అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి న 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1979 General Articles and views 1,678,963; 102 తత్వాలు (Tatvaalu) and views 207,781.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ (Narendra Modi) గారి చేతుల మీదుగా, నేడు భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు గారి, 125 వ జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

కార్యక్రమంలో భాగంగా సీతారామరాజు గారి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మోదీ, స్వాతంత్ర్య పోరాటంలో కీర్తింపబడని వీరులను స్మరించుకోవలసిన ఆవశ్యకతను గురించి, ఆజాది కా అమృత్ మహోత్సవాల ద్వారా, ఆ దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న సమిష్టి కృషిని గురించి వివరించారు.

అల్లూరి సీతారామరాజు గారి 125 వ జయంతి ఉత్సవాలతో పాటుగా, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, రంప ఉద్యమం, యొక్క వేడుకలు కూడా, నేడు మనం జరుపుకుంటున్నామని ప్రధాని చెప్పారు.

ప్రధాని తో పాటుగా, గవర్నర్ శ్రీ బిశ్వభూషన్ హరిచందన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), పూర్వ కేంద్ర మంత్రి వర్యులు శ్రీ చిరంజీవి, కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సొము వీర్రాజు, ఇతర అతిథులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో తెలుగు వీర లేవరా... దీక్ష భూని సాగరా అంటూ తెలుగు ప్రజా చైతన్యాన్ని మరొక్కమారు గుర్తుచేసిన, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ.

ఆంధ్ర ప్రదేశ్ వీరుల మరియు దేశభక్తుల భూమి. శ్రీ పింగళి వెంకయ్య వంటి స్వాతంత్ర్య వీరులు దేశ పతాకాన్ని అందించారు. శ్రీ కన్నెగంటి హనుమంతు,శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు, శ్రీ పొట్టి శ్రీరాములు వంటి నాయకుల నేల ఇది - ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

పాండ్రంగిలో జన్మస్థలం పునరుద్ధరణ,చింతపల్లి పోలీస్ స్టేషన్ పునరుద్ధరణ,మొగల్లులో అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణం పనులు మన అమృత స్ఫూర్తికి ప్రతీకలు.

విప్లవ వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు గారి కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రియతమ ప్రధాని వరుచ్యువల్ విధానంలో ఆవిష్కరించారు.

ప్రధాని, స్వాతంత్ర సమరయోధులకు / వారి పిల్లలకు, తలవంచి నమస్కరించి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

PM Modi unveils 30 feet bronze statue of Alluri Sitaramaraju on his 125th birth anniversary  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,678,963; 102 తత్వాలు (Tatvaalu) and views 207,781
Dt : 04-Jul-2022, Upd Dt : 04-Jul-2022, Category : News
Views : 656 ( + More Social Media views ), Id : 36 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : pm , modi , unveils , bronze , statue , alluri , sitaramaraju , 125th , birth , anniversary , bhimavaram , andhra , jagan , chiranjeevi

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content