సంపాదన ఆస్తి ఉన్నదంతా దానం. దాని వలన దైవ భక్తి ముక్తికి, ఆధ్యాత్మికతకు, ప్రయోజనం ఉందా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,941,276; 104 తత్వాలు (Tatvaalu) and views 230,667.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఏవండీ ఉన్నదంతా దానం చేసాము అని చెపుతున్నారు కొందరు, 10 ఏళ్ళు సంపాదన లేదా ఆస్తి ఉన్నవారు, దాని వలన దైవ భక్తి ముక్తికి, ఆధ్యాత్మికతకు, ప్రయోజనం ఉందా? అసలు దానం చేయాల్సింది ఏమిటి మరియు వదలాల్సింది ఏమిటి?*

*Some people say that they have donated everything, those who have 10 years of income or property, is there any benefit to the spiritual, salvation, godly devotion? What should actually be donated and what should be left?*

ముందుగా, నిస్వార్ధముగా ఏదైనా వదులుదాము లేదా దానము చేద్దాము అని ముందుకు వచ్చిన వారిని, కనీసం ప్రయత్నం చేసిన వారిని, మనము అభినందించాలి, ప్రాపంచిక భౌతిక ద్రుష్టితో.

First, we should congratulate those who selflessly come forward to give up or donate something, at least a try, with a worldly material focus.

ఎందుకంటే, చాలా మంది, ఉపయోగము లేకుండా, ఎవరికీ రూపాయ ఇచ్చే పరిస్తితి లో లేరు. దాని నుంచి, మరలా మనము ఏదీ ఆశించకూడదు సుమీ. ఉచిత వసతి లేదా వైద్యం లేదా ఇంకోటి ఏదైనా.

Because most people, without use, are not in a position to give rupees to anyone. From that, we should not expect anything again. Free accommodation or medical or anything else.

ఇప్పుడు దైవ భక్తి ముక్తికి ప్రయోజనం గురించి లోతుగా మాట్లాదుకుందాము. ఎందుకంటే, ముందుగా అభినందించనిదే, మన మనసు నిర్మలముగా ఉన్నట్లు కాదు.

Now let us talk in depth about the purpose of divine devotion for salvation. Because, without first appreciating, our mind is not pure.

నీతి నిజాయితీ వదలి, ఎవరికో ఒకరికి వత్తాసు పలికే పత్రికలు, ఈ మధ్య మనకు వార్తలలో ఈ విషయాలను, సగం సగం సమాచారముతో ప్రచురిస్తున్నాయి, తమ వారిని గొప్పవారిగా పేర్కొంటూ.

ఇంకొంత మంది తెలివిగా, పన్ను రాయితీ జమా ఖర్చులకు లేదా టాక్స్ తప్పించుకోవడం కోసం, తమ లేదా తమ వారి ట్రస్ట్ లకే, వేరు వేరు మార్గాల ద్వారా దానం ఇచ్చి, తామే లేదా తమ వారే వాటినీ చాటుగా నడుపుతున్నారు లేదా లాభం పొందుతున్నారు.

Others cleverly donate to own or their relative trusts through separate channels to defray tax-deductible expenses or to avoid tax, and run them or profit from themselves.

ఈ అయోమయ రహస్య చాటుమాటు దానాలు చూసి, ప్రాపంచిక వాసనలు కలిగిన వారు, అబ్బో ఆహా ఓహో అంటున్నారు, పూర్తి అవగాహన లేక.

Those who have worldly smells, seeing these confusing secret gifts, say AHA OHO, without full understanding.

ఒకాయన తనకు ఉన్న కోట్ల నుంచి, ఓ 10 కోట్లు బయటకు తీసి, ఇన్ కం టాక్స్ వారికి చూపించి, దేవుని కి కిరీటం చేయించారు. అది దైవ సేవ అనేవారు ఉన్నారు. ఇంకొకాయన, తన విదేశీ మరియు ఇంకో రాష్ట్ర ధనం, తన బంధువుల ట్రస్ట్ కు దాన చేసారు. తర్వాత, తన అక్రమ కార్యక్రమాలు యధావిధిగా కొనసాగించారు. ఇప్పుడు ఆ దానము వలన ఎవరికి ఉపయోగము?

One person, took out 10 crores from the crores he had, showed them the income tax and gave the crown to God. There are those, who call it divine service. In addition, he donated his foreign and other state money to his relatives trust. Later, he continued his illegal activities as usual. Now who benefits from that donation?

