అన్ని రకాల రుచులు, ఫోన్లు, సినిమాలు, బండ్లు, దేశాలు కావాలి, కానీ పలు దైవ పాటలు మంత్రాలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,861,991; 104 తత్వాలు (Tatvaalu) and views 224,528.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*అన్ని రకాల రుచులు, ఫోన్లు, సీరియల్స్, సినిమాలు, బండ్లు, ప్రదేశాలు, దేశాలు,కోర్సులు కావాలి, కానీ పలు దైవ పాటలు మంత్రాలు మాటలు వద్దా?* తండ్రి కొడుకుల చర్చ.

*Want all kinds of flavors, phones, serials, movies, vehicles, places, countries, courses but not many divine songs, mantras, words?* Dad and Son discussion.

1. *అబ్బాయి* - తండ్రీ, దోసెలు ఎన్ని రకాలు ఉన్నాయి? మన ఊళ్ళో ఎన్ని హోటెల్ లు ఉన్నాయి? మనము ఎన్ని తిన్నాము, తిరిగాము?

*తండ్రి* - సాదా, మసాలా, ఉల్లి, పేపర్, ఎమ్మెల్యే, అంటూ చాలా రకాల దోసెలు ఉన్నాయి బిడ్డా. అన్ని మనము స్వయముగా నోటితో రుచి చూసాము 10 ఏళ్ళుగా, ఎన్నో వంటకాలు. బిర్యాని ఎన్ని రకాలు తిన్నాము. ఎంత ఖర్చు అయినా, పది రకాలుగా తినందే, నాలుక ఊరుకోదు.

మన ఊళ్ళో ఉన్న, 10 పైగా అన్ని హోటెళ్ళకు, మనము తిరిగి, తిన్నాము మరచావా? మనము సైకిల్, స్కూటీ, నుంచి కారు దాకా అన్ని వాడాము, తిరగడానికి. వివిధ దేశాల/ రాష్ట్రాల తిండ్లు తిన్నాము, రుచులు చూసాము.

మన ఇంట్లో శుభకార్యమైనా కూడా, నీసు తో ఓ 10 రకాలు, శాఖాహారం తో ఓ 10 రకాలు, ఎందులోనూ తగ్గము. ఎన్నిరోగాలు వచ్చినా, తగ్గము, ఆసుపత్రులు మందులు కు విలువ మరియు జనాభాను, తగ్గనీయము.

2. *అబ్బాయి* - తండ్రీ, ఫోన్ లు ఎన్ని రకాలు ఉన్నాయి, మనము ఎన్ని వాడాము?

*తండ్రి* - శాంసంగ్, ఆపిల్, అది, ఇది, అన్ని మనము స్వయముగా వాడి చూసాము బిడ్డా. ఎయిర్టెల్, ఐడియా, ఎన్నో కంపెనీల సిం లు కూడా వాడాము. స్వదేశం, విదేశం.

టాబ్లెట్, కంప్యూటర్ లాంటివి కూడా వాడాము. ఖర్చు ఎక్కువ అవ్వాలి అంటే, ఇవన్నీ వాడాలి మరి, గొప్పగా.

3. *అబ్బాయి* - మరి సీరియల్స్, సినిమాలు ఎన్ని మనము చూసేది?

*తండ్రి* - సీరియల్స్ రోజూ, సినిమాలు ఈ నెలలో కనీసం 5 చూసాము కదా కొత్తవి, దేనిని మనం వదిలి పెట్టము. ఇంకా ఇంగ్లీష్, ఓటీటీ, ఆహా, ఓహో లు లో అన్ని చూస్తాము. కళ్ళు తొందరగా పోయి, కళ్ళజోడు రావాలని, 75 ఇంచెల టీవీ కూడా కొన్నాము.

ఊ అంటావా మావా లాంటి పాటలు, అన్ని నోటికి వచ్చు, డాన్సు లు కూడా వాటికి, వెంటనే నేర్చేసుకుని.

ఇక పని చేసేటప్పుడు కూడా, చెవిటి వాడిలా, చెవిలో సంగీతం పెట్టుకుని, చాలా ప్రమాదాలు ఇబ్బందులు పడిందీ నీకు తెలుసు కదా. అయినా తగ్గము.

4. *అబ్బాయి* - హైదరాబాద్ లో ఎన్ని ప్రదేశాలు చూడాలి? ఇంకో నగరము/ రాష్ట్రం/ దేశం?

*తండ్రి* - బిర్లా మందిరం, టాంక్బండ్ లాంటివి ఎన్నో ఉన్నాయి, మనము స్వయముగా వెళ్ళి చూసాము. ఇతర మహానగరాలు చూసాము, రైళ్ళు బస్సు విమానం లో కూడా వెళ్ళి. అన్ని తిరిగి చూస్తేనే ఆనందం, సంతోషం. లేకపోతె మనసు త్రుప్తి ఉండదు.

