పంచాంగము - రాశి చక్రము, నక్షత్రములు, పాదములు, తారలు, అధిపతులు, తత్వములు, గుణములు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,126,075; 104 తత్వాలు (Tatvaalu) and views 239,335.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Almanac - Constellation/Zodiac, Nakshatras, Padas, Stars, Lords, Tattvas, Gunas

Whether we believe in the planets, stars, constellations, almanac or not, they continue to do their work. Ask those who are falling down and writhing under the blows of Saturn. We have read a lot of stories of those who were drowned in the influence of Rahu, floated in worldly illusions and fell in these 50 years. If we have sattvik guna and are sincere and do good deeds, we will not have planetary pain. But, if we say that all this money, beauty, property, position and power is mine and my group, then all that will be gone and our folks will cheat us, friend.

మనము గ్రహాలు నక్షత్రాలను రాశులను పంచాంగాన్ని నమ్మినా, నమ్మకపోయినా, వాటి పని అవి చేస్తూనే ఉంటాయి. ఏలినాటి శని దెబ్బకు, కింద పడి గిల గిలా కొట్టుకుంటున్న వారిని అడగండి. రాహు ప్రభావములో మునిగి, ప్రాపంచిక బ్రమలులో తేలి, ఈ 50 ఏళ్ళలో పతనము అయిన వారి కధనాలు చాలా చదివాము కదా. మనకు సాత్విక గుణం ఉండి, చిత్తశుద్దితో, మంచి పనులు చేస్తూ ఉంటే, గ్రహ బాధ మనకు ఉండదు. కానీ, ఈ ధనం అందం ఆస్తి పదవి అధికారం అన్ని నావే, నా వారివే అనుకుంటే, అవన్నీ పోయి, మనవారే మనల్ని చీత్కరిస్తారు మిత్రమా.

Although the earth revolves around the sun, to us on earth it appears as the sun itself revolves around the earth. Accordingly, according to the Hindu Almanac, the 6-month period during which the Sun travels towards the Northern Hemisphere is called Uttarayana, and the 6-month period during which it travels towards the Southern Hemisphere is called Dakshinayana.

సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నప్పటికి, భూమిపైనున్న మనకు సూర్యుడే భూమి చుట్టూ తిరుగుచున్నట్లు అగుపించును. ఆ ప్రకారం, హిందూ పంచాంగం ప్రకారం, గోచార (గ్రహ సంచార) రీత్యా, సూర్యుడు ఉత్తరార్ధగోళము వైపు సంచరించు 6 నెలల కాలమును ఉత్తరాయణము అని, దక్షిణార్ధగోళము వైపు సంచరించు 6 నెలల కాలమును దక్షిణాయనము అందురు.

సూర్యుడు ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉండి, మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా, ఒక రాశి నుండి మరొక రాశిలో సూర్యుడు ప్రవేశించడానిని సంక్రమనము అందురు. ఉదాహరణకు .... మేష సంక్రమనము, వృషభ సంక్రమనము .... ఆ విధంగా ధనసు రాశి నుండి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించడానిని మకర సంక్రమణం అందురు. దానినే మనము మకర సంక్రాంతి అని కూడా పిలుచుకొంటున్నాము.

According to astrology, there are nine planets. They are – Sun ☀, Moon, Mars ♂, Mercury ☿, Jupiter ♃, Venus ♀, Saturn ♄, Rahu (North Node or Head of Dragon) and Ketu (South Node or Tail of Dragon). Actually only the first 7 planets have gross shape. Rahu and Ketu planets have no form and are called shadow planets.

జ్యోతిష్యశాస్త్ర రీత్యా మొత్తం తొమ్మిది గ్రహములు(Planets) కలవు. అవి – సూర్యుడు (Sun ☀), చంద్రుడు (Moon), కుజుడు (Mars ♂), బుధుడు (Mercury ☿) , గురుడు (Jupiter ♃), శుక్రుడు (Venus ♀), శని (Saturn ♄), రాహు (North Node or Head of Dragon) మరియు కేతు (South Node or Tail of Dragon). వాస్తవానికి మొదటి 7 గ్రహాలకే స్థూల ఆకారము కలదు. రాహు, కేతు గ్రహాలకు రూపం లేదు, వీటిని ఛాయా గ్రహములు (Shadow Planets) అని అందురు.

తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలకు పంచాంగము అని పేరు. ఐదు అంగములు కలది కావున దీనిని పంచాంగము అందురు. దీనిలో పై ఐదు అంగాలతో పాటు రవ్యాదుల స్థిత్యాది విశేషాలున్నాయి. పంచాంగమునందు తిథ్యాదులు ఎన్ని గంటలవరకు ఉంటాయో ప్రతి దినమునకు వ్రాస్తారు. ఆ దినమునకు చెందిన సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు, ఇంగ్లీష్ తేదీలు, శాలివాహక శకం తేదీలు, ఆ రోజున సంచరించే గ్రహాల పేర్లు ఉంటాయి. తిథి, వార, నక్షత్ర, యోగా, కరణం వరుసగా వ్రాయబడి ఉంటాయి. ఆయనం, ఋతువు, ఇంగ్లీష్ తేదీల ప్రక్కన ఇంగ్లీష్ నెల, సంవత్సరం వ్రాయబడతాయి.

తిథి, నక్షత్రాల తరువాత అవి ఆ దినం ఎంత వరకు ఉంటాయో ఆ కాలాన్ని వ్రాస్తారు. దుర్ముహూర్త ప్రారంభ సమయము ఇచ్చి ఎంత కాలము త్యాజ్యమో వ్రాస్తారు. ఆ నెల ప్రారంభములో గ్రహస్థితిని తెలిపే చక్రం ఉంటుంది. లగ్నాంత కాలములు పగటికి రాత్రికి చెందినవి ఉంటాయి. సుముహూర్తాలు, గ్రహణాలు, మూఢములు మొదలగునవి సూచించబడతాయి.

రాశులు 12 - మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం

తిథులు 15. అవి – పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ / అమావాస్య.

నక్షత్రాలు 27 - అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ(పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి

ఇందు రిక్త తిథులు(చవితి, నవమి, చతుర్దశి) శుభ కార్యములకు పనికిరావు. ఆంధ్రులు షష్టి, అష్టమి, అమావాస్యలను కూడా అశుభ తిథులుగానే పరిగణించుట పూర్వాచారము.

నక్షత్రాలకు అధిదేవతలుగా కొందరిని గుర్తించడం జరిగినది. ఆయా దేవతలననుసరించి నక్షత్రము యొక్క శుభాశుభాలు ఆధారపడి ఉంటాయి.

ఏ జాతక చక్రమందైనా రాహు – కేతు గ్రహముల మధ్య మిగిలిన సప్త గ్రహములు ఉండిన యెడల దానిని కాల సర్ప యోగము , కాల సర్ప దోషము అని కూడా అందురు.

* గోచారములో శుభ ఫలితములనిచ్చు గ్రహములు(Pic 3)

* రాశులు, రాశ్యాధిపతులు, గుర్తులు(Pic 4)

* చర - స్థిర - ద్విస్వభావ రాశులు(Pic 5) - 1. Movable rasis are ruled by Brahma, the Creator. Their nature is to move and to be dynamic. 2. Fixed rasis are ruled by Shiva, the Destroyer. Their nature is to be stable and constant 3. Dual rasis are ruled by Vishnu, the Sustainer. They are stable sometimes and dynamic sometimes.

* నక్షత్రములు - తారలు - అధిపతులు(Pic 6)

* స్త్రీ పురుష రాశులు(Pic 5)

* బేసి రాశులు - సరి రాశులు(Pic 5)

* రాశి తత్వములు(Pic 5) - 5th element Akaasa or ether is present in every rasi.

* రాశి సంచరించు రోజులు (Pic 7)

* రాశి ఉచ్చ నీచ స్తితులు (Pic 8)

* నక్షత్రములు - నామములు(Pic 9)

* నక్షత్రము - జంతువులు - స్నేహ , విరోధ జంతువులు (Pic 10)

* నక్షత్రము - గుణములు - సత్వ, రజస, తమో (Pic 11)

* 12 రాశుల స్థానాల / హౌస్/ ఇళ్ళ ఫలితాలు (Pic 12)

* నవగ్రహ స్తోత్రములు(Pic 13)  
13 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,126,075; 104 తత్వాలు (Tatvaalu) and views 239,335
Dt : 29-Dec-2019, Upd Dt : 29-Dec-2019, Category : General
Views : 32868 ( + More Social Media views ), Id : 269 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : రాశి చక్రము , నక్షత్రములు , పాదములు , planet , rasi , stars , panchagam ,
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content