స్నేహితుల దినోత్సవం - స్నేహమే జీవితం, ఆ నాటి స్నేహమానందగీతం, స్నేహానికన్న మిన్న - శ్రీక్రుష్ణ, కుచేల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,980; 104 తత్వాలు (Tatvaalu) and views 226,217.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*స్నేహితుల దినోత్సవం - స్నేహమే నా జీవితం, ఆ నాటి ఆ స్నేహమానందగీతం, స్నేహానికన్న మిన్న - శ్రీక్రుష్ణుడు, కుచేలుడు*

*Friendship Day - Snehame na jivitam, a nati a Sneahamanandagitam, Snehanikanna minna - Sri Krishna, Kuchela*

దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తథా
యత్ర ద్రవత్యంతరంగం స స్నేహః ఇది కథ్యతే

ఎవరినైతే చూసినప్పుడు గాని, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో ద్రవిస్తుందో దానిని స్నేహం అని అంటారు.

Hope you will have, same songs in your language. Most movies are dubbed. Try them.

స్నేహితుల దినోత్సవం రోజైనా, దేవుడిచ్చిన నోరు వాడి, ఈరోజైనా ఈవారమైనా, గొంతు మెస్సేజ్ అంటే సందేశము కనీసము పంపగలరు లేదా ఫోన్, మీకు నమ్మకమైన స్నేహితులు ఉంటే నే సుమా. నేడు ఎంత బద్దకము వచ్చింది అంటే, అలా ఓ టెక్స్ట్ సందేశం చాలులే అన్న స్తితికి వచ్చాము. అవసరం ఉన్నవారితో ఎటూ నటించడానికి అయినా మాట్లాడతాము.

On Friendship Day, God given voice messages can at least be texted or phoned, only if you have trusted friends.

మనము కర్మ ఖర్మ కాలి పోతే, మన పిల్లలకు ఒక దోవ చూపే మార్గదర్శి నమ్మకమైన వాడు, మాట తప్పని వాడు, అరిషడ్వర్గాలకు లొంగని వాడు, ఒకరు మనకు ఉండాలి సుమా. రేపు మనది కాదు అని స్తితప్రజ్ఞునికి తెలుసు.

If we gone by karma or kharma, we should have someone who is faithful, who does not make a mistake, who does not do slavery of Arishadvarg, who will show us a guide and also for our children. A wise man knows that, tomorrow is not ours.

గత 5 ఏళ్ళు పైన, మన సందేశాలు అందుకునే వారిలో, 1 వ తరగతి నుంచి, పీజీ దాకా, అలాగే చిన్న బడ్డీ కొట్టు నుంచి మంత్రి నాయకులు మిలియనీరు కలెక్టర్ దాకా ఉన్నారు. అందరికీ ఒకటే గౌరవం, ఒకటే చీవాట్లు. ఏదీ మారదు, ఈ కట్టె కాలిందాకా.

Over the past 5 years, our message recipients have ranged from 1st class to PG, from small buddy shop to ministerial leaders millionaire collectors. Everyone has the same respect and the same scolding. Nothing will change, until we go to sky.

అవసర అవకాశ వాదులతో, నిజం నిర్భయముగా చెప్పలేని వారితో, జీవితములో నటించే వారితో, జాగ్రత్తలు సుమా, వారి లక్షణాలు దాచలేరు, మనము అరిషడ్వర్గాల బానిసలము కాకపోతే స్పష్టముగా అది అర్ధము అవుతుంది. ఉన్నవారితో ఒకరకముగా, లేని వారితో ఇంకోరకముగా ప్రవర్తిస్తారు. నటించేవారు, రేపు మనం పతనం అయితే కూడా, ఇలాగే నటిస్తారు.

With the needy opportunists, those who can't tell the truth fearlessly, those who act in life, no matter how careful, their characteristics cannot be hidden, it would clearly understand if we were not slaves to the Arishadvarg. That folks will treat one way to rich and other way to poor. Actors, even if we fall tomorrow, act like this.

