చీరాల పోలీస్ - రక్తదాన మిచ్చిన సీఐ మరియు ఇసుక అక్రమ మాఫియా ను హెచ్చరించిన డీఎస్పీ - News
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. పాత వార్తలను లోకము తీరు లో చూడగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1801 General Articles and views 1,394,205; 94 తత్వాలు (Tatvaalu) and views 184,782.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

1) ఈరోజు చీరాల ఏరియా హాస్పిటల్ నందు, ప్రపంచ రెడ్‌ క్రాస్‌ దినోత్సవం పురస్కరించుకొని, నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన, చీరాల వన్ టౌన్ సిఐ శ్రీ నాగమల్లేశ్వర రావు గారు.

మే 08 న ప్రపంచ రెడ్ క్రాస్ దినం ను దృష్టిలో ఉంచుకుని, రెడ్ క్రాస్ సొసైటీ చేత రక్తదాన శిబిరం నిర్వహించబడింది. ఈ సందర్భంగా, ఒకరి జీవితాన్ని కాపాడటం వలన రక్తదానం, ఒక గొప్ప జ్ఞాపకము అని, సిఐ శ్రీ. నాగమల్లేశ్వరరావు అన్నారు.

రక్తదానం వల్ల రోగనిరోధక శక్తి కోల్పోతుందని, చాలా మందికి తప్పుడు నమ్మకం ఉందని, ఇది నిజం కాదని ఆయన అన్నారు. యువత ముందుకు వచ్చి, రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా పాల్గొనాలని, ఆయన విజ్ఞప్తి చేశారు.

2) చీరాల దగ్గరలో చిన్నగంజాం మండలం మోటుపల్లి లో, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న, మాఫియా పైన రౌడీషీట్ ఓపెన్ చేస్తాము, పోలీసు స్టేషన్ లో ప్రదర్సిస్తాము, ఎంత పలుకుబడి ఉన్న వారైనా ఉపెక్షించం వదలమన్న - చీరాల డిఎస్పీ శ్రీ జయరామాసుబ్బారెడ్డి గారు.

మాజీ ఎమ్మెల్యే సోదరుని హస్తము ఉందని ఊహాగానాలు, కానీ పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. వీడియో లో డిఎస్పీ గారు మాటలు వినండి.

Update May 9th: ఆమంచి స్వాములు గారు దీనిని తీవ్రముగా ఖండించారు, మా తప్పు లేదు మాకు సంబంధము లేదు, ఉంటే, విచారణ చేసుకోవచ్చు అని డీఎస్పీని కలసి వివరించారు మరియు అన్ని చూపించారు.

Request to DSP Sir,

డిఎస్పీ గారు, దయచేసి ప్రభుత్వ లేదా మీ సొంత ఫేస్బుక్ లేదా ఇతర సోషల్ మీడియా పేజీలో అయినా, మన చీరాల వేటపాలెం పర్చూరు సీఐలు ఎస్సై లు మరియు మిగతా పోలీసు సోదరుల, త్యాగాలను రోజు కో పది ఫోటోలు తో, ప్రజలకు తెలియచెప్ప ప్రార్ధన.

మన చీరాలలో డ్రోన్ వాడాం, ఫేస్బుక్ ట్విట్టర్ టెక్నాలజీ కూడా వాడే సత్తా, మన డివిజన్ పోలీసులు కు ఉంది అని నిరూపిద్దాం. మేము వార్తలు కూడా ఎవరినీ అడగకుండా, జిల్లా ఎస్పీ గారి నుండి కాకుండా, మీ పేజీ నుంచే నేరుగా తీసుకుంటాం.

ఎస్పీ గారి ని ఎటూ అడగలేము, ఎందుకంటే, మాకు వంద పోలీసు స్టేషన్ లు పైన ఉన్నాయి, మీ చీరాల మండలము వాళ్ళ వి, పది ఫోటోలు రోజూ పెట్టాలి అంటే, కుదరదు కదా అంటారు. అది వాస్తవము కూడా.

మా విలేకరుల, మా పోలీసు సోదరుల మరియు ప్రజల యందు, దయ ఉంచి తొందరలోనే సోషల్ మీడియా టెక్నాలజీ, వాడుతారని మిమ్మల్ని మరియు దేవుని ప్రార్ధిస్తున్నాము.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,205; 94 తత్వాలు (Tatvaalu) and views 184,782
Dt : 07-May-2020, Upd Dt : 07-May-2020, Category : News
Views : 1762 ( + More Social Media views ), Id : 5 , City/ Town/ Village : Chirala , State : AP , Country : India
Tags : chirala police , ci donated blood , red cross day , govt hospital , dsp warning , sand mafia , chinnaganjam , motupalli

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content