ఆ ధనం ఎవరికి ఎలా ఉపయోగపడిందో కూడా ముఖ్యం. కిరీటానికి ఇచ్చినది, గుడిలో ఉన్న దొంగలు మాయం చేసారు. దొంగల సొమ్ము దొంగల పాలే కదా? ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపం మనకు. వారికి దోవ చూపించాము కదా. అందుకే గుణవంతులకే ధనం ఇవ్వాలి.

ధనమే జగతికి మూలం అవ్వచ్చు, కానీ ఆ ధనాన్నే ఇచ్చిన దేవునికి కూడా, అదే మూలం అందామా?

ఆస్తులు మరియు ఉన్నదంతా దానం ఇచ్చినా సరే, మరి ఇన్నాళ్ళు అందరినీ వదిలి, అరిషడ్వర్గాలు లో మునిగి సాధించింది ఏమిటి? ఎందుకు ఇప్పుడు మనసు మారింది, ఏమి జ్ఞానోదయము అయ్యి? ఇంతకాలం పరుగులు తీసి, మానసిక శాంతి లేక, పొందినది ఏమిటి కూడా, అందరికీ చెప్పాలి కదా?

Even if one gives away ones possessions and all, what has one achieved by abandoning all others and drowning in arishadvarg? Why has the mind changed now, what is the enlightenment? After running for so long, there is no peace of mind, and what has been gained, should we tell everyone?

అదే పని ముందే చేసి, ప్రశాంతముగా ఉన్న వారి మాట, ఎందుకు వినము? మరి దానం చేసింది కేవలం ఆస్తులేనా? లేక అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు, ప్రాపంచిక భ్రమలు కూడానా? ఇవి వదలకుండా, జీవితము లో ఇంకేమి వదిలినా, ఉపయోగం ఏముంది?

Why don't we listen to those, who have done the same thing before and are calm with peace of mind? And what was donated was only property assets? Or Arishadvarg, Ashtavyasan, and even worldly illusions? Without these, what is the use of leaving anything else in life?

ఒకవేళ పిల్లలు ఉంటే, పిల్లలను సంస్కారముగా పెంచారా? వారి దగ్గర రేపు ముదుసలి వయస్సులో ఉండగలరా? తమ తల్లి దండ్రులను, ముదుసలి వయస్సులో దగ్గర ఉంచి చూసారా? ఆధ్యాత్మిక సాధన చేసారా, సౌకర్యాలు ఆడంబరాలు ఆర్భాటాలు వదిలేసి? ఇతర త్యాగాలు దేవుడు మెచ్చేవిధముగా ఉన్నాయా? ఇవన్నీ ఎందుకు చెప్పరు? దైవానికి మోక్షానికి కావాల్సింది ఇవి కదా?

If have children, are the children raised properly? Can they have us, at old age tomorrow? Did they keep their parents at home, in their old age? Have you done spiritual practice, leaving the comforts and pomp? Are other sacrifices acceptable to God? Why not say all this? Isn't this what God wants for salvation?

ఇంకొంతమంది కాశీ రామేశ్వరం వెళ్ళి ఏవో వదిలాము అంటారు. ఇంటికి రాగానే మరలా తగువులు కోపాలు తాపాలు. ధనం వ్రుధా తప్ప, ఉపయోగం ఏమీ ఉండదు వీరితో. చేదు దోసకాయ సామెత, ఎన్ని తీర్ధాలు తిప్పినా, గుణం మారదు కదా.

Some people go to Kashi Rameswaram and say, we left that and this. When they came home, lust fighting shouting angry again. There is no use for them, except money expenditure. Bitter cucumber proverb, no matter how many tirdhas it goes, the quality does not change.

చెప్పండి ఈ మాత్రం దానికి, బిజీ బిజీ అని, అందరితో తగువులు కొట్లాటలు కోపాలు మోసాలు 2 నాల్కలు ఎందుకు, చివరకు అంతా శూన్యమే, అందరూ ఒంటరే. మరి సీనియర్ ఒంటరి మాట, అప్పుడే మనకు అర్ధం అవుతుంది.

కానీ ఆనాడు చివరలో, బ్రమలన్ని తొలగి, జీవితం మొత్తము వ్రుధా అయ్యింది అని తెలుసుకుని, మానసిక నియంత్రణ లేక, మనసు తట్టుకోలేక మైండ్ పొతుంది, అవమానముతో కుంగిపోతాము, పతనం అవుతాము. కాబట్టే, ఇప్పటినుంచే, వాస్తవాన్ని చూద్దాము, నేర్చుకుందాము, నేర్పుకుందాము.