దాని ఖర్చులు కోసం, పలు రకాల మోసాలు అబద్దాలతో, పలు రకాల సంపాదన కూడా ఉంటుంది. ఆఫీసులో పని 4 గంటలేగా చేసేది. ఫోటోలు సోషల్ మీడియా లో పెట్టాలి, అందరికీ పంపాలి. నువ్వు మంచి ఉద్యోగం చేసి 4 రాళ్ళు సంపాదించాలి అని, సీ, సీ ప్లస్ ప్లస్, జావా, ఓరకల్, సర్టిఫికేషన్లు రాపించాను.

5. *అబ్బాయి* - అంటే, ఏదీ ఒక రకముతో సర్దుకోము. ఖర్చు ఎక్కువ లేకుండా, కొద్ది సమయముతో అయ్యేవి, ఏవీ మనము చేయము. అన్ని రకాలు గా కళ్ళు, నోరు, అన్ని వాడుతాము. రకరకాల రుచులు, పద్దతులు ఉండాలి, ప్రాపంచిక భౌతిక విషయాలలో.

*తండ్రి* - మనము అరిషడ్వర్గాల అష్టవ్యసనాలు బానిసలము బిడ్డా, ప్రాపంచిక బ్రమలూ ఆనందాలే, మనకు ముఖ్యం. దానికోసం ఎంత సమయం మరియు ఖర్చు అయినా, ఎన్ని రకాలు అయినా, వెనక్కి తగ్గము.

ఎందుకు బిడ్డా ఇన్ని ప్రశ్నలు, కొంపతీసి వీటినుంచి బయట పడదాము అని, వైరాగ్యం వస్తున్నదా? అప్పుడే వద్దు, ఇప్పుడు నీకు 20 నే, 60 తర్వాత, మనకు ఎటూ అవి తప్పవు.

6. *అబ్బాయి* - లేదు తండ్రి, మీ వాట్సాప్ ఫోన్ లో చూస్తే, 140 రకాల దైవ స్తోత్రాలు మంత్రాలు వేదం పాటలు ఉన్నాయి, 6 నెలలు పై గా, ఎవరో సొంతగా పాడి మరీ పంపారు. మరి మన కుటుంబం లో ఎవరూ, అలాంటివి కనీసం మాట వరసకు అనుకోవడానికి, పలకడానికి కూడా, దైర్యంగా మనసు అంగీకరించడం లేదు. మనకు నోరు తిరగవు కూడా, అన్ని ప్రయత్నం చేసే మనం, ఇవి ఎందుకు చేయలేము?

మరి మనకు పిచ్చి నా? లేక మీ మిత్రుడు కి పిచ్చినా? ఎందుకు అన్ని పాటలు 300 పైగా పాడి మనకు పంపుతున్నారు? అది ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకు మానసికబలానికి మంచిది అయితే, మనము ఎందుకు చెయ్యము?

*తండ్రి* - మనము 80 శాతం కలియుగ పాప జనం లో ఉన్నాము. ఆధ్యాత్మిక ఆత్మ ద్రుష్టి, మానసిక నియంత్రణ మనకు లేదు. అవి లేవు అని, మానసిక బలహీనులమని, దుర్యోధన రావణ వారసులమని, ఇంట్లో ఎవరిమాట ఎవరు వినమని, మనకు అరిషడ్వర్గాల పిచ్చి, అష్టవ్యసనాల బానిసత్వం అని మనము ఒప్పుకోకూడదు బిడ్డా, అలా ఒప్పుకుంటే, నేను 3 కోట్లు సంపాదించి, 3 ఇళ్ళు కొనేవాడినేనా? ఇన్ని సౌకర్యాలు, బుద్ది ఎదగకుండా, తేలికగా చెడిపోవడానికి, మీకు దక్కేవా?

మన లాగా ధన సమయం విలువ తెలిస్తే, అవసర అవకాశవాదం తెలిస్తే, నైతిక విలువలు లేకుండా, పిల్లలకు సంస్కారం నేర్పకుండా, ముదుసలి తల్లి దండ్రుల బాధ్యత తీసుకుని సమాన సౌకర్యాల్తో ఇంట్లో పెట్టకుండా, కేవలం ఎంత ఎలా సంపాదించాలి, ఎన్ని ఆస్తులు కూడబెట్టాలి అని ఆలోచన చెయ్యాలి కానీ, ఇలా ఊరక దైవం పాటలు మాటలు మంత్రాలు పాడటం పలకడం, సమయం దండుగ, అని మన 80 శాతం మంది లో గట్టి భావం.

