పాటతో పరమార్ధం - ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలేలా - సతీ అనసూయ - కాంతారావు, జమున, శారద - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,370; 104 తత్వాలు (Tatvaalu) and views 226,426.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Aalayamela Archanalela Aradhanalela - Sati Anasuya - Jamuna, Sharada, Kanta Rao, Sobhan Babu శోభన్ బాబు

మన గాత్ర, వ్రాత, మానసిక, శారీరక నైవేద్యం సేవ, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - సత్సంగం

చిత్తశుద్ది వాక్సుద్ది గుణ శుద్ది ఉండిన సాత్వికులకు, తమ వారిని తమ చుట్టూ వారిని దేవతలుగా ఎలా పూజించాలో తెలుసు. ఇది ఆనాటి ఒక మహాసాధ్వి కధ, గుణవతి వ్యధ. ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా ఎదుర్కొన్నదో ఓపిక సహనముతో, ఈ పాటలో ఆమె జీవితములో చూడవచ్చు. ఈ రోజులలో, గుణ పెళ్ళిళ్ళు బంధాలు ఆత్మాభిమానం సంస్కార పెంపకాలు లేవు కాబట్టి, ముదుసలి తల్లి దండ్రులు అత్త మామల సజీవ గురువు సేవ లేవు కాబట్టి, ఇవన్నీ వింతగా విడ్డూరముగా కనిపిస్తుంది 75 శాతం మందికి.

జీవుడే దేవుడు, దేహమే దేవాలయము అని తెలిసిన వారికి, దేవుడు తమలో నే ఉన్నారు అని తెలుసు. ఇంక ఆలయమేలా, అర్చనలేలా, ఆరాధనలేలా? తోటి జీవులను ఆరాధించడమే, దేవుని పూజించడం కాదా? మాత్రు/ పిత్రు/ పతి/ సతి దేవుని పద సన్నిధి, మించినది వేరేకలదా? అదే మన పెన్నిధి కాదా! అదే పూజ యాత్ర యజ్ఞం సేవ త్యాగం ఓర్పు సహనాల, పరమార్థము కాదా?

తమలో ఉన్న దైవ గుణాన్ని మరచి, ఏ కొండ గుట్ట కొమ్ము పైనో, ఏ రాతి బొమ్మలోనో, దైవమ్ము దాగెనంటూ, తపియించ నేలా, మూర్ఖత్వం కదా? ఆ దైవము నిజముగ ఉంటే, అడుగడుగున తానై ఉంటే, ఈ ఖర్చు గుడులేల యాత్రలేలా చిత్తశుద్ది లేకుండా? మాత్రు/ పిత్రు/ పతి/ సతి దేవుని పద సన్నిధి, మించినది వేరేకలదా?

వ్యామోహాలలో, పైపైని మెరుగుల నటనల కోసం, భ్రమ చెందు గుడ్డిలోకం. మన మదిలోన వెలిగే ఆలోచనల ఆచరణల అందం, గమనించునా, అంత ఓర్పు సహనం నేర్పు లోకానికి ఉందా? ఈ లోకులతో పనియేమి, పలుగాకులు ఏమంటేమీ, మనం చిత్తశుద్దితో ఉంటే, మన స్వామి తోడురాగా? మాత్రు/ పిత్రు/ పతి/ సతి దేవుని పద సన్నిధి, మించినది వేరేకలదా? ఇంక ఆలయమేలా, అర్చనలేలా, ఆరాధనలేలా?

ఆలయమేలా..! అర్చనలేలా..! ఆరాధనలేలా.!
పతిదేవుని పదసన్నిధి., మించినది వేరేకలదా.!
అదే సతి పెన్నిధి కా.దా.! అదే పరమార్థము కా.దా.! - 2 సార్లు మొత్తము ||ఆలయమేలా!||

ఏ కొండ కొమ్ముపై.నో..! ఏ రాతి బొమ్మలో.నో.!
దైవమ్ము దాగెనం.టూ.., తపియించ నే.లా. - 2 సార్లు మొత్తము
ఆ దైవము నిజముగ ఉంటే., అడుగడుగున తానై ఉంటే.
గుడులేల యాత్రలేలా..
పతిదేవుని పదసన్నిధి., మించినది వేరేకలదా.!
అదే సతి పెన్నిధి కాదా.! అదే పరమార్థము కాదా.!ఆలయమేలా!

పైపైని మెరుగుల కో.సం., భ్రమ చెందు గుడ్డిలో.కం.
మదిలోన వెలిగే అం.దం., గమనించునా..!- 2 సార్లు మొత్తము
ఈ లోకులతో పనియేమి., పలుగాకులు ఏమంటేమీ.
నా స్వామి తోడురాగా..
పతిదేవుని పదసన్నిధి., మించినది వేరేకలదా.!
అదే సతి పెన్నిధి కాదా.! అదే పరమార్థము కాదా.!
ఆలయమేలా..! అర్చనలేలా..! ఆరాధనలేలా.! ఆరాధనలేలా.! ఆరాధనలేలా.!

1971 సుశీల ఆదినారాయణరావు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,370; 104 తత్వాలు (Tatvaalu) and views 226,426
Dt : 08-Feb-2024, Upd Dt : 08-Feb-2024, Category : Songs
Views : 146 ( + More Social Media views ), Id : 2014 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Aalayamela , Archanalela , Aradhanalela , Sati Anasuya , Jamuna , Sharada , Kanta , Rao , Sobhan , Babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content