పాటతో పరమార్ధం- నాలో నిను చూసుకోగ,కన్న తల్లికి సేవలు పాట- అభిషేకం- ఎస్వీ కృష్ణా రెడ్డి, రచన, రాధిక - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2105 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2140 General Articles and views 2,085,605; 104 తత్వాలు (Tatvaalu) and views 237,313.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Naalo Ninnu Chusukoga, Song of Seva for Mom - Abhishekam - SV Krishna Reddy, Rachana, Radhika, Srihari - 21/Apr/24 Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు

*పాటతో పరమార్ధం- నాలో నిను చూసుకోగ, సేవలు నువు నేర్పినవే అమ్మా, కన్న తల్లికి సేవలు పాట - అభిషేకం - ఎస్వీ కృష్ణా రెడ్డి, రచన, రాధిక, శ్రీహరి*

ఎస్వీ కృష్ణారెడ్డి గా పిలువబడే సత్తి వెంకట కృష్ణా రెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, నటుడు. దర్శకత్వంతో బాటు కథా రచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న, మంచి అభిరుచి వ్యక్తిత్వం గల వ్యక్తి. కె. అచ్చిరెడ్డితో కలిసి, ఇతను రూపొందించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. నష్టపోయినా సరే, మంచి సినిమాలను సకుటుంబముగా చూసే భాగ్యం మనకు కలిగించారు. యమలీల, ఘటోత్కచుడు, శుభలగ్నం, ఉగాది, దీర్ఘ సుమంగళీ భవ, . . . ఇంకా ఎన్నో.

ముదుసలి అమ్మ నాన్నను అత్తను మామ ను సొంత బిడ్డలా, కను రెప్పలా దగ్గర పెట్టుకుని, ప్రేమ ఆప్యాయత గౌరవం దైవత్వం తో చూసుకునే వారికి, సజీవ గురువు సేవ చేసుకునే వారికి, ఈ పాట అంకితం. చూడండి ఆ బిడ్డ, ఆ అమ్మకు నమస్కరిస్తూ పాడే పాట, ఆమె నేర్పిన గుణాలను సేవలను మరలా అమ్మకే అందజేస్తూ మనకు ఇచ్చిన మంచి బహుమతి.

అమ్మా నాలో, నిను చూసుకోగ, నాతో ప్రేమ ఆప్యాయతలు మురిపించుకోగ, మా ఒళ్ళో పాపాయివైనా వమ్మా. నిత్యం కాపాడుతున్నా, నీలా నే పెంచగలనా, ఇంకా నీ ముందు పసివాడినేగా, అమ్మా. ఆనాడు నువ్వు రామరక్ష అని లాల పొసినా, శ్యామలాలి అని లాలి పాడినా, బువ్వ పెట్టినా బుజ్జగించినా, చేయి పట్టుకొని నడక నేర్పినా, అమ్మను మించిన అమ్మను నేకాగలనా? ఏనాటికి అమ్మను మించి కాదు, అమ్మ సేవలో కాలి గోటికి కూడా మనము సరిపోము.

తల్లి దండ్రుల బుద్దులే పిల్లలకు అబ్బుతాయి అని 80 శాతం నిరూపణ అయ్యింది అని మనకు తెలుసు. మొన్న 2 విద్యార్ధులు, షుమారు 24 ఏళ్ళ వయసు, తమ దొంగ తన కళను ప్రదర్శన చేసి, విదేశం లో అరెస్ట్ అయ్యారు. అలాగే హైదరాబాద్ దగ్గరలో 20 ఏళ్ళ చెల్లి, అక్కను సొంత ఇంట్లో దొంగ తనము వద్దు అన్నది అని, శివైక్యము చేసింది. ఈ మధ్య ఇంకోటి ఉత్తర భారత విధ్యార్ధి, 30 ఏళ్ళ లోపు వ్యక్తి ని విదేశం లో, పర్సు షాప్ నుంచి దొంగిలించినందుకు జైలుకు పోయారు. ఇలా తమ పెద్దల సంస్కారాన్ని ప్రపంచ వ్యాప్తం చేసారు.

ఈరోజు సోషల్ మీడియాలో చెపుతున్నారు, అబ్బాయి తాను పెంచే కుక్కను కాబోయే భార్య కోసం వదిలేస్తే, అతను భార్యను కూడా, భవిష్యత్తులో అలాగే నిర్ధాక్షిణ్యముగా వదిలేస్తాడు. ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకోవద్దు అని. మరి తల్లి దండ్రులను, అత్త మామలు కుక్కల కంటే హీనము అయ్యారా? వారిని వదిలేసిన వారు, భాగస్వామిని పిల్లలను మాత్రం వదలరా? అవ్వ.

మిగతా తల్లి దండ్రులు, మనకు పలుకుబడి అధికారం ధనం ఉంది, కాబట్టి ఏమీ కాదు, మన పిల్లలు అలాంటి వారు కాదు అని అనుకుంటారు. కానీ వారికి కూడా కర్మ ఫలము తప్పదని, మన పెద్దలు నిరూపించారు. వారి స్నేహితుల ప్రోద్భలము తో అయినా, తమ సంస్కార పెంపకం తో అయినా, చెడు దోవలోకి తేలికగా వెళ్ళి, సొంత కుటుంబానికే ద్రోహం చేసిన, ఉదాహరణలు ఎన్నో మనకు.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ‌‌‌, కాఫీడేఅయ్య, మాల్యయ్య, సింఘానియయ్య, మీ ఇంట్లో మా ఇంట్లో, లాంటి మహానుభావుల చివరి పేజీలు చదవండి. అందుకే మన పిల్లలకు మానసిక బలం పెంచాలి, అప్పుడే ఏ చెడు వారిని కదిలించలేదు. మన ముదుసలి తనములో, మనకు అండగా నిలుస్తారు, చేయి పట్టి నడిపిస్తారు.

