పాటతో పరమార్ధం - కిన్నెరసాని వచ్చిందమ్మా - సితార - సుమన్, భానుప్రియ, శరత్ బాబు, వంశీ, ఇళయరాజా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,420; 104 తత్వాలు (Tatvaalu) and views 245,418.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Kinnerasaani Vachindammaa - Sitaara - Suman, Bhanupriya, Sarath Babu, Vamsy, Ilayaraja

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

కవి మరియు గేయ రచయిత, తమ మనసుకు మెదడుకు పని చెపితే, ఎంత అందముగా ఆహ్లాదకరముగా, భగవంతుడు ఇచ్చిన సహజ ప్రక్రుతి సౌందర్యాలను, వర్ణిస్తారో ఈ పాట చూస్తే మనకు తెలుస్తుంది. అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడాలని అనుకునే రజో తమో గుణ దాసులకే ఇవి అర్ధం అవుతాయి. సత్వ గుణ వెన్న మనసుకు ఇవి ఎంతో రంజింప చేస్తాయి, మనశ్శాంతిని ఇస్తాయి ఎటూ.

ఇది ప్రియురాలి మీద పాడిన పాటలాగే ఉంటుంది, కాని కిన్నెరసాని అనే నది గురించి అని మనము తెలుసుకోవాలి. సాత్వికులకు మాత్రమే, ఆ వింత అనుభుతి, మనసును హత్తుకుంటుంది. నది నడకలు మెలికలు తిరుగుతూ గోదావరిలో కలవడం, అన్ని ఊళ్ళలు ఇళ్ళను దాటి, ఎంత బాగా వివరించారో చూడండి.

కిన్నెరసాని, గోదావరి నది యొక్క ఉపనది. కిన్నెరసాని ములుగు జిల్లాలోని మేడారం - తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి, ఆగ్నేయంగా ప్రవహించి, భద్రాద్రి జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరు గ్రామాల మధ్యన, గోదావరిలో కలుస్తుంది. 96 కిలోమీటర్లు ప్రవహిస్తున్న, ఈ నది యొక్క ఆయకట్టు ప్రాంతం, మొత్తం 1300 చదరపు కిలోమీటర్లు. కిన్నెరసాని ఉపనదైన మొర్రేడు, కొత్తగూడెం పట్టణం గుండా ప్రవహించి సంగం గ్రామం వద్ద కిన్నెరసానిలో కలుస్తుంది.

చూడండి, కిన్నెరసాని నది వచ్చిందమ్మా, పొర్ణమి చందుని వెలుగుల వెన్నెల పైటేసి. అది తీయటి విశ్వనాధ పలుకై, అది విరుల తేనె చినుకై ఉంది. అది ఇంకా గాన కోకిల కూనలమ్మ కులుకై సవ్వడి చేస్తూ, అది కూచిపూడి నడకై గల గలా మెలికలు తిరుగుతూ సాగుతూ ఉంది. పచ్చని చేలా పావడగట్టి అంటే పచ్చని చేలను తరింప చేస్తూ, కొండ మల్లెలే కొప్పునబెట్టీ అంటే కొండలు కోనలు దాటుతూ, వచ్చే ఈ నదీమ తల్లి మన దొరసాని, మా వన్నెల కిన్నెరసాని! ఎంత బాగా రాశారు.

ఎండలకన్నే సోకని రాణి అంటూ చమత్కరిస్తూ, పల్లెకు రాణి పల్లవపాణి, ఆ కోటను విడిచీ, ఈ పేటను విడిచీ, మన తీయటి కలలా ఆ గంగా పొంగే వేళా, జీవ నదిలా తనకు తానే సాగే వేళ, ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే, మా కిన్నెరసాని వచ్చిందమ్మా, వెన్నెల పైటేసి అంటూ ఆనందముగా మీరూ పాడతారా మరి.

కిన్నెరసాని దొరసానికి, మన తెలంగాణా ఆంధ్రా మాగాణమ్మా చీరలు నేసే, ఆ ఆకాశపు మలిసందెమ్మ కుంకు మపూసే, ఆ గాల గల పరుగులతో పరవళ్ళతో, మువ్వులబొమ్మా మన ముద్దులగుమ్మా, మన ప్రాంతపు గడప దాటి నడిచే వేళ, అదుపే విడిచీ అలలతో ఎగిరే వేళ, ఆ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే, ఎంత మనోహరముగా ఉంటుంది. దయచేసి మీరూ ఈ పాట పాడి వినిపించరూ, మీ సాత్విక గొంతుతో ఆరోగ్యం కోసం?

+ + +

తననననన తననననన తననననన తననననన
తననననన తననననన తననననన తననననన
చమకు చమకు జింజిన జింజిన
చమకు చమకు జిన్న జిన్న జిన్న
కిన్నెరసాని వచ్చిందమ్మా, వెన్నెల పైటేసి
జమకు జమకు జింజిన జింజిన
జమకు జమకు జిన్న జిన్న జిన్న

కిన్నెరసాని వచ్చిందమ్మా, వెన్నెల పైటేసి
విశ్వనాధ పలుకై, అది విరుల తేనె చినుకై
కూనలమ్మ కులుకై, అది కూచిపూడి నడకై
పచ్చని చేలా తనననన, పావడగట్టి తనననన
పచ్చని చేలా పావడగట్టి, కొండమల్లెలే కొప్పునబెట్టీ 2
వచ్చే దొరసాని, మా వన్నెల కిన్నెరసాని!! ||కిన్నెరసాని వచ్చిందమ్మా||

ఎండలకన్నే సో.కని రాణి, పల్లెకు రా.ణి పల్లవపాణి
కోటను విడిచీ.. పేటను విడిచీ.. 2
కలలా. గంగా పొంగే వేళా, నదిలా. తానే సాగే వేళ
ఆ రాగాల రాదారి పూదారి ఔతుంటే!! 2 ||కిన్నెరసాని వచ్చిందమ్మా||

మాగాణమ్మా చీరలు నేసే, మలిసందెమ్మ కుంకుమపూసే
మువ్వులబొమ్మా.. ముద్దులగుమ్మా.. 2
గడప. దాటి నడిచే వేళ, అదుపే. విడిచీ ఎగిరే వేళ
వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే...
ఈ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే..!! ||కిన్నెరసాని వచ్చిందమ్మా||

Movie: Sitara (1984); Music: Ilaiyaraaja; Lyrics: Satyanarayana  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,420; 104 తత్వాలు (Tatvaalu) and views 245,418
Dt : 26-Jul-2024, Upd Dt : 26-Jul-2024, Category : Songs
Views : 35 ( + More Social Media views ), Id : 2150 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Sitaara , Sitara , Suman , Bhanupriya , Sarath Babu , Vamsy , Ilayaraja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content