కుక్కతోక వంకరలాగా, మన బుద్దులు మారవు. వాట్సాప్ లో నక్కి దాగి ఉంటాము, రీడ్ రిసీప్ట్ ఉండదు, ఫోటో కూడా ఉండదు, మన మంచి పనులు స్టేటస్ లో పెట్టము.

ఏదో ఒక దేవుడు, ఒక పాట చాలవా, ఎందుకు ఇన్ని పాటలు, సమయం, ఎక్కడ ఉన్నాడో తెలియని, ఆయన కోసం? మనము 80 శాతం మందిమి అలా చేస్తామా? దేవుడు వింటాడా, పాడుతా తీయగా, వాక్సుద్ది వంకర బహుమతి ఇస్తారా?

మరలా, మనలాంటి అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలకు, పంపడం ఇంకో దండగ. మనము పాడము, పిల్లల చేత పలికించలేని చవటలము, ఇంకొకరుకు అసలు పంపము, మీరూ ప్రయత్నము చెయ్యండి అని.

అందుకనే, మనకు పిచ్చి లేదు, 300 పాటలు పాడి పంపే వారికే పిచ్చి. అబ్బో మీరు దివి నుంచి భువికి దిగిన దేవతలు అని, మీకే నోరు నాలుక సన్నన, మానసిక నియంత్రణ త్యాగం సేవ వాక్సుద్ది ఉంది అని నిందిస్తూ, కాలం గడుపుతూ, మన పతన గొయ్యి మనమే తీసుకుందాం లోతుగా.

7. *అబ్బాయి* - మరి తాతయ్య నానమ్మ/ అమ్మమ్మ కూడా, మీలాగే ఇలాంటి తప్పుడు భావాలతో నేల విడిచి సాము చేసి, 3 కోట్లు 3 ఇళ్ళు సంపాదించారు కదా, మరి అనాధాశ్రమం లేదా ఊళ్ళో ఇంటి లో ఒంటరిగా దిక్కులేని వారిగా ఎందుకు ఉన్నారు, రోగాలతో కుయ్యో మొర్రో అంటూ? మనశ్శాంతి లేకుండా ఉన్నారు, మానసిక బలహీనతతో, జీవితం వ్యర్ధము అయ్యి. సొంత పిల్లలతో, మనుమలతో ఆడుకునే అద్రుష్టం ఎందుకు పోగొట్టుకున్నారు, ఎంత పాపాలు చేస్తే?

వారు ఇలాగే అనుకుని, ఇంత సంపాదించి, చివరకు రోగాలకు ఆసుపత్రులకు మందులకు అవి అన్ని ఖర్చు పెడితే లేదా ఇంకొకరు లాకుంటే, ఇంక ఉపయోగం ఏముంది? రోగులు లేని ఆసుపత్రి ఉందా? మోసం వెన్నుపోటు లేని కొంప ఉందా? చివరకు దిక్కు లేక, వారి పిల్లలు మీరూ చూడక, ఆశ్రమములో/ ఇంట్లో ఒంటరిగా రోజూ చేయిపట్టి నడిపించే వారు ప్రేమగా ముద్దు పెట్టే వారు లేకుండా ఉంటే, ఎవరికి పిచ్చి అనుకోవాలి తండ్రి?

పసి బాలురు ప్రహ్లాదుడు మార్కండేయుని వయస్సు ఎంత, అన్ని చిన్నతనంలో నేర్చుకోలేదా? 60 తర్వాత, మన శరీరం మన మాట వింటుందా, కాలు చెయ్యి కదులుతుందా? 3 ఏళ్ళు పైన, ఆదాయం లేకుండా, ఏదీ అమ్మకుండా, తలవంచి ఎవరి దగ్గర అప్పు చెయ్యి చాపకుండా, సౌకర్యాలు తగ్గకుండా, ఏడవకుండా, నవ్వుతూ, 9 ఏళ్ళు సజీవ గురువు సేవ చేస్తూ, నేల నిద్ర శాఖాహారముతో, 10 మందికి మంచి మాటలు పాటలు పంపి, ఇతరుల మంచి కోరగలమా? అంత ధైర్యం మనకు ఉందా? ఆ పరిస్తితి మనకు రాదా? శని 27 ఏళ్ళకు అయినా వచ్చి బుద్ది చెపుతారని, మనకు తెలీదా?

ఇంక మనము గురు స్థానానికి వెళ్ళలేకపోయినా, కనీసం మంచి శిష్యుడు స్థానానికి ఎలా వెళ్ళగలం? ఇప్పుడైనా, నోరు తెరిచి, 4 మంత్రాలు శ్లోకాలు పాటలు నేర్చుకుందాము. హిందువులు గా గర్వముగా, పదిమందికి, మనకు మానసిక నియంత్రణ ఉంది అని, మన మంత్రాలు శ్లోకాలు వాక్శుద్ది ద్వారా, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటూ, పది మందిని ఉత్తేజపరుద్దాము నాన్నా.