అమ్మా నీ సేవలో నాకు రాత్రి పగలు తెలీదు. నువ్వు మేలుకొని ఉంటె, నాకు అది పట్టపగలు వేళా. ఒకవేళ ఆదమరిచి నువు నిద్దరోతే, అది అర్ధరాత్రి వేళ అవుతుంది నాకి. నిన్ను మించి వేరే, నా లోకమంటు లేదే, నిజమే కదా 24 గంటలు నీతోనే. నీకు కోపం వచ్చి అలిగిన సమయాన్నే, నడి వేసవి అనుకోనా? అలాగే సంతోషముతో, నువ్వు నవ్వే ఆ కిలకిల నవ్వులనే, చిరుజల్లులు అనుకోనా? నేడు మేము చేసిన సేవలు ఆని ఒకనాడు నువు నేర్పినవే కదా అమ్మా...

ఏ బిడ్డకైనా, అమ్మ లాలనా ఎంత పొందినా, అంతనేది ఉందా? వేయి జన్మల ఆయు విచ్చినా, చాలని పిస్తూందా? ఆ అమ్మ లేని బ్రహ్మా, చేసేది మట్టిబొమ్మా. మనల్ని మనిషిగ మలిచేదీ, కని పెంచు తల్లి మహిమా కాదా? మన మనసున నిలిచేదీ, ఆ మాత్రుమూర్తి ప్రతిమ కాదా? అలాగే కన్న తండ్రి మనోనిబ్బరం కూడా. దేవుడు సైతము కోరిన దీవేన అమ్మా కాదనగలమా?

రోజూ పాడే ఈ పాటల పేరు, నిత్యం సాగే నా బాట పేరు, అలాగే అలసి సొలసి ఆగే ప్రతి చోటు పేరూ, అమ్మా. ఎదలో మ్రొగే నాదాల పేరు, రోజూ కదిలే మన పాదాల పేరు, ప్రపంచానికి ఆదర్శముగా ఎదిగిన ఇన్నేళ్ళ పేరు, అమ్మా. ఆ అన్నమయ్య గీతాల భావన, త్యాగరాజు రాగాల సాధన, ఎన్ని పేర్ల దేవుల్ని కొల్చినా, తల్లి వేరులే వాటి చాటునా. అన్నిటా ఉన్నది ఒక్కటే కమ్మని పేరు, అమ్మా.

నాలో, నిను చూసుకోగ, నాతో మురిపించుకోగ, ఒళ్ళో పాపాయివైనా వమ్మా...
నిత్యం కాపాడుతున్నా, నీలా నే పెంచగలనా, ఇంకా పసివాడినేగా, అమ్మా.....
రామరక్ష అని లాల పొసినా, శ్యామలాలి అని లాలి పాడినా.
బువ్వ పెట్టినా బుజ్జగించినా, చేయి పట్టుకొని నడక నేర్పినా.
అమ్మను మించిన అమ్మను నేకాగలనా... ||నాలో నిను||

నువ్వు మేలుకొని ఉంటె నాకు అది పట్టపగలు వేళా .
ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్ధరాత్రి వేళా....
నిన్ను మించి వేరే, నా లోకమంటు లేదే
అలిగిన సమయాన్నే., నడి వేసవి అనుకోనా.
కిలకిల నవ్వులనే, చిరుజల్లులు అనుకోనా.
చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా...||నాలో నిను||

అమ్మ లాలనా ఎంత పొందినా, అంతనేది ఉందా.
వేయి జన్మల ఆయు విచ్చినా, చాలని పిస్తూందా..
అమ్మ లేని బ్రహ్మా., చేసేది మట్టిబొమ్మా.
మనిషిగ మలిచేదీ.., కని పెంచు తల్లి మహిమా.
మనసున నిలిచేదీ., ఆ మాత్రుమూర్తి ప్రతిమా.
దేవుడు సైతము కోరిన దీవేన అమ్మా...

పాడే ఈ పాట పేరు, సాగే నా బాట పేరు, ఆగే ప్రతి చోటు పేరూ, అమ్మా...
ఎదలో నాదాల పేరు, కదిలే పాదాల పేరు, ఎదిగిన ఇన్నేళ్ళ పేరు, అమ్మా...
అన్నమయ్య గీతాల భావన., త్యాగరాజు రాగాల సాధన..
ఎన్ని పేర్ల దేవుల్ని కొల్చినా., తల్లి వేరుల వాటి చాటునా.
ఉన్నది ఒక్కటే కమ్మని పేరు, అమ్మా....
పాడే ఈ పాట పేరు, సాగే నా బాట పేరు, ఆగే ప్రతి చోటు పేరూ అమ్మా...

మూవీ : అభిషేకం - సంగీతం & రచన & గానం : SV కృష్ణా రెడ్డి  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2140 General Articles and views 2,085,605; 104 తత్వాలు (Tatvaalu) and views 237,313
Dt : 21-Apr-2024, Upd Dt : 21-Apr-2024, Category : Songs
Views : 217 ( + More Social Media views ), Id : 2088 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Naalo Ninnu , Nalo Ninu , Naalo Ninu , Abhishekam , SV Krishna Reddy , Rachana , Radhika , Srihari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content