ప్రకాశం జిల్లా పోలీసు - లాక్ డౌన్ విధులలో కష్టపడుతున్న సిబ్బంది అందరికీ, నిత్యావసర వస్తువులు పంపిణీ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,636; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. వైరస్‌ సోకిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో, ఎవరెవరిని కలుస్తున్నారో తెలియక, అంతా భయంగా భయంగా గడపాల్సి వస్తుంది. చివరకు సొంత మనుషులపై కూడా, నమ్మకం కోల్పోయేలా చేసింది, కరోనా వైరస్‌. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లోనూ...ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగాలు చేస్తున్న వారిలో, వైద్యుల కంటే ముందు వరుసలో ఉండేది ఎప్పుడూ పోలీసులే.

కరోనా లక్షణాలు కనిపిస్తేనో లేదా పాజిటివ్‌ వచ్చిన రోగులకో, డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. కానీ, పోలీసులు డ్యూటీ కత్తిమీద సాము లాంటింది. రోడ్డెక్కిన ప్రతీ వ్యక్తినీ తనిఖీ చేయాలి, వారితో మాట్లాడాలి. వారి సమాచారం పూర్తిగా తెలుసుకోవాలి. లాక్‌డౌన్‌ సమయాల్లో రోడ్డుపైకి వచ్చినందుకు, వాళ్ల వాహనాలు స్వాధీనం చేసుకోవాలి. వాటిని పోలీస్‌ స్టేషన్‌లకు తరలించాలి.

ఎంత సోషల్‌ డిస్టెన్స్‌ మెయింటెయిన్‌ చేసినా, చెక్‌పాయింట్ల వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులతో, వాహనదారులు ఖచ్చితంగా టచ్‌ అవుతుంటారు. మనుషులకు దూరంగా ఉన్నా, కనీసం వారి వాహనాలనైనా తాకక తప్పని పరిస్థితి. దీంతో పోలీసుల కుటుంబ సభ్యుల్లో, తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వైరస్‌ బారిన పడకుండా కాపాడు దేవుడా అని మొక్కుకోవడం తప్ప, చేసేదేమీ లేదని పోలీసుల ఫ్యామిలీలు డిసైడ్‌ అయిపోయాయి.

వేళకి నిద్ర, భోజనం కరువు, డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేవరకూ అనుమానమే. ఆరోగ్యాలు దెబ్బతింటున్నా, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు, 24 గంటలూ పని చేస్తున్నారు పోలీసులు. ఇంత కష్టపడుతున్నా, ప్రజల నుంచి ఏ మాత్రం సహకారం అందకపోగా, ఎక్కడో ఓ చోట విచక్షణ కోల్పోతే పోలీసులను తిట్టని వారుండరు.

ఎస్పీ ప్రకాశం శ్రీ సిద్ధార్థ కౌశల్, ఐపీఎస్., గారి స్ఫూర్తితో, ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు, కోవిడ్- 19 నియంత్రణలో భాగంగా, లాక్ డౌన్ విధులలో పాల్గొంటూ, కష్టపడి పని చేయుచున్న పోలీస్ సిబ్బంది అందరికీ, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు.

చిత్రము 1 - ఈ క్రమంలో చీరలకు చెందిన ఎన్నారై, శ్రీ తాడేపల్లి విజయ్ కుమార్ గారు, పోలీసు శాఖ కరోనా వైరస్ తరిమి కొట్టడం లో ముందు వరుసలో ఉన్నారని, తాను ప్రస్తుతం చీరాల లో అందుబాటులో లేకున్నా కూడా, వారి తండ్రి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం, ఈరోజు చీరాల 1 వ మరియు 2 వ పట్టణాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వారి దాతృత్వాన్ని ప్రకటిస్తూ, చీరాల డి ఎస్ పి, ఒకటవ రెండవ పట్టణ సి ఐ ల ఆధ్వర్యంలో, వారం రోజులు సరిపడా కూరగాయలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.


Photo/ Video/ Text Credit : Prakasam and Chirala Police
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,636; 104 తత్వాలు (Tatvaalu) and views 224,975
Dt : 29-May-2020, Upd Dt : 29-May-2020, Category : News
Views : 1742 ( + More Social Media views ), Id : 13 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : prakasam district police , food items distribution , filed staff lockdown , chirala , tvpalli , marripudi

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content