మల్లెపువ్వు, సాంబ్రాణీ వాసన, పరిస్థితి మనుషులను బట్టి నటించదు. స్తితప్రజ్ఞుడు, అందరితో ఒకే విధముగా ఉంటాడు. వారిని విడువకూడదు, విడిస్తే, దేవునికి దూరముగా వెళ్ళినట్లే. అందుకే మంచి వారి, స్నేహాన్ని మనము ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పదవులు ఐశ్వర్యం పొందినా, విడువకూడదు.

The smell of Jasmine, Sambrani, will not change based on situation or according to people. A wise man is the same with all. Do not let them go, if you let go, it is like going away from God. That's why we should not let go of the friendship of good people, no matter how high we rise, no matter how many positions assets we get.

మనకు పెద్దవారు చిన్నవారు అందరూ జవాబు ఇచ్చారు, అది వారి కుటుంబ సంస్కారం. ఆత్మను ఆత్మగా చూస్తారు, పరమాత్మతో కలవాలి అనుకుంటే. లేదంటే తేడాలు చూపి, పతనం అవుతారు.

Everyone, poor and rich, gave us the answer. that it was their family good culture. They see the soul as a soul, if they want to meet with the supreme soul. Otherwise they show differences and fall down.

శ్రీ క్రిష్ణుడు, ఇంటికి వచ్చిన నిరుపేద కుచేలుని, సిమ్హాసనం లో కూర్చో బెట్టి, కాళ్ళు కడిగి, భార్య మరియు సేవకుల చేత కూడా నమస్కారం/ సేవలు చేపించారు. కావలసిన సహాయం మొత్తము అడగకుండానే, చేసేసారు ఇచ్చేసారు.

Poor Kuchela came home for help. Shri Krishna, made him to sit on the throne, washed his feet, and worshiped and served and also by his wife and servants as well. All the help needed was given without asking.

lol, it is taking time to convert, I am stopping here, still more paras. some mistakes will be there, hope you can understand. Google translation will not do best for conversion.

ఆ దేవ దేవుడు చేసిన పనికి, అందరూ ఆశ్చర్యపోయారు. అందుకే మనము మంచి వారిని అనుసరించాలి. అదే వేదం, వారి మాటే మనకు మంచి బాట. అప్పుడు మనము ఇతర బాధల గురించి ఆలోచన అవసరము లేదు. ఆ మంచి పనులే, మనల్ని కాపాడుతాయి. మంచి వారు మనల్ని ఒక మంచి పని లేదా సహాయం అడిగారు అంటే, అది దేవునికి నైవేద్యం, రేపు నీకు రాబోయే కష్టాలకు అది అడ్డుకట్ట.

దుర్మార్గులైనా కూడా, దుర్యోధనుడు కర్ణుడు కూడా, చెడులో, ఉత్తమ స్నేహానికి ఉదాహరణలు. సగం సిమ్హాసనము ఇచ్చి గౌరవించాడు, ఎందుకంటే తన అవసరం, అర్జుని ఓడించడానికి కర్ణుడు విద్య గుణము కావాలి. ఇది అవసర అవకాశ స్నేహం, ధర్మానికి వ్యతిరేకము గా. ఇలాంటిది మనకు వద్దు. ఈ దోవ ఎంచుకుంటే, పతనము తప్పదు ఇద్దరుకి.

మన చుట్టూ 80 శాతం అవసర అవకాశ స్నేహం ఇలాంటి వారే, వడ్డీ (/ అవసరం/ అవకాశం) వస్తుంది అంటే చాలు, ఆ వడ్డీ ఇచ్చేవాడు నాశనమైనా కూడా, నిజాలు మంచి చెప్పరు. తమ ఆదాయం పోకూడదు అని. వారు ఎన్ని పూజలు చేసినా ధ్యానాలు చేసినా, నిష్ప్రయోజనం. ఆ తప్పు ఫలితము ఆ ధనం వాడిన కపట ఫలితం, వారి పిల్లల సంస్కారం పై పడుతుంది, వారి భవిష్యత్తు కన్నీళ్ళకు దారితీస్తుంది.

ఈ రోజైనా మనస్పూర్తిగా హ్రుదయపూర్వకముగా, మంచి కోసం కనీసం నటించండి. ఆ మంచి నటన అలవాటు అయితే, అదే మనసులో నాటుకుని పోతుంది.

