అవన్నీ వారి దీవెనలు, మన సాత్వికతకు దేవుడు ముందు సాక్ష్యాలు. తప్పు ఎవరిదీ లేదు కదా, ఎవరినీ నిందించము. - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,768; 104 తత్వాలు (Tatvaalu) and views 226,445.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*They are all their blessings, testimonies of our meekness before God. No one is at fault; we don't blame anyone. అవన్నీ వారి దీవెనలు, మన సాత్వికతకు దేవుడు ముందు సాక్ష్యాలు. తప్పు ఎవరిదీ లేదు కదా, ఎవరినీ మనము నిందించము కదా.*

Do not follow the majority. Always follow the right path. 3 Pada Sin (75 Percent), 1 Pada Punya (25 Percent) in Kaliyuga.
మందిని అనుసరించవద్దు, ఎల్లప్పుడూ సరైన మంచి మార్గాన్ని అనుసరించు. కలియుగంలో 3 పాదాలు పాపం (75 శాతం), 1 పాద పుణ్యం (25 శాతం).

Instead of changing others, change ourselves is easy
ఇతరులను మార్చడం కన్నా, మనల్ని మన మార్చుకోవడం తేలిక

రోజూ వాట్సాప్ స్టేటస్ లో ఘోరాలు, నేరాలు, నేటి లోకం తీరు మరువద్దు. మన భాగస్వామి, పిల్లలు, మనమలు, స్నేహితులు, బంధువుల, గుణాలను ఆరోగ్యం మనశ్శాంతి ని, సరి చేసుకునే బాధ్యత మనదే.

ఈ రోజు సీనియర్ (ముదుసలి వయసు పెద్దల) ల సంతోష కార్యక్రమం ఉంది, దేవాలయములో, మీరు కూడా అక్కడకు వస్తున్న, దేవుని దర్శనం కోసం లేదా వాలంటరీ పని కోసం లేదా ఇంకోదాని కోసం అయినా, అక్కడనే మీలాంటి ఉత్తములను కలసే భాగ్యం మాకు కలుగుతుంది. చూద్దాం ఈశ్వరేచ్చ అని సందేశం పంపాము.

సొంత తల్లి దండ్రుల అత్త మామల సేవ చేస్తున్నవారు చేయబోయేవారు, పిల్లల సంస్కార పెంపకం చేస్తున్నవారు, సాత్విక జవాబు ఇచ్చారు, కొన్ని అవాంతరాల వలన రాలేము అని, కొంతమంది కలిసారు, జ్ఞాన గురువులకు తలవంచి నమస్కారములు. మిగతావారు వారి బిజీవలన స్పందించలేక పోయారు, తప్పు లేదు.

అన్నా/ అక్కా/ తమ్ముడు/ చెల్లి/ బావా/ మరదలు, ఎప్పుడూ కనీసం నమ్మిన సాత్విక గుణ స్నేహితులకు/ శ్రేయోభిలాషులకు 10 రోజులు/ వారాలు/ నెలల ముందే అన్ని విషయాలు చెప్పాలి, మనం మన స్తితి గతుల గురించి, తప్పు ఒప్పు ఏదైనా, అవసరం ఉన్నా లేకున్న, దాపరికం చాటు మనస్తత్వం మంచిది కాదు. అదే దాపరికం చాటు మనస్తత్వం రేపు మన భాగస్వామి, పిల్లలు, స్నేహితులు, బంధువులు మనకే రుచి చూపిస్తారు.

మన సాత్విక గుణ లక్షణాలు చిత్తశుద్ది వాక్సుద్ది స్తిరత్వం నీతి నియమాలు నిష్ట, ఒక్క రోజులో ఇతరులకు అర్ధం కాదు, అండగా ఉండలేరు, మన గుణం తెలియచేయకపోవడం మన తప్పే, నిర్లక్ష్యం, బద్దకమే.

ఒకవేళ మనది రజో, తమో గుణమైనా, 2 నాల్కల కపట నటన బుద్ది అయినా కూడా, స్పష్టముగా అదే చెప్పాలి ఒప్పుకోవాలి. ఎందుకంటే, మన నిజాయితీకి సహాయం చేస్తారు తప్పకుండా. విభీషణుడు రాక్షస జాతి అయినా, సుగ్రీవుడు వానర జాతి అయినా, జటాయువు పక్షి జాతి అయినా (ఖననం), సహాయం అందింది.

