పాటతో పరమార్ధం - ముకుంద ముకుందా కృష్ణ - దశావతారం - కమల్ హాసన్, అసీన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2140 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2175 General Articles and views 2,221,399; 104 తత్వాలు (Tatvaalu) and views 245,415.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Mukundha Mukundha Krishna - Dasavatharam - Kamal Haasan, Aseen

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు). అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వానిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు.

పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి: మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము లేదా నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, బలరామావతారము, కల్క్యావతారము.

నిజ భక్తులను అడగండి, దశావతారములు ఎన్ని ఏవి అని, ముక్కున పెట్టుకున్నా నాలిక పై ఉన్న వాటిని, ఠక్కున గబ గబా చెప్పేస్తారు. మరి వారి చేసిన మంచిపనులు, ధర్మాన్ని రక్షించడం వంటి సుగుణాలు హ్రుదయం, నీతి నియమాలు ధర్మ జాలి దయ కర్తవ్యం, మనలో ఉన్నాయా ఆచరణలో, ఒక లిస్ట్ రాయండి అని అడగండి.

ఇంక నోట్లో నుంచి మాట రాదు, ఏదో కొబ్బరికాయ కొట్టి, 4 మంత్రాలు చదివి, ప్రసాదం పంచు, దానం ఇవ్వు అంటే ఇస్తాము గానీ, దైవ గుణాలు ఆచరణలో చూపటం, మా వంశం లోనే లేదు అని మనల్నే తూలనాడతారు. అంటే, చిత్తశుద్ది లేని వారు ఈ నిజ భక్తులు అని మనకు క్లారిటీ.

బాబాయి భక్తులు, అలాగే కపట నటన 2 నాల్కల ధోరణి, అలాగే నక్క పాము పులి గుణాలకు అండగా ఉండే వారిని నిజ భక్తులు అని వెటకారముగా పిలుస్తారు. వారి మాటలకు చేతలకు పొంతన కుదరదు. వారి పిల్లలు కూడా, వీరిని ఇంట్లో ఉంచుకోవడానికి ముదుసలి తనములో, ఇష్టపడరు, తమ కాపురాలు కూలుస్తారు అని లేదా తమ ఆనందాలకు అడ్డు అని లేదా వీరి మొఖానికి సేవ చెయ్యాలా అని కావొచ్చు.

ఓ నారాయణా ముకుంద ముకుందా, ఓ రామ కృష్ణ, ముకుంద ముకుందా, మా అందరి స్వరంలో తరంగానివి మీరే, ఆ బృందావనంలో వరంగ పొందాము మిమ్ము. వెన్న దొంగ వైనా, మన్ను తింటివా? మా సత్వ గుండె ప్రేమ లయల భక్తుల, మృదంగనివా? ఈ ప్రపంచ జీవకోటి మీ చేతి తోలు బొమ్మలే, మిమ్ము తలచి ఆట లాడే కీలు బొమ్మలే.

అహంకార మదముతో, పడగ విప్పి మడుగున లేచే, ఆ కాలకూట సర్ప శేషమే ఎక్కి, ప్రజలకోసం నాట్య మాడి కాళీయుని, దర్పమనిచాడు. మీ ధ్యానం చేయు వేళ, మాకు వచ్చేది విజ్ఞాన మేగ, మా అజ్ఞానం రూపు మాపేది, గీత లో చెప్పిన కృష్ణ తత్వమేగా. భారత యుద్దములో, అట అర్జును డొందేను, మీ దయ వల్ల, గీతోపదేశం. అంతే గాక అది ఈ జగతికి సైతం, ప్రాణం పొసే మంత్రోపదేశం. వేదాల సారమంతా వాసు దేవుడే భగవద్గీత గా ఇచ్చెను, రేపల్లె కు రాగం తాళం యోగం, ఆ రాజీవుడే.