ఈ పాటలలో మీకు నచ్చిన ఒక్క పాటను, మీ గొంతుతో ప్రయత్నం చేయండి, మన స్నేహితుని దగ్గర, మనకు సిగ్గు అవమానము ఏముంది, రాగం తానం పల్లవి తో అవసరము ఏముంది, కేవలము మానసిక ప్రయత్నమే, అదే దేవుడి మెచ్చేది. చేస్తారు కదూ, మీ పిల్లలతో కూడా చేపిస్తారు కదూ. లేకపోతే, ముసలితనములో మనకు ఫోన్ చేసి కూడా మాట్లాడలేని దిక్కుమాలిన పరిస్థితి మనమే కల్పించుకుంటున్నాము.

1) ఆ .. ఆ .. ఆ .. ఆ .. దేవుడే దిగివచ్చి ...
దేవుడే దిగివచ్చి... బిడ్డా ఏమి కావాలంటే
మిద్దెలొద్దు.. మేడలొద్దూ.. పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు.. లేనినాడు.. ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను.. ఒక్క నేస్తం కావాలంటాను

స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. 2
స్నేహమేరా నాకున్నదీ.. స్నేహమేరా పెన్నిధీ..
స్నేహమే . . హొయ్ ||స్నేహమే నా||

గుండెనే పలికించితే.. 2
కోటి పాటలు పలుకుతాయ్
మమత నే పండించితే
మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ..2
లేదు అంతకు మించి హాయ్
స్నేహమే . . హొయ్ ! ||స్నేహమే నా||

కత్తిలా పదునైన చురుకైన మా వాడు, మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు 2
ఏమిటొ నీ బాధా ఆఆఅ...
ఏమిటొ నీ బాధా నాకైన చెప్పు భాయ్
ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి 2

నిండుగ నువ్వు నేడు నవ్వాలి , అందుకు నెనేమి ఇవ్వాలి.. 2
చుక్కలను కోసుకొని తెమ్మంటావా..
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా....దింపమంటావా ఆ చంద్రుణ్ణి .. హా..
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ..
ఏమి చెయ్యాలన్న చేస్తాను.. కోరితే ప్రాణమైన ఇస్తాను . .
హ ఏమి చెయ్యాలన్న చేస్తాను.. కోరితే ప్రాణమైన ఇస్తాను

దోస్తీకి నజరానా.. దోస్తీకి నజరానా..చిరునవ్వురా నాన్నా..
దొస్తీకి నజరానా.. చిరునవ్వురా నాన్నా. .
ఒక్క నవ్వే చాలు ఒద్దులే వరహాలు.. హ హ హ హ

నవ్వెరా.. నవ్వెరా.. మావాడు.. ఆహా నవ్వెరా నిండుగా
నవ్వెరా.. మావాడు.. ఆహా నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు.. దీపావళి పండుగా ||స్నేహమే నా||

చిత్రం : నిప్పులాంటి మనిషి (1974), సంగీతం : సత్యం, సాహిత్యం : సి.నారాయణ రెడ్డి, గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
తారాగణం నందమూరి తారక రామారావు, లత, కైకాల సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి
Snehamera Saswatham Song Lyrics in Telugu - Nippulaanti Manishi (1974) NTR

2) ఆ నాటి ఆ స్నేహమానందగీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు మున్ముందిక రావేమిరా
హహ లేదురా... ఆ సుఖం
రాదురా ఆ గతం... ఏమిటో జీవితం

ఒరెయ్ ఫూల్! గుర్తుందిరా

గోడలు దూకిన రోజులు...మోకాలికి తగిలిన దెబ్బలు
చీకట్లో పిల్లనుకుని...ఒరెయ్ ఒరెయ్ ఒరెయ్ ఇడియట్

పక్కనే పెళ్ళికావల్సిన పిల్లలున్నార్రా
నేర్చుకుంటార్రా... (హహహ)

నేనూ మారలేదు... నువ్వూ మారలేదు
కాలం మారిపోతే... నేరం మనదేమికాదు
ఈ నేల ఆ నింగి ఆలాగే ఉన్నా
ఈ గాలిమోస్తుంది మనగాథలెన్నో
నెమరేసుకుందాము... ఆ రోజులు
భ్రమలాగ ఉంటాయి... ఆ లీలలు
ఆ మనసులు ఆ మమతలు ఏమాయెరా

