Happy Diwali - Ghee lamps, fireworks, Remove darkness, Health, Praying God - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1758 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1793 General Articles and views 1,383,643; 93 తత్వాలు (Tatvaalu) and views 184,040.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

దీపావళి శుభాకాంక్షలు Happy Diwali

నెయ్యి నువ్వుల దీపాలు ఆరోగ్యం - చుట్టు వాతావరణం ను శుద్ది చేస్తాయి. సాధారణ టపాసులు కూడా, గాలిలోని క్రిములను చంపుతాయి.

Ghee sesame lamps healthy - cleanse the surrounding environment. Ordinary tapas (fireworks), too kill germs in the air.

పిత్రుదేవతల స్మరణ కు తర్పణాల కు కూడా ఈ అమావాస్య మంచిది.

This Amavasya is good for remembering and giving tarpaNa to pitrudev.

1. దేవుడు మనకు మరియు మన కుటుంబానికి, అజ్ఞానమనే చీకటిని పారద్రోలే వెలుగును ప్రసాదించి, అరిషడ్వర్గాలను కూడా జయించే శక్తి ఇస్తారని ప్రార్ధిస్తున్నాము.

Praying God to give strength to remove darkness of ignorance from us and our family. Should give strength to conquer arishadvarg also.

2. ఆరోగ్యమే మహా భాగ్యమని అదే పెద్ద ఐశ్వర్యమని కరోనా గురువు, మన సనాతన సాంప్రదాయాలను అలవాట్లను గుర్తు చేసారు. వాటిని చిత్తశుద్దితో పాటించే శక్తి మనకు మన కుటుంబానికి ఇవ్వాలి ప్రార్ధన చేస్తున్నాము. లేకపోతే, ఇంకా ఎన్నో కరోనా ఫ్లూ బూస్టర్ షాట్ టీకాలకు వెళుతాము.

Health is wealth, it is biggest asset - Corona guru already proved it and reminded us about our sanatan dharam and old good habits. So praying God to give enough strength to us and our family to follow and practice them daily. Otherwise, we will go with many booster (corona/ flu) shots.


3. కోట్ల రూపాయలు ఉన్నా, కోటి మంది జనం అండ ఉన్నా, మానసిక బలం లేకపోతే అవన్నీ శూన్యం అశాశ్వతం కాబట్టి, ఆ మానసిక బలాన్ని మనకు మన కుటుంబానికి ఇవ్వాలని దేవునికి ప్రార్ధన.

Even if we have crores of money or people support, if we don't have mental strength then everything will be useless and not be with us for long time. So praying God to give strength to increase mental strength for us.


4. సంస్కారం క్రుతజ్ఞత బాధ్యత విశ్వసనీయత అనేది, గతాన్ని మరువని వారికి అలాగే గతానికి విలువ ఇచ్చేవారికి ఉంటుంది. కాబట్టి తెలుగు లో సొంతముగా పండుగ లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు రాసే మానసిక బలాన్ని ఇచ్చి, సొంత ముదుసలి తల్లి దండ్రులను సొంత పిల్లలుగా చూసే ధైర్యాన్ని ఇమ్మని దేవునికి ప్రార్ధన.

Samskar, gratitude, responsibility, credibility is only with the people who still remember the past and give important value to past (our roots). So praying God to give enough strength and courage to write festival or birthday wishes in our mother tongue ourselves, and to take care of our old parents as our own children.

ఇవే సంస్కారం క్రుతజ్ఞత బాధ్యత విశ్వసనీయత పిల్లలకు నేర్పే, మనసును కూడా మనకు ఇవ్వాలని దేవునికి ప్రార్ధన.

Praying God to give strength to our mind to teach the same Samskar, gratitude, responsibility, credibility to our next generations.

5. రోజూ అరగంట పూజను సొంత నోటితో నాలుకతో పద్మాసనం లో చదివే పలికే శక్తిని ప్రసాదించాలని ప్రార్ధన. దానివలన మన శ్వాస నియంత్రణ ప్రక్రియతో మన ఊపిరి తిత్తులను రక్త ప్రసరణను క్రమబద్దీకరించి, వాక్శుద్ది తో పాటుగా మన ఆరోగ్య పెంపుదలకు ఉపయోగపడుతుంది. ఆసుపత్రి మందులకు సందర్శన లకు ఖర్చు చేసే వ్రుధా ధనం, పేద వారికి లేదా అవసరం ఉన్నవారికి ఇవ్వవచ్చు.

Praying God to give strength to do puja in padmasan for 1/2 hr by own tongue/ mouth by saying Slokas. It will help for BP control and lungs proper working. Instead of spending wasting money for hospital visits and medicine, we can give to poor or needy folks.

6. పెళ్ళి అయినా, రోగము అయినా, బాధ అయినా, కష్టమైనా, సుఖ మైనా, వాటి అన్నిటికి కర్త కర్మ క్రియ మనమే. దాని ఫలితాలు మనమే అనుభవించాలి, ఈ జన్మలో లేదా పై జన్మలలో అన్న స్రుహతో, మోహ మాయకు దూరముగా ఉండే శక్తి నివ్వమని, అర్జుని రధసారధిలా మన మనసుకు సారధి అవ్వమని సరైన పధము లో నడపమని, ఆ గీతా చార్యుడు, గోవర్ధన గిరి ధారి, రాధా మనోహరుడు, గోవిందుడు, నంద నందనుడు, ఆపద్భాంధవుడు అయిన ఆ గోపాల క్రుష్ణుని ఆ మురారిని ఆ వెన్న దొంగను, మనందరి తరపున మేము అర్ధిస్తున్నాము.

Whether it is marriage, disease, pain or joy, for all these Karta karma kriya is ourselves. So we should face their results also in this or next birth, so always we have to be away from world illusion, so praying for all of us to Lord Gopala Krishna, who is Gitacharya Govardhana Giridhaari Radhaa Manohar Govinda Nanda Nandana Aapadbhandhava, to give strength to us and protect us like arjuna by controlling our mind in right direction.

7. గురువులూ మీ రంతా చల్ల గా ఉండాలి, అందులో మేమూ ఉండాలి. సర్వే జనా సుఖినోభవంతు. ఓం శాంతి.

Gurus, you all should be good and well, we should be part of that good/ well. Sarve janaa sukhinoabhavantu. Om Shanti.

8. హరే క్రిష్ణ హరే క్రిష్ణ క్రిష్ణ క్రిష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే

Hare KrishNa Hare KrishNa KrishNa KrishNa Hare Hare
Hare Rama Hare Rama Rama Rama Hare Hare

9. ఆది దేవుడు ఒకడే మరువద్దు, అతనిని ముందు మన మనసు లోనే పట్టుకోవాలి కఠోర సాధనతో, తర్వాత ప్రపంచమంతా ప్రతి విషయములో అతనిని చూడగలము.

Remember only one supreme lord, try to find him in us (mind) first and then we will see him in the entire world in everything.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1793 General Articles and views 1,383,643; 93 తత్వాలు (Tatvaalu) and views 184,040
Dt : 03-Nov-2021, Upd Dt : 03-Nov-2021, Category : General
Views : 638 ( + More Social Media views ), Id : 1269 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : diwali , ghee , lamps , fireworks , darkness , health , praying , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content