మత్స్యమల్లె నీటిని తేలి వేదములను కాపాడినావు. కూర్మ రూప దారివి నీవై భువిని మోసినావు. వామనుడై పాదమునెత్తి, ఆ నింగి ని కూడా కొలిచి నావే. నరసింహుని అంశే నీవై, ఆ రాక్షసుడు హిరణ్యుని చీల్చావు. కామం తో మదమెక్కిన రాక్షస రావణుని తలలను కూల్చి, సీతా రాముడివై నిలిచావు. కృష్ణు డల్లే వేణువూది, ప్రపంచానికి ప్రేమను ఆత్మ జ్ఞానాన్ని పంచావు.

ఇక మీ అవతారాలెన్నున్న, ఆధారం మేమే. మీ ఒరవడి పట్టా, ముడి పడి ఉంటా, ఏదేమైనా మేమే. మదిలోని ప్రేమ మీదే మాధవుడా, మందార/మానవ పువ్వే మేము దయచూపరా.

+ + +

ముకుంద ముకుందా, కృష్ణ, ముకుంద ముకుంద
స్వరంలో తరంగ, బృంద, వనంలో వరంగ - 2 సార్లు మొత్తం

వెన్న దొంగ వై.న, మన్ను తింటివా.
కన్నె/సత్వ గుండె ప్రేమ లయల, మృదంగనివా ||ముకుంద ముకుందా||

జీవకోటి నీ. చేతి, తోలు బొమ్మలే
నిన్ను తలచి, ఆట లాడే, కీలు బొమ్మలే ||ముకుంద ముకుందా||

జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్, జై జై రామ్
సీత రామ్ జై జై రామ్ జై జై రామ్

నీ.లాల నింగి కింద, తెలియాడు భూ.మి
తన లోనే చూపించాడు, ఈ కృష్ణ స్వా.మి

పడగ విప్పి మడుగున లేచే, సర్ప శేషమే ఎక్కి
నాట్య మాడి కాళీయుని, దర్పమనిచాడు
నీ ధ్యానం చేయు వేళ, విజ్ఞాన మేగ
అజ్ఞానం రూపు మాపే, కృష్ణ తత్వమేగా

అట అర్జును డొందేను, నీ దయ వల్ల, గీతో.పదేశం
జగతికి సైతం, ప్రాణం పొసే, మంత్రో.పదేశం

వేదాల సారమంతా వాసు దేవుడే., రేపల్లె రాగం తాళం రాజీవుడే. ||ముకుంద ముకుందా||

మత్స్యమల్లె నీటిని తేలి., వేదములను కా.చి
కూర్మ రూప దారివి నీవై, భువిని మోసినా.వె

వామనుడై పాదమునెత్తి, నింగి కొలిచి నావే.
నరసింహుని అంశే నీవై, హిరణ్యుని చీల్చా.వు
రావణుని తలలను కూల్చి, రాముడివై నిలిచా.వు
కృష్ణు డల్లే వేణువూది, ప్రే.మను పంచా.వు

ఇక నీ అవతారా, లెన్నున్న, ఆధా.రం నే.నే
నీ ఒరవడి పట్టా, ముడి పడి ఉంటా, ఏదేమైనా నే.నే

మదిలోని ప్రేమ నీదే మా.ధవుడా, మందార/మానవ పువ్వే నేను మనువాడర/దయచూపరా

||ముకుంద ముకుందా||||ముకుంద ముకుందా||

Movie: Dasavatharam; Cast: Aseen,Kamal Haasan; Music Director: Himesh Reshammiya; Song: Mukunda Mukunda; Lyricist: Veturi Sundararama Murthy; Singers: Sadhana Sargam  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2175 General Articles and views 2,221,399; 104 తత్వాలు (Tatvaalu) and views 245,415
Dt : 19-Jul-2024, Upd Dt : 19-Jul-2024, Category : Songs
Views : 67 ( + More Social Media views ), Id : 2146 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Mukundha Mukundha , Dasavatharam , Kamal Haasan , Aseen
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content