మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1471 General Articles, 48 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.2 min read time.
మొబైల్ లో దిశ యాప్ మీ చెంత ఉంటే, మీకు రక్షణగా, మీతో పోలీసు రక్షణ బలగం ఉన్నట్లే: జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్
మనకు చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఐయేయెస్ లు ఐపీఎస్ లు ఉద్యోగులు ఉన్నారు. ఏదో మొక్కుబడిగా పదవీ ఉద్యోగం చేస్తున్నాము, జీతం సౌకర్యాలు తీసుకుంటున్నాము అనే గానీ, ప్రజలతో ఎలా మమేకము అవుదాము, వారిని ఎలా ఉత్సాహ పరుద్దాము, అని నిజాయితీగా ముఖ్యమంత్రి ఆశయాలను, తమ ప్రభుత్వ ఉద్యోగ ధర్మమును కర్తవ్యమును, ఆత్మతో మనసుతో నిబద్దత తో, తమ సొంత ఆలోచన తెలివితేటలతో పెంచే అధికారులు నాయకులు కొంతమందే ఉంటారు.
మనము గతము లో అనంతపురం కలెక్టర్ శ్రీ గంధం చంద్రుడును చూసాం, మొత్తము జిల్లా అధికారులతో, సోషల్ మీడియా నడిపించారు. ప్రకాశం జిల్లా గత ఎస్పీ, శ్రీ సిద్దార్ధ ను చూసాము, 50 మంది పైగా పోలీస్ సిబ్బందిని బదిలీ చేసారు, రాజకీయ నాయకులను పక్కన పెట్టారు. ఇప్పుడు అదే కోవలో, ఇంకొక ఎస్పీ కూడా తమ నైపుణ్యాన్ని నిబద్దతను నిరూపించారు. ఆయనే, బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్.
జిల్లాలో దిశ యాప్ డౌన్లోడ్ లు వేగవంతం చేయడానికి, బాపట్ల జిల్లా ఎస్పీ, దిశ యాప్ డౌన్లోడ్ స్పెషల్ డ్రైవ్, ఉత్తమ వార్డ్/సచివాలయ మహిళా పోలీస్ మరియు దిశ లక్కీ డ్రా కాంటెస్ట్ వంటి, అనేక వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టారు.
జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వార్డ్/సచివాలయం మహిళ పోలీసులు వారి పరిధిలోని గ్రామాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్యమైన కూడళ్ళు, కాలేజీలు, స్కూల్ లు మరియు ఫ్యాక్టరీ లలో, దిశ యాప్ డౌన్లోడ్ పై మహిళలకు విస్తృత అవగాహన కల్పించి, వారిచే దిశ యాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించినారు.
నూతన బాపట్ల జిల్లా ఏర్పడిన, 30 రోజుల్లోనే సుమారు 1,00000 మంది మహిళలతో, దిశ యాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించినారు. ఆంధ్రా లో అన్ని జిల్లాల వారికి ఇది ఉపయోగం సుమా, పిల్లలు కాలేజీ విద్యార్ధులు ఉద్యోగినులు గ్రుహిణులు ముదుసలి వారు అందరికీ సుమా Disha link.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన దిశ యాప్ ను, మొబైల్ ఫోన్ లో నిక్షిప్తం చేసుకున్నప్పుడే, దిశ యాప్ కు సార్థకత చేకూరుతుంది అని చెప్పారు.
యాప్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క వివరాలును గోప్యంగా ఉంచడం జరగుతుంది అని, ఆపద సమయంలో పోలీసు వారి తక్షణ సహాయం మీరు కోరినప్పుడు, మీరు ఫోన్ లో మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మాత్రమే, మీ లొకేషన్ కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత అధికారులకు చేరుతుంది, అని దిశ యాప్ మీ ఫోన్లో ఉంటే, మీ చుట్టూ పోలీస్ లు ఉన్నట్లే అని జిల్లా ఎస్పీ గారు తెలిపినారు.
దిశ యాప్ మీ ఫోన్లో ఉంటే మీ చుట్టూ పోలీస్ లు ఉన్నట్లే.
గుండమ్మ కధలోని ఈ పాటను, మన దిశయాప్ కు అణుకూలముగా వాడుకుందాము, మీరూ పాడవచ్చు మీ మాధుర్య గళముతో.
చేసింది డౌన్లోడ్ చేసింది మహిళాలోకం, స్త్రీటెక్నాలజీ నెట్ ప్రపంచం, లక్షదాటింది దిశావాడకం
ఎపుడో చెప్పెను సీయెంగారు, అపుడే చెప్పెను డీజీపి గారు 2
మొబైల్ దిశయాప్ వాడుకో చెల్లెమా ఆ
మొబైల్ దిశయాప్ వాడుకో చెల్లెమా, పోలీసు ఎస్పీల బలం కూడా
చేసింది డౌన్లోడ్ చేసింది మహిళాలోకం
పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు 2
అది ఇది ఏమని అన్ని రంగముల ఆ
అది ఇది ఏమని అన్ని రంగముల, రక్షణతోడు కావాలి, దిశయాప్ చేతినఉండాలి
చేసింది డౌన్లోడ్ చేసింది మహిళాలోకం
చట్టసభలలో సీట్లు ఉన్నా, భర్తల తోనే పోటీఉన్నా 2
పల్లె పట్టణాల గడపా ఎక్కి ఈ ..
పల్లె పట్టణంలో గడపా ఎక్కి .., దిశాఅండ చెప్పాలి, దిశాతోడును పెంచాలి
చేసింది డౌన్లోడ్ చేసింది మహిళాలోకం, స్త్రీటెక్నాలజీ నెట్ ప్రపంచం, లక్షదాటింది దిశావాడకం
చేసింది డౌన్లోడ్ చేసింది డౌన్లోడ్ చేసింది మహిళాలోకం
New Bapatla District Within 30 Days, disha App Download With One Lakh Women - SP Vakul