మీకే లాభం, మనశ్శాంతి, ముదుసలి తనములో పిల్లలతో దేవత లా ఆరాధన, వెన్నుపోటు చివరి దశలో? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,835; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Profit for yourself, peace of mind, worship like a goddess with children in old age, no backstab, at life end?

20 ఏళ్ళు పైగా ఎంతోమంది కి ముందు జాగ్రత్తలు చెప్పినాం, వారి మానసిక శారీరక పరిస్థితి బట్టి, నవ్వుతూ లెక్క లేకుండా వదిలేశారు, అబ్బో ఇవన్నీ ఎవరు చేస్తారు లే, చాదస్తం, కష్టం నష్టం మనకు అనవసరం అని. ధనం తో ఏదైనా పూజ పునస్కారం యాత్ర యాగం దానం ఓకే, కానీ మనసుతో శరీరంతో సాధన నా మానసిక నియంత్రణ నా, అబ్బా ఆశ దోశ అప్పడము, మా వంశలో లాంటి అలవాటు లేదు అన్నారు.

తర్వాత, మనశ్శాంతి బంధం దైవం ఆత్మ వారిని వదిలేసింది. ఇంకా ముందు ముందు ఘోరం, కష్టాలు, నష్టాలు, భాగస్వామి పిల్లలు కోడలు అల్లుడు స్నేహితులు బంధువు ప్రక్రుతి రూపంలో, వెంటపడి తిట్టి కొట్టి నేర్పుతారు, మనలాగా దూరంగా ఉండి మెత్తటి మాటలు ఉండవు. బాబాయి, మామయ్య, వెన్నుపోటు చూసాము కదా? పెళ్ళై 1-20 ఏళ్ళ తర్వాత కూడా విడాకులు వింటున్నాము పేపర్లలో. వీరితో మేము వేగలేము, రోగాల బారి పడి అశక్తులు అయ్యారు, మేము కంచి గరుడ సేవ చేయలేము అని శోకాలు పెడుతున్నారు.

మనం చెప్పినవి చాలా తేలిక ఆ కష్టాల కన్నా, అయినా కష్టం అన్నారు ప్రాపంచిక మాయ అహంకారం నిర్లక్ష్యం బద్దకం లో, మరి సొంత వారి సూటిపోటీ మాటలు, వెన్నుపోటు ఎంత బాధ అవమానం? ఒకసారి పంచభూత శిక్షణ మొదలు అయినాక ఏం చేయలేం, ఆపలేం మిత్రమా. ముందు ఆపగలం, లేటు చేయగలం, అదే 20 ఏళ్లుగా మన నిస్వార్ధ ప్రచారం, ఇతర దైవ సంతానం క్షేమం కోసం. ఇదీ మానసిక శారీరక దైవ పూజనే.

ఇందులో మన స్వార్థం కూడా ఉంది, మనకు తెలిసిన లేదా మన తో ఉన్నది ఉన్నట్లుగా బాధలు పంచుకున్న వీరంతా, పచ్చగా సంతోషముగా ఉంటే, మనల్ని ఎటూ ఆదుకుంటారు కదా.

మొన్న 3 ఏళ్ళు పైన ఆదాయం లేకపోతే, తమంతట తాము వచ్చి చేయి అడ్డుపెట్టారు, తమ సొంత తల్లి లాంటి ఇంకో ముదుసలి తల్లి సేవకు భంగం కలగరాదని వారు భావించారు, మనం చేయలేక పోయినా చేసేవారికి అండగా ఉండాలి అన్న వారి ఆలోచన ప్రయత్నం తో, కొండంత పుణ్యం వారి రాబోయే కష్టాలు కు అడ్డువేసుకున్నారు.

ఎన్ని కష్టాలు లో అయినా, సమాజ శ్రేయస్సు, మానసిక నియంత్రణ, నీతి నిజాయితీ, త్యాగం, ఓర్పు, సహనం, గురుసేవ, దైవ గుణగణాలు ను ఆచరణలో చూపేవారు సత్ బ్రాహ్మణులు మరువద్దు, కులం పుట్టుక వృత్తి వేషం ప్రదేశం ని బట్టి కాదు. వేదం మరియు గీత చెప్పింది అదే.

ఒకరికి చెప్పినది ఇది -

7 సార్లు 108 ప్రదక్షిణలు 2016 (7 ఏళ్ళకు) నుంచి తప్పు లకు, రామకోటి, మానసిక నియంత్రణ, వాక్సుద్ది చిత్తశుద్ధి రాత మాట పాట లో, ఉదయం 5 కు లెగవడం, నీతి నియమాలు నిజాయితీ, ఓర్పు సహనం త్యాగం సేవ, కపటం నాటకం చాటు 2 నాల్కలు ఆపాలి - వీటితో శని రాహు కేతు ప్రభావం తగ్గడం.

వారి జవాబు - ఇవన్నీ కష్టం మాకు అవసరం లేదు అన్నారు. అవి చేసిన దాకా, మనం మాట్లాడం కనపడం ఫోన్ చేయం అని కుటుంబం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు.

మన జవాబు - అలాగే మరి మీరు మొదలు పెట్టిన తర్వాత, అవి కొనసాగుతున్న, అప్పుడే మనం మాట్లాడుకోవచ్చు కదా, తొందరలేదు, కానీ పంచభూతాల శిక్షణ కు ముందే, ఆ తర్వాత ఇంక అవసరము లేదు అని మన జవాబు.

ఆ పైవి మీరు చేస్తున్న, మాకు రూపాయి లాభం ఉందా? మీకే లాభం, మనశ్శాంతి, ముదుసలి తనములో పిల్లలతో దేవత లా ఆరాధన, వెన్నుపోటు ఉండదు, జీవితం చివరి దశలో రామన్న, రాజన్న, జయలలితమ్మ‌, సావిత్రమ్మ‌, కోడెలయ్య, మోసపోయిన ముదుసలి తల్లి తండ్రులు అత్తమామలు దుస్థితి మనకు ఉండదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,835; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 06-Aug-2023, Upd Dt : 06-Aug-2023, Category : General
Views : 227 ( + More Social Media views ), Id : 1864 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : profit , yourself , peace , mind , worship , goddess , children , old , age , backstab
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content