Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
* కుల, మాత, జాతి, ప్రాంత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు
* బిజెపి-జనసేన పార్టీల అధికారం
* కుటుంబ రాజకీయాల అవసరం లేదని తెలిపారు
* రాజకీయం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే
* చిరంజీవి, జనసేన పవన్ కల్యాణ్ గారినీ కలిసారు
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. బిజెపి రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ సోము వీర్రాజు గారు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ ఘనంగా విజయవాడలో ఈ కార్యక్రమం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలలో పార్టీ శ్రేణులు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. పూర్వ అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా, బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు గారు.
అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు గారు మాట్లాడుతూ కుల, మాత, జాతి, ప్రాంత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించడమే బిజెపి లక్ష్యం అని తెలిపారు. ఇక పై రాష్ట్ర ప్రజలకు, కుటుంబ రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరం లేదని తెలిపారు. అభివృద్ధి లక్ష్యంగా సాగుతున్న బిజెపి-జనసేన పార్టీలను అధికారంలోకి తీసుకురావటమే రాష్ట్ర ప్రజల ఆలోచనగా మారాలి అని కోరారు.
రాజకీయం కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే చూడాలి, మిగతా కాలం రాష్ట్రం గురించి, పేదల గురించి ఆలోచించాలి, కానీ ఈ కుటుంబ పార్టీలు (టీడీపీ మరియు వైసీపీ) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయాలు చేస్తుంటాయి. ఈ అవినీతి, కుటుంబ రాజకీయాలకు ఇక కాలం చెల్లింది అన్నారు. 2024లో బిజెపి - జనసేనల కూటమిని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారు హాజరయ్యారు. జాతీయ సహ సంఘటనా మంత్రి శ్రీ సతీష్ జి, జాతీయ కార్యదర్శి శ్రీ సత్య కుమార్ గారు, రాష్ట్ర సహ ఇంచార్జి శ్రీ సునీల్ డియోధార్ గారు, పూర్వ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, జాతీయ మహిళామోర్చా ఇంచార్జి శ్రీమతి పురందేశ్వరి గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు మరియు పార్టీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరికీ పేరుపేరున నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో అధ్యక్ష బాధ్యతల స్వీకరణ కార్యక్రమం వర్చ్యువల్ గా చేపట్టిన సందర్భంగా మీ అందరి సహకారం ఎంతో తోడ్పడింది. నామీద మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను, అని అన్నారు సోము వీర్రాజు గారు.
భాజపా జాతీయ కార్యదర్శి శ్రీ రామ్ మాధవ్ గారు, తాడేపల్లిగూడెంలో స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారి గృహాన్ని, సందర్శించి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
టీడీపీ కి అనుకూలముగా మాట్లాడే సుజనాచౌదరి , సీయెం రమేష్ తదితురులు దూరంగా ఉన్నారు.
గత వారములో చిరంజీవి గారిని, మరియు జనసేన పవన్ కల్యాణ్ గారినీ కలిసారు. అలాగే ఇతర బీజేపీ నాయకులను కలిసారు. కొత్త వారిని చేర్చుకుని, పార్టీని బలోపేతము చేస్తామన్నారు.
ఇప్పుడు అయినా, కొత్త వారు, కనీసము సొంత కుటుంబము మొత్తము అయినా, పార్టీలో ఉండేవారిని చేర్చుకోవాలని అభిమానుల ఆకాంక్ష. ఇతర కుటుంబ పార్టీల లాగా కాకుండా, బాధ్యతగా నియమాలతో ఉంటాము కాబట్టి, ఉన్న పార్టీ సభ్యులు కూడా, దీనిని పాటిస్తే బాగుంటుంది అని వారి అభిలాష.
అలా కాకుండా, జీవిత భాగస్వామి తెదేపా లో, కుమారుడు వైసీపీలో ఉంటే బాగోదు కదా, జాతీయ పార్టీ అయి ఉండి. సొంత ఇంట్లో నే బీజేపీ గురించి సర్ది చెప్పుకోలేని నాయకుడు, ఇతరులకు ఏమని న్యాయం వివరించి చెప్పి, మన పార్టీ వైపు తెస్తారు? ప్రజలు ఎలా నమ్ముతారు? పర్చూరు విషయములో, వైసీపీ ఇదే విషయములో దెబ్బతిన్నది కదా 2019 ఎన్నికలప్పుడు. అని అభిమానుల ఆందోళన.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1795 General Articles and views 1,387,035; 94 తత్వాలు (Tatvaalu) and views 184,253 Dt : 11-Aug-2020, Upd Dt : 11-Aug-2020, Category : News
Views : 1140
( + More Social Media views ), Id : 25 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
veerraju ,
president ,
bjp ,
janasena ,
politics ,
elections ,
family parties ,
tdp ,
ycp అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments