ఇంటి, ఒంటి ద్వందార్ధాల అశ్లీల న్రుత్యాల మరియు ప్రాంక్ వీడియోలు, విలువలు పతనం - ఎవరిది తప్పు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1631 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1666 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ఇంటి, ఒంటి మరియు ద్వందార్ధాల అనవసర అశ్లీల న్రుత్యాల మరియు ప్రాంక్ వీడియోలు తో, కుటుంబం విలువలు రోజు రోజుకు పతనం చేస్తున్నారు. వాటిని చేసే వారిది తప్పా? లేక వాటిని ప్రోత్సహిస్తూ చూసే వారిది తప్పా?*

ఇంటర్నెట్ చేతిలోకి వచ్చాక, మన పిల్లలు ఇంటెర్నెట్ లో ఏ వెబ్సైట్ లు మరియు వీడియోలు చూస్తున్నారో? చూసాక డిలీట్ చేస్తున్నారో? మనము పట్టించుకుంటున్నామా?

పిల్లలు హాస్టల్ లో లేదా దూరముగా ఇంకో ఊళ్ళో, పెద్దలు దొంగ వ్యాపారం లో, లేదా దోచుకునే రాజకీయం లో లేదా ఇంకో వ్యాపారాల మోహములో, ఇంటి మహిళలు సీరియల్స్ బిగ్ బాస్ ల లో? ఎవరికి తీరిక ఉంది, తమ పిల్లల మానసిక పరిస్థితి గమనించడానికి?

పాత రోజుల్లో, అందరూ ఇంటి హాలు లో ఉండే వారు, పెద్దలు ఖాళీగా ఉండేవారు. ఇప్పుడు ఎవరికి వారికి గదులు, అంతా గోప్యం, నటన, వంచన, మోహం, వ్యామోహం - చివరికి పతనం.

అందుకే నేటి చాలా పెళ్ళిళ్ళు సంవత్సరం గారంటీ లేదు, గోడ గడియారం కన్నా ఉంది గారంటీ. నచ్చితే ఎవరితో అయినా కలువు, నచ్చకపోతే విడువు, పెద్దలు కూడా ఇదే మంచి దోవని అంగీకరించి, తమ వంశ పతనాన్ని కొనసాగిస్తున్నారు.

గుప్పెడు మూసి ఉంచితే అందం, అది ఆ ఇంటి వారికి ఆనందం. దానిని తెరిచితే, ఏమీ ఉండదు, అంతా శూన్యం. పాయసం ఒక కప్పు తాగితే, సంతోషం. పది కప్పు లు తాగితే, విరక్తి పుడుతుంది, మరలా జీవితము లో అసలు ముట్టము. ఏదైనా అంతే.

ఇంట్లో ఉన్న సంసారిక ఆడవారు, ఎందుకు ఆ పాటలు డాన్సులు పెడుతున్నారో, ఎవరికి తమ దేహ సౌందర్యము, తైతిక్కల పైత్యము చూపిస్తున్నారో, వారికి వారి తల్లి దండ్రులకు కూడా తెలీదు, అదే మోహం అదే వ్యామోహం. వారి భర్తలు కూడా, ప్రోత్సహిస్తున్నారో లేక బాధపడుతున్నారో, వారికి కాలమే జవాబు చెబుతుంది.

ఇంక వీరికి పూజ పునస్కారం ఆధ్యాత్మికత ఎలా ఎక్కుతుంది? త్రికరణ శుద్ది లేనట్లే గా? ఎందుకంటే అరిషడ్వర్గాలకు బానిసలు అని సాక్ష్యం చూపిస్తున్నారు కదా, ప్రపంచానికి?

ఇంకా ఎన్నో ఘోరాలు వినబోతున్నాము చూడబోతున్నాము, ఎందుకంటే అది మన నిర్లక్ష్య పెంపకమే. గుణం వదిలేసి ధనము కు మనము పరుగులు తీసినట్లే, వారూ పరుగులు తీస్తున్నారు.

మంచి వారమని అనుకునే వారు, మంచి వారికి సాయం చేయరు, వారికి ఇంకో దోవ లేదు, తెలిసిన దోవ చేయవద్దా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తల్లి ద్రండ్రులు కష్టపడి నీతి గా బతకడం నేర్పలేదు, ఎందుకంటే వారికీ తెలీదు. పైగా, వారూ తమ పిల్లలను అభినందిస్తున్నారు, ఏదో ఒక తప్పుడు దోవలో, మా పిల్లలు లక్షలు మరియు పేరు సంపాదిస్తున్నారు అని.

పేరు సంపాదించాలి, మరి మంచివారు 10 మంది ఆస్వాదిస్తే చాలదా, 10 వేలు మంది తప్పుడు వారు కావాలా? గంగి గోవు పాలు గరిటెడు అయిన చాలవా?

మనకు లక్షమంది పైత్యం ఉన్న వారు కావాలా, ఆ మోహము లో మనము పతనము అవ్వాలా, ఇతరుల పిల్లలను పతనము చెయ్యాలా, వారి ఉసురు పొసుకుని? ఆ వీడియోల పై వచ్చే ఆదాయం తో, మన కుటుంబం విలువలతో బతుకుతుందా?

మన పిల్లలు వంద మంది చూసి చెడిపోతుంటే, దాని మీద ప్రకటనలు ఇచ్చే, మన లాంటి నీచమైన వారు, 10 రూపాయలు ఇస్తే, మీకు 5 ఇస్తున్నారు. అదే మన జీవనాధారము అయితే, మరి మనకన్నా ఇంకా చెండాలము గా రాసిన చూపిన వాడు వస్తే, మనకు ఆదాయము సున్నా అవుతుంది, మరి తట్టుకుంటామా?

అలాంటి అశ్లీల న్రుత్యాలు పాటలు, చేసిన తారలు నటులు, ఏ స్థితిలో ఉన్నారు చివర రోజుల్లో? చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు లేవా?

అర్ధం లేని అశాశ్వతమైన అంశాలతో పేరు సంపాదించి, ఆ తర్వాత అవమానం తట్టుకోలేక, అందరినీ వీడడం అవసరమా. చూడండి ఈ రోజులలో లోకం తీరు, యూట్యూబ్ ఇన్స్టాగ్రాం రీల్స్ ఇంకా ఎన్నో రకాల సోషల్ మీడియా వీడియో సామ్రాజ్యము లో, మన పిల్లల చెడుకు ఎన్నో దోవలు.

మరి అలాంటి వారి సోషల్ మీడియా ని చూసి లైక్ చేసే, రోజూ చూసి తరించే, మన ఇంటి పెంపకం ను, బలహీన పతన మనసులను ఏమనాలి?

ఆ సెలబ్రిటీ పెరగడం కు తరగడంకు, మన ఇంటి పాపం లేదా? మనకు శిక్ష లు ఉండవా? పాపం చేసిన వారితో పాటు, పాపాన్ని ప్రోత్సహించిన వారు కూడా, శిక్ష లో పాలు పంచుకుంటారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో ఓ సినీ నటి, ఓ యూట్యూబు స్టారు, రోడ్ పై తన్ను కున్న వివాదం హాట్ టాపిక్.

ఒక మహిళ లేదా పురుషుడు అయినా, ఇతరుల ఇంటి మీదకు వెళ్ళి తన్న వచ్చా? అరవ వచ్చా?

న్యాయముగా కేసులు పెట్టాలి. ఇలా అందరూ, వారి ఇష్టాన్ని అయిష్టాన్ని బట్టి, సినిమా దర్శకులు నిర్మాతలు హీరోలు హీరోయిన్ లను కొడితే, ఇంక శాంతి భద్రతలు ఉంటాయా?

ఆ మహిళ, వీడియోలను తీసిన వారిని నిందించాలా? లేక అందులో నటించిన, అమ్మాయిలను నిందించాలా? ఆ 100 మంది నటించిన అమ్మాయిలు అలాగే వీడియోలు చూసే జనాల ఇళ్ళకు వెళ్ళి, కౌన్సిలింగ్ ఇవ్వచ్చును కదా? అది చేయరు.

నటించే వారు మరియు చూసే వారు లేక పోతే, వారు వీడియోలు తీయరు కదా? అంటే తప్పు మన ఇంట్లో ఉంది, మన పిల్లల్ని మార్చలేము. ఎదుటి వారు మాత్రం మారాలి, అంతేనా?

ఇక ఆ అబ్బాయి జవాబులు చూస్తే కళ్ళు తిరుగుతాయి మనకు. నాకు తెలిసింది ఇదే, నాకు వచ్చింది ఇదే, నేను చేస్తాను, చూస్తే చూడండి, లేకపోతే మానండి అని, మన దర్శకుడు వర్మ లాగా ధైర్యముగా చెపుతున్నారు.

అది, మన పెంపకం. తప్పును కూడా అందము గా సమర్ధించుకుంటూ, వాదిస్తున్నారు. మరి మన భవిష్యత్ వీరి చేతిలో ఉంది.

ఆ ఉక్రెయిన్ అధ్యక్షుడు, కొండకు తాడు వేసి లాగుతున్నాడు, ఇతరుల బలం చూసి, ఎంత మంది తన ప్రజలు అశువులు బాసినా, తాను మంచి వినడు చేయడు. అలాగే మన ప్రతి ఇల్లు ఉంది ఇప్పుడు.

Home, body double meaning dialogue bad dances prank videos, family values ​​fall - whose fault?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1666 General Articles, 64 Tatvaalu
Dt : 22-May-2022, Upd Dt : 22-May-2022, Category : General
Views : 202 ( + More Social Media views ), Id : 1400 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : home , body , double , meaning , dialogue , bad , dances , prank , social , videos , family , values , ​​fall , fault , parents , kids
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content