కన్నవారిపై కాఠిన్యం, 60 శాతం మంది నిరాదరణ, సూటిపోటి మాటలతో 53 శాతం: హెల్ప్‌ ఏజ్‌ నివేదిక - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2165 General Articles and views 2,193,283; 104 తత్వాలు (Tatvaalu) and views 243,485.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

*వృద్ధులను ఆదుకుంటున్నాము* - చుట్టుపక్కల వృద్ధులను ఆదుకుంటున్నాము. చాలామంది వృద్ధుల పిల్లలు, ఇక్కడ వీరిని ఒంటరిగా వదిలేసి, విదేశాల్లో లేదా ఇతర నగరాల్లో/ చోట్ల ఉంటున్నారు. ప్రతిరోజు వారిని పలకరించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తుంటాము. ఎప్పుడైనా ఆరోగ్యం సహకరించకున్నా వైద్యం కోసం డబ్బులు సమకూర్చుతాము. 35 శాతం వృద్ధులు సంతోషంగా ఉండటానికి కారణం ప్రభుత్వమిచ్చే పింఛన్లే అనుకుంటున్నాను. – జీహెచ్‌ఎంసీ ఆసరా కమిటీ మెంబర్‌

*చట్టం అమలు చేస్తే మేలు* - తల్లిదండ్రుల సంక్షేమం కోరి 2007లో కేంద్రం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. 2011లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని అడాప్ట్‌ చేసుకుంది. దీన్ని అమలు చేస్తే చాలావరకు వృద్ధుల సమస్యలు తీరుతాయి. కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. లేదంటే భవిష్యత్తు తరాలు ఇంకా నిలకడలేని స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. – హెల్ప్‌ ఏజ్‌ ఇండియా ప్రతినిధి

*ఇలా ఫిర్యాదు చేయొచ్చు* - సమాజంలో, కుటుంబసభ్యుల ద్వారా వేధింపులకు గురవుతే వృద్ధులు నేరుగా హెల్ప్‌ ఏజ్‌ ఇండియా వయోవృద్ధుల సహాయ కేంద్రం 1-800-180-1253 నంబర్‌ను సంప్రదించొచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే పిల్లలకు అవగాహన కల్పించడంతోపాటు మానవతా విలువలు పెంపొందించేలా చేస్తారు.

* మనకు జీవితాన్ని ఇచ్చి, ఇంత వారిని చేసిన, మన ఇంటి పెద్దల పై వివక్ష, వేధింపులు, నిర్లక్ష్యం మానండి

* జీవితాన్ని ధారపోసి పెద్ద చేసిన వారిని ఆదరించాలి, కుక్క కూడా విశ్వాసం చూపిస్తుంది కొంచెం అన్నం పెడితే, మరి మనం?

* చూసే కొద్ది వారు కూడా, సూటిపోటి మాటలతో వారిని కుంగనీయొద్దు, మా ఎదాన పడ్డారు, మీ నస చాదస్తం భరించలేము అన్న మాటలు అనవద్దు. చిన్నప్పుడు అంతకన్నా ఎక్కువ నస బాధ మనమూ పెట్టాము.

* కుటుంబ విలువలను నేటి యువత గౌరవించాలి. లేదంటే, వారి కుటుంబ విలువలు కూడా, అడుగంటుతాయి.

* సూటిపోటి మాటలతో 53 శాతం వృద్ధుల వేదన

* 60 శాతం మంది నిరాదరణ: హెల్ప్‌ ఏజ్‌ ఇండియా నివేదిక

* 35 శాతం వృద్ధులు ఆసరా పింఛన్‌తో సంతోషం

ఇంకొన్ని కన్నీటి గాధలు -

* పిల్లలు పెద్దయ్యాక, స్థిరపడిన తర్వాత, వృద్ధాప్యానికి చేరిన తల్లిదండ్రులను కన్నపేగులు పట్టించుకోవడం లేదు.

* వృద్ధ దంపతులు తీవ్రంగా కుంగిపోతూ అనారోగ్యం పాలవుతున్నారని హెల్ప్‌ ఏజ్‌ ఇండియా జాతీయ నివేదిక వెల్లడించింది.

* హెల్ప్‌ ఏజ్‌ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హిమాయత్‌నగర్‌లోని కామ్రేడ్‌ సత్యనారాయణరెడ్డి భవన్‌లో - అంతరాన్ని తగ్గించండి..వృద్ధుల అవసరాలు అర్థం చేసుకోండి - అనే అంశంపై సమావేశం జరిగింది.

* స్వేచ్ఛ కాదు..ఉమ్మడి కుటుంబాలే ఉత్తమం

* మాటలు, నడక నేర్పడం నుంచి మొదలుకొని జీవితగమనాన్ని రూపొందించేందుకు ప్రతినిత్యం తల్లిదండ్రులు కష్టపడిన విధానానికి ఎన్నటికీ వెలకట్టలేమని.. వారు చూపించే చను వు, చొరవ, ప్రేమ, ఆప్యాయతలు ఎవ్వరూ ఇవ్వలేరని స్పష్టం చేశారు.

* కుటుంబంలో వృద్ధులు ఉంటే.. వారిద్వారా జ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, విజ్ఞానాన్ని తెలుసుకోవచ్చన్నారు.

* కుటుంబంలోని పెద్దలను గౌరవించకుండా అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు పంపించే ఆలోచన ఏమాత్రం భవిష్యత్తు తరాలకు మంచిది కాదని హితవుపలికారు.

* తరాలను (రూట్స్‌) మరిచిపోనివారే చరిత్రలో ఉత్తములుగా నిలుస్తారని, కుటుంబీకుల్ని గౌరవించకపోతే..గుర్తించకపోతే.. మనల్ని మనమే అవమానపర్చుకున్నవారమవుతామని గుర్తుచేశారు.

* ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న సంతోషం, నేడు చిన్న కుటుంబాల్లో ఉండటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

* కనీసం వారానికి ఒకసారైనా తల్లిదండ్రులు, అమ్మమ్మ, నానమ్మ, తాతలు, బంధువులతో మాట్లాడటానికి యత్నించాలన్నారు.

నమస్తే తెలంగాణ వారి సమాచార సౌజన్యము/ ఆధారము తో, వృద్ధులకు అండగా, ఉపయోగకరమైన సమాచారం.

https://www.ntnews.com/hyderabad/hyderabad-district-news-1680-629156

60 percent parents are suffering ill treatment from own children HelpAge India report  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2165 General Articles and views 2,193,283; 104 తత్వాలు (Tatvaalu) and views 243,485
Dt : 15-Jun-2022, Upd Dt : 15-Jun-2022, Category : News
Views : 886 ( + More Social Media views ), Id : 33 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : parents , suffering , ill , treatment , children , helpage , india , report

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content