మనకు నమ్మకం లేని వారితో ఏదీ చెప్పనప్పుడు, వారిని ఏదీ అడగలేము, ఎవరూ మనల్ని నమ్మరు, మనము వారు సహాయం చేయలేదని నిష్టూరాలు ఆడకూడదు. రేపు పిల్లల/ భాగస్వామి విషయం లో అసలు అండగా రారు, మనము ఎన్నిరోజులు భూమి పై ఉంటామో మనకే తెలీదు, నేటి రోగాలతో, మన అవలక్షణాలు, మానసిక బలహీనత అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వముతో.

ఈ మధ్యన మనల్ని విడిచి వెళ్ళిన వారి ఇంటి పరిస్తితి చూడండి, ఎవరూ కనికరం చూపరు, ఎందుకంటే అన్ని బాగున్నప్పుడు మనమూ చూపలేదు కదా? కేవలం అవసర అవకాశాలకే స్పందించాము, ఇప్పుడు మనం దుక్కములో ఉంటే, ఇతరులు అలాగే ఉంటారు, మనమే కదా నేర్పింది?

దానికి బాధ్యత మనదే, బయటవారిది కాదు, మన నిర్లక్ష్యం మన బద్దకం మన అహంకారం లెక్కలేనితనం, భాగస్వామి/ పిల్లలకు శాపాలు, వారూ అదే తప్పు దోవ పడతారు, ఎవరి మాట వినరు.

ఇప్పుడు వచ్చిన కష్టాలు కన్నీళ్ళు - ఇవన్నీ, చిన్న చిన్న అవసరాలు ఇబ్బందులు ఎలాగైనా దాటతారు, ఆ నమ్మకం మనకు ఉంది.

కానీ రేపు పిల్లలకు భవిష్యత్ లో, ఒక మంచి దోవ చేయడం చాల పెద్ద అవసరం, అప్పుడు పరిపూర్ణ నమ్మకస్తులు కావాలి, అదీ 5 ఏళ్ళు పైగా సజీవ గురువు సేవ చేసిన వారు. అలాంటి వారికి అసలు దూరంగా, దొంగ లాగా మనం, మన భాగస్వామి/ పిల్లల సాత్విక గుణాలు ఉండకూడదు. ఉంటే, మనము దైవాన్ని దైవ సంతానాన్ని కూడా నమ్మనట్లే, మన పూజలు చిత్త శుద్ది లేనివి. మనము పరిపూర్ణ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వములో ఆనందముగా మునిగితేలుతున్నాము. అంటే, శని దశ వచ్చే 25 ఏళ్ళలో మనకు పంచభూతాల శిక్షణ ఫలితాలు ఉంటాయి అని తెలుసు.

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, జయలలితమ్మ, కాఫీడేఅయ్య, మన ఇళ్ళ చుట్టూ ఉన్నవారు, మహానుభావులు ఎందరో, మనకు ఎన్నో అనుభవ పాఠాలు నేర్పారు ఈ 50 ఏళ్ళలోనే, మనము ఇప్పుడైనా కళ్ళు తెరవాలి.

ఈ రోజుల్లో ఎవరిని నమ్మగలం, సొంత ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలు, భాగస్వామి, సోదర సోదరీమణులకే, కడుపున పుట్టిన పిల్లలకే ద్రోహం చేస్తున్నారు, ఆత్మలను అమ్ముకుంటున్నారు/ కొంటున్నారు, ఇంక బయట వారికి మంచి చేస్తారా? ఇది 5+ ఏళ్ళు పైగా, అందరికీ మొత్తుకుని చెపుతున్నాం, నిద్ర లేవండి, జాగ్రత్తలు పడండి, భవిష్యత్ కష్టాలు ఆపుకోండి అని. శిక్షణ మొదలు అయ్యాక, ఎవరమూ ఏమీ చెయ్యలేము, సాక్షీభూతులమే.

మనకు 3 ఏళ్ళు పైగా ఆదాయం లేదని, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసామని, 220+ వారాల 108 ప్రదక్షిణలని, 40+ నెలల శిరోముండనము అని, మన ఇల్లు బాగుచేసే వారు లేక పాడుపడుతున్నది అని, ముదుసలి అమ్మ సజీవ గురువు సేవ 10 ఏళ్ళు గా జరుగుతున్నది, అలా ఇంక ఎన్నో త్యాగాలు సేవలు బాధలు సాధనలు, అన్ని ఎందుకు ఏళ్ళు గా అందరికీ చెపుతున్నాము?

ఎవరైనా సహాయం చేస్తారు అనా, వచ్చి చెయ్యి అడ్డు వేస్తారనా, అయ్యో మాకు పెంపక సంస్కారం ఉంది అమ్మకు మేము అండగా ఉంటాము అని అంటారు అనా, వారం వారం వచ్చి లేదా ఫోన్ లో క్షేమ సమాచారం పలకరిస్తారు అనా? కాదు, ఇప్పుడైనా మారండి, రేపు మన అందరి భవిష్యత్ ఇలాగే ఉంటుంది, ఇంతకన్నా ఘోరముగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉన్నది ఏదీ, మంది ఆస్తి బలగం ఆదాయం పదవి, శాశ్వతం కాదు, నిర్లక్ష్యం బద్దకం పాపం వీడదు, జాగ్రత్తలు సుమా అని. ఏది మనము ఇస్తామో, అదే మనకు తిరిగి వస్తుంది.

మనము ఏదీ దాచాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని లేదు. ఇతరులు మనల్ని గేళి చేసారు, చేస్తున్నారు, చేస్తారు, వదిలేసారు.

చీ, మీరు మీ బతుకు వేస్ట్, మీకు మాలాగా 1. వీసా, ఆస్తి, పదవి, లేదా ఇంకో దానికి, మానసిక బలహీనతతో అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వముతో, ఆత్మ ను అమ్ముకుని భాగస్వామి తో 3 చెరువులు నీళ్ళు తాగడం/ తాగించడం రాదు, 2. మేము చేసే పాపమే కాకుండా, మనసు లేని బండ సంతానం తో కూడా పాపాలు చేయించి ఇతరుల బిడ్డలకు కన్నీళ్ళు తెప్పించి, అదంతా మా అకౌంట్ లో వేయించుకోవడం రాదు, 3. మాలాగా ముదుసలి అమ్మ అయ్యను అత్త మామను సమాన వైద్య సౌకర్యాలు ఇవ్వకుండా దూరంగా వదలడం రాదు, 4. మాలాగా ఇన్నాళ్ళు పెంచి పోషించిన మా సొంత నిరుపయోగ బిడ్డలచే మా ముదుసలి తనం లో చీత్కరించబడి దూరంగా ఉంచడం చేతకాదు, 5. మాలాగా మోసపు సంపాదన ఆస్తులు ధనాన్ని, మా రోగాలకు అనారోగ్యపు అలవాట్లకు వాడుకోవడం చేతకాదు, 6. ఇతరులకు తలవంచి, ఆత్మను చంపుకుని, మాలాగా మితిమీరి అప్పులు చేసి ఆస్తులను పెంచి, ఇతరులది వడ్డీలకు దోచి, కబ్జాలు చేసి, పప్పుకూడు తినడం చేతకాదు, 7. రెండు నాల్కలు కపట నటన నక్క పాము పులి బుద్ది మాలాగా చేతకాదు, 8. మాలాగా దినదిన గండం అశాంతితో బతకడం చేతకాదు, అని ఎన్నో విధాలుగా మనల్ని గేళి చేసారు, చేస్తున్నారు, చేస్తారు 100 కి 75 మంది రజో తమో గుణ సంపన్నులు, ప్రాపంచిక మోహ దాసులు.

అవన్నీ మనకు వారి దీవెనలు, మన గుణ సాత్వికతకు, దేవుడు ముందు సాక్ష్యాలు. తప్పు ఎవరిదీ లేదు కదా, ఎవరినీ మనము నిందించము కదా? చిరునవ్వుతో ఆ గురువు లకు తలవంచి నమస్కరిస్తాము, వారు జ్ఞానులు వారి భవిష్యత్ వారి కుటుంబ వంస భవిష్యత్ వారికి తెలుసు. అయినా, వారి బాగు కోరుతూ, మనము ఎన్నో మానసిక చైతన్య సందేశాలు పంపాము. మన బాధలు, బాధ్యతలు, కష్టాలు, నష్టాలు, కర్మ ఫలితాలు, సాధన మానసిక నియంత్రణ బలం మనవే.

మనకు బారుకు ఆదాయమే ఉంటే, మీరు ఇంకొకరిని అడగాల్సిన పని అసలు ఉందా? మన్నించాలి. అంతా మనమే అండగా ఉండమా. అందుకే సంస్కార పిల్లలు బాగా చదివితే, ఎటూ మనం ఉన్నాము అనే కదా, ఏళ్ళుగా మంచి చెడు చెపుతూ ఉండమన్నది. ఇకనుంచి అయినా, సాత్వికత సజీవ గురువు సేవ నమ్మకం ఉన్నవారితో, మంచి చెడు చిన్నది పెద్దది పంచుకుందాం, ఎప్పటికప్పుడు మనల్ని సరి చేసుకుని, సరైన మార్గములో ప్రయాణిద్దాము మనశ్శాంతితో సాత్విక గుణ సంపదతో.

ఆదాయం లేకపోయినా ఇవ్వలేదు అని కోపము వద్దు. ధనము చేబదులు ఇచ్చి, స్నేహితులను బంధువులను