ఒరెయ్ రాస్కెల్! జ్ఞాపకముందిరా

కాలేజిలో... క్లాసురూములో
ఓ పాపమీద (పరీక్షల్లో)..నువ్వు పేపరుబాల్ (కాపీ) కొడితే
ఆ పాప ఎడమకాలి చెప్పుతో..(మాష్టారు బెత్తంతో)
ఒరెయ్ ఒరెయ్ ..ఒరెయ్ స్క్రౌండ్రల్

ఊరుకోరా పిల్లలు వింటారు, వింటే వింటార్రా...
పిల్లల పిల్లలకు పిట్టకథగా చెప్పుకుంటారు అంతే హహహహ..

ఆ నాటి ఆ స్నేహమానందగీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం
ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు మున్ముందిక రావేమిరా

మనసే ఇచ్చినాను... మరణం తెచ్చినాను
చితిలో చూసినాను... చిచ్చై మండినాను
నా గుండె మంటింక... ఆరేదికాదు
నేనుండి తనువెళ్ళి... బ్రతుకింకలేదు
తన శాపమే నాకు... తగిలిందిరా రేయ్
పసిపాపలే లేని... ఇల్లాయెరా
ఈ కన్నుల కన్నీటికి... తుదియేదిరా

ఒరెయ్ ఒరెయ్ ఏమిట్రా పసిపిల్లాడిలా, ఛి ఛీ.. ఊర్కో
ఒరెయ్ ఈ కన్నీళ్ళకు తుదియెక్కడరా
కర్చీఫ్‌తో తుడిచెయ్యడమేరా, హహ హహాహ..

ఆ నాటి ఆ స్నేహమానందగీతం
ఆ జ్ఞాపకాలన్నీ మధురాతిమధురం హహ..
కరెక్ట్ రా హహహాహహ
లాలాలలాలా లాలాలలాలా
Aanati Aa Sneham - Anubandham SPB
చిత్రం : అనుబంధం (1984), సంగీతం : చక్రవర్తి, గీతరచయిత : ఆచార్య ఆత్రేయ, నేపధ్య గానం : బాలు, Akkineani, ANR, Prabhakar reddi

3) స్నేహానికన్న మిన్న | లోకాన లేదురా 2
కడ దాక నీడ లాగ | నిను వీడి పోదురా
నీ గుండెలో పూచేటిది | నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా ... ||స్నేహానికన్న||

తులతూగే సంపదలున్నా | స్నేహానికి సరిరావన్నా... ఓ ...
పలుకాడే బంధువులున్నా | నేస్తానికి సరికారన్నా
మాయ. మర్మం. తెలియని చెలిమే | ఎన్నడు. తరగని. పెన్నిధిరా
ఆ స్నేహమే.. నీ ఆస్తి రా.. | నీ గౌరవం నిలిపేనురా..
సందేహమే లేదురా...||స్నేహానికన్న||

త్యాగానికి అర్ధం స్నేహం | లోభానికి లొంగదు నేస్తం... ఓ ...
ప్రాణానికి ప్రాణం స్నేహం | రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది | నిర్మలమైనది స్నేహమురా
ధ్రువతారలా స్థిరమైనది | ఈ జగతిలో విలువైనది
ఈ స్నేహమొకటేనురా .. ||స్నేహానికన్న||.

1988 Telugu Movie Song Lyrics, Bhuvana Chandra, Krishnam raju, Prana snehithulu
కృష్ణం రాజు, ప్రాణ స్నేహితులు

మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి. పూర్తి పాటలు మాటలు వీడియోలు లింక్ లోపల చూడగలరు.

Friendship day snehame na jivitam a naTi a sneahamanandagitam snehanikanna minna srikrishna kucheludu  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,980; 104 తత్వాలు (Tatvaalu) and views 226,217
Dt : 07-Aug-2022, Upd Dt : 07-Aug-2022, Category : Songs
Views : 1171 ( + More Social Media views ), Id : 1487 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : friendship , day , snehame , jivitam , sneahamanandagitam , snehanikanna , srikrishna , kucheludu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content