పాటతో పరమార్ధం- మానవ ఏమున్నది ఈ దేహం(భక్తి)- చక్రధారి- ఏఎన్ఆర్, వాణిశ్రీ, జయప్రద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,864,088; 104 తత్వాలు (Tatvaalu) and views 224,748.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Manava Emunnadi Ee Deham(Devotional) - Chakradhari - ANR, Vanisri, Jayapradha

ఏవండీ చూసారా, మనము కూడా, పరమహంసము గాము, పండితుడము కాము, మనకు ఏమి తెలుసు, ఈ హరికీర్తనము తప్ప, వేరేది ఎరుగమూ.

దేవ దేవుడైన ఆ హరి గురించి, ఇన్ని ఏళ్ళుగా మాటలు రాయడం, పాటలు పాడడం, సజీవ గురువు సేవ చేయడం, మంచి లక్షణాలు గల 10 మందికి, హైందవ సనాతన ధర్మ సాంప్రదాయాలను పంచడం, ఇవన్నీ ఒక్కో విధమైన తపస్సులే. ఇదీ ఒక మానసిక పూజనే భగవంతునికి.

భగవంతుని బిడ్డలుగా భావించి, ఏళ్ళుగా, సోషల్ మీడియా స్టేటస్ లో, సొంత మాటలు పాటలు పెడుతూ ఉన్నది మన సాధనలు అన్ని, మీకు తెలుసు. మీరు చూడకపోయినా, చూసి ఆచరణలో చేయకపోయినా, భవిష్యత్ గురించి జాలి పడటం తప్ప, చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే, అది మనమే రాసుకున్న రాత, అరిషడ్వర్గాల బానిసత్వములో.

ఎందుకు ఇలా కఠిన సాధన చెయ్యాలి? మేము అంతా, సుఖభోగాలు ఆనందిస్తూ, లక్షల ఆదాయం తో ఆస్తులు అధికారం బలగాలు పెంచుకుంటూ ఉంటే, మరి మీరు పిచ్చివానిలా ఈ ఉపయోగం లేని పనులు ఎందుకు, అందరికీ విరుద్దముగా, ఒంటరిగా ఒంటరి దోవలో, అంటారా? దానికి జవాబే ఈ పాట.

ఎంత సంపాదించినా, ఎన్ని పదవులు అధికారం వెలగబెట్టినా, చివరకు ఒంటరిగా రోగాలతో మరలా అదే ధనం ఖర్చు చేస్తూ, ఒళ్ళు కీళ్ళ నొప్పులతో భయంకరమైన బాధ ఎవరము తప్పించుకోలేము. మానవా, ఏమున్నది ఈ దేహం, ఇది రక్త మాంసముల, అస్తిపంజరం. దీనిపై, ఏలర, ఈ వ్యామోహం, అని ఆ భగంతుడే చెపుతున్నారు? మీరు కూడా, చివరి దశలో అయినా, ఈ మార్గములోకే రావాలి, ఇప్పుడు ఎన్ని పరుగులు తీసినా, గాలి మేడలతో.

మన పుట్టుక ఆలోచన చెయ్యండి. నవమాసాలు కడుపున చెరబడి, నవరంధ్రాలతో భువిపై దిగబడి, నవ నవ లాడీ, జవ జవ లాడీ, చివరకు నశించే, బొమ్మరా ఈ నరజన్మా. మరి దేని కోసం ఈ తాపత్రయం, మోసాలు, కోపాలు?

బంధాలు, కుటుంబం, బంధువులు, ఇవన్ని అవసరం అవకాశం కోసమేనా? ఊపిరాడేవరకే, నేను నాదను మమకారాలు, ఆపై వల్లకాటిలో, ఉండవు ఏ తేడాలు. నిజమే కదా? ఆ తర్వాత, మట్టి మట్టిలో, గాలి గాలిలో, మాయమౌ బొమ్మరా, ఈ నరజన్మా? మరి దీనికోసం, ఈ పరుగులు రోగాలు కన్నీళ్ళు స్వార్ధం?

భూమి పైకి వచ్చేటప్పుడు మనతో తెచ్చేదేది లేదు, పైకి పోయేటప్పుడు మనతొ అ మూట గట్టుకుని తీసుకుపోయేది అసలే లేదు. ఈ రాకపోకలా చీకటి దారిలో, మనకు వెలుగేది? ఆ దివ్వెరా విఠలునీ దివ్య నామం, మరి అది సాధనతో నే వస్తుంది.

మరి మేము చిన్నప్పటి నుంచి అదే సాధనలో ఉన్నాము, మరి మీరు ఎప్పుడు? మీ త్రికరణ శుద్ది ఆచరణల సాక్ష్యాలు ఏవి? మొక్కై వంగనిదే మానై వంగుతుందా? ఇప్పుడైనా ఆలోచన చెయ్యండి. రాబోయే కాలం, ఇంకా పాపాల గడ్డు కాలం. దేవుడు మాత్రమే రక్షించ గలడు. అది వేదాలలో ఏనాడో చెప్పారు. అరిషడ్వర్గాల బానిసత్వములో, మాయలో చిక్కుకున్నాం, విల విల లాడుతున్నాము.

పరమహంసను గా.ను, పండితుడను కా.ను
హరికీర్తనము తప్ప.., వే.రే.ది ఎరుగనూ.., వే.రే.ది ఎరుగనూ..

మానవా.. ఏమున్నది ఈ దే.హం.
ఇది రక్త మాంసముల., అస్తిపంజరం.
దీనిపై., ఏలర., ఈ వ్యామోహం.. ||మానవా||

నవమాసాలు కడుపున చెరబడి, నవరంధ్రాలతో.. భువిపై దిగబడి
నవ నవ లాడీ, జవ జవ లాడీ,
నశించే, బొమ్మరా.., ఈ నరజన్మా...||మానవా 2||

ఊపిరాడేవరకే, నేను నాదను మమకారాలు
ఆపై వల్లకాటిలో, ఉండవు ఏ తేడాలు
మట్టి మట్టిలో, గాలి గాలిలో,
మాయమౌ బొమ్మరా, ఈ నరజన్మా...||మానవా 2||

వచ్చేటప్పుడు నీతో తెచ్చేదే.ది లే.దు
పోయేటప్పుడు తీసుకుపోయేది అసలే లేదు
ఈ రాకపోకలా చీకటి దారిలో
దివ్వెరా విఠలునీ దివ్య నామం.. ||మానవా 2||

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,864,088; 104 తత్వాలు (Tatvaalu) and views 224,748
Dt : 19-Mar-2023, Upd Dt : 19-Mar-2023, Category : Songs
Views : 1824 ( + More Social Media views ), Id : 1737 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : song , spirit , manava , emunnadi , devotional , chakradhari , anr , vanisri , jayapradha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content