మన స్వార్ధం తో నిర్లక్ష్యం తో, మత మార్పిడీలు పెరుగుతున్నాయి. ఇతర మత భాషా బాబాయిల వెంట మూర్ఖముగా పరుగులు తీసే, మానసిక బలహీనులకు, కన్న తల్లి తండ్రి ద్రోహులకు కనువిప్పు కలిగిద్దాం, సొంత సాధనతో. ఇలాంటి సన్నాసుల 2 నాల్కల అవసర అవకాశ ధోరణితోనే, నాటి ఆంగ్లేయుల మరకల బానిసత్వ పాలనలో మగ్గాము, మరలా అటే వెళుతున్నాము.

ఆనాడు శూద్రులకు వేదం చదివే హక్కు లేదా అని నిలదీశాం, ఇప్పుడు మా వల్లకాదు, మందపు నాలికతో అని, మన చవట దద్దమ్మ తనాన్ని మనమే బయటకు వేసుకుంటున్నాము. తప్పు కదా, ఆత్మ ద్రోహం కదా?

దేవుడు మనకు తక్కువ ఏమి ఇచాడు? ఇచ్చిన దానిని, కేవలం తుచ్చ మైన సుఖాలు భోగాలు సౌకర్యాలకు వాడి, చివరలో అనాధాశ్రమములో దిక్కు లేని వారిగా ఉండాలా? ఈ కుసంస్కారం లో పెరిగి, మాకు, మా పిల్లలకు మానవత్వం నేర్పగలమా?

*తండ్రి* - బిడ్డా, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది నీకు, కొంప తీసి రోజు మా స్నేహితుని వాట్సాప్ సందేశాలు చదువుతున్నావా. వామ్మో, చాలా ముందు జాగ్రత్తలు అలవాటు అయ్యింది. నీకు మానసిక బలం చాలా పెరిగింది, జీవితం లో ఎన్ని కష్టాలు అయినా, ధైర్యముగా ఎదుర్కుంటావు.

అలాగే బిడ్డా, సొంత లాభము కొంత మానుకుని, పొరుగువారికి తోడు పడవోయ్ అన్నారు. కనీసం మంచి మాట పాట మంత్రం తో అన్నా, ఆరోగ్య రక్షణ చైతన్యము మనమూ తెద్దాము. ముదుసలి తల్లి దండ్రుల బాధ్యత తీసుకుని, సమాన సౌకర్యాలు ఇప్పించే, ఉత్తేజం కలిగిద్దాము, మనమూ ఆ అద్రుష్టం పొందుదాము బిడ్డా, పిల్లలలో సంస్కార గుణం పెంచుదాం.

* * *

గాత్ర సాధన చేస్తే, మన మంత్రాలు, మాటలు, పాటలు, నాభి నుంచి స్పష్టముగా బలముగా రావాలి, వస్తుంది కూడా. మరి మీరు ప్రయత్నము చేస్తు, పిల్లలతో యువత తో కూడా, మన పూజా మంత్రాలు, పలికిస్తారు కదూ.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుండి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - ఓం - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

మంత్రాలలో బీజాక్షరాలు, ప్రాస, మన శక్తిని రగిలిస్తాయి.

పాత రోజుల్లో, అబ్బాయి అమ్మాయి ఇద్దరికీ పాటలు వచ్చి ఉండాలి. అది ఆరోగ్యం, వ్యక్తిత్వం, మననం, గుర్తు ఉంచుకోవడం, ఉచ్చారణ, కళ, సాధన, సాత్వికత, పట్టుదల, సున్నితత్వం, ఆత్మవిశ్వాసం, స్టేజ్ భయం పోవడం, కోసం. అసలు విషయము మరచి, ఎగతాళి చేసి, పూర్తిగా మానేసాము.

మీరూ వీలైంత సాధనతో, ఏదో ఒక పాట పద్యము, పెద్ద గొంతుతో పాడే, ప్రయత్నము చేస్తారు కదూ?

గాయకులు కాని మనకు, గాన మాధుర్యం ముఖ్యం కాదు, గాత్ర ప్రయత్నమే ముఖ్యం. కానీ పాటతో, మాటల స్పష్టత, శ్వాస ఆపుకునే ప్రక్రియ, ముఖ్యం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,861,991; 104 తత్వాలు (Tatvaalu) and views 224,528
Dt : 08-Dec-2022, Upd Dt : 08-Dec-2022, Category : General
Views : 507 ( + More Social Media views ), Id : 1641 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : ourgatranaivedyaseva , sing , chant , om , breathing , exercise , mind , control , lungs , heart , bp , health , thyroid
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content