అన్నా ఎంత డబ్బు పిచ్చి లో మేము ఉన్నామో, అర్థం అయింది కదా. రేపు మా గోపీ లు, మొత్తం దానం చేసిన, వారి గత తప్పు లు మొత్తం, మేము క్షణం లో క్షమించేసి, వారి పాదాలకు నమస్కరించి, వారితో కలసి మెలసి ఉంటూ, పుణ్యం పొందుతాం, అంటారా?

భక్తులు గా 30 ఏళ్ళు పూజలు చేసి, దేవుని ని ధనం తో కొనలేము అని గుణం తో మాత్రమే, సజీవ గురువు సేవతో మాత్రమే అని తెలిసినా, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల బానిసత్వం తో లోతు తెలుసుకోకుండా, ధనం తో ముడిపడినవి మాత్రమే మెచ్చుతాము పతన మార్గం లో. గోపీ ల ధనం తో కూడా నిలబడుతోంది కదా, ఒక ప్రాణం. అవకాశం అవసరవాదులు అలాగే అనుకుంటారు.

సొమ్ము ఎలా వచ్చింది, మనం ఎలా సంపాదించాం, ఎంత మంది రాచిరంపాన పెట్టి కష్టాలు కన్నీరు మోసం తో ధనం ఆస్తులు పొందాము అని కూడా లెక్కకు వస్తుంది సుమా. పిల్లిని చంపిన పాపం వేరు, దానికి బదులు బంగారు పిల్లిని దానం చేసిన పుణ్యం వేరు, దేని దోవ దానిదే.

How did we get the money, how did we earn it, how many people got suffer, and got money property through fraud and hardships? The sin of killing a cat is different, the merit of donating a golden cat instead is different, both will have their own results.

* * *

సంపాదన, ఆస్తి దానం వలన దైవ భక్తి ముక్తికి, ఆధ్యాత్మికతకు, ప్రయోజనం ఉందా? అసలు దానం చేయాల్సింది ఏమిటి?
Is there any benefit of income/ property donation to the spiritual, salvation, godly devotion? What should actually be donated?

దేవునికి నచ్చే దానాలు? Donations that please God?

Set 1 - సంపాదన/ ధనం, ఆస్తి , పదవి, అధికారం, పై 4 కు చెందిన ఇతరములు - కాదు
Income/ Money, Property, Position, Power, Other things related to above 4 - NO

Set 2 - అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు, ప్రాపంచిక భ్రమలు, 11 పాపాలు, సౌకర్యాలు ఆడంబరాలు ఆర్భాటాలు - ముందు కధనాలులో చదివారు - ఇవన్నీ వదలడం, దానం చేయడం, అవును
Arishadvarg, Ashtavyasan, Worldly illusions, 11 Sins, Comforts Pomp - Read in previous articles - It's all about giving up, donating, YES

సమయ దానం - సంస్కార పిల్లలు, మాత్రుభాష, మాత్రుదేశ, పని దేశ, ముదుసలి తల్లి దండ్రుల/ అత్తమామ సేవ, వాక్సుద్ది, ఆధ్యాత్మిక సాధన, శారీరక మానసిక సేవ సాధన నియంత్రణ, సజీవ గురు సేవ, ఇతర త్యాగాలు & సేవలు? - అవును

Donation of time - Children raised properly, mother tongue, mother land, job land, Oldage Parents/In-laws Seva, Vaksuddi, Spiritual practice, Physical Mental Seva Practice Control, Living guru seva, Other Sacrifices & Seva? - YES

Set 1 is just a small part of Set 2.
Set 1 అనేది, Set 2 లో ఒక చిన్న భాగం మాత్రమే.

Daana KarNa or anyone can do Set 1, but not Set 2.
దాన కర్ణుడు లేదా ఎవరైనా, Set 1 చేయగలరు, కానీ Set 2 చేయలేరు.

Please see part 2 link

#Arishadvarg #Ashtavyasan #saptavyasan #livingguruseva #guruseva #pradakshin #fasting #navagraha #harathi #karamala #Shiromundan #templeprasad #NavaDhanya #Shiva #Shani #parents #oldparents #momfeet #GunaKarma #vaksuddi #Jalaneti #barefoot #ayurveda #gheelamp #mothertongue #SanatanaDharma #Gratitude  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,941,276; 104 తత్వాలు (Tatvaalu) and views 230,667
Dt : 03-Nov-2022, Upd Dt : 03-Nov-2022, Category : General
Views : 624 ( + More Social Media views ), Id : 1607 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : donated , everything , income , property , benefit , spiritual , salvation , godly , devotion , donation , danam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content