు నీరు నావదంటా, నావ తోడు రేవుదంటా, పంచుకుంటే...||గోరువంక వాలగానే||
ప్రేమ ఋతువులు, పూలు తొడిగిన, తేనె మనుసుల నీడల్లో
మురిపాల నురగలు, పంటకెదిగిన, బాల సొగసుల బాటల్లో
గుణకర్మల [బుగ్గందాల] ఇల్లు నవ్వే, సిగ్గందాల [పిల్ల] కాలం నవ్వే
బాలయ్యొచ్చి కోలాటలాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే, పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో
పరవశమేదో....పరిమళమాయే....
పువ్వు నవ్వే దివ్వె నవ్వే, జివ్వు మన్న జన్మ నవ్వే, పాడుతుంటే...||గోరువంక వాలగానే||
MUSIC: M.M.KEERAVANI · LYRICS: VETURI · SINGERS: S.P. BALU & SRIKUMAR (1994)
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2302 General Articles and views 3,277,820; 104 తత్వాలు (Tatvaalu) and views 377,330
Dt : 24-Jul-2025, Upd Dt : 24-Jul-2025, Category : Songs
Views : 2590
( + More Social Media views ), Id : 2273
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Goruvanka Vaalagane ,
Gandeevam ,
ANR ,
Balakrishna ,
Mohanlal ,
Roja ,
balu ,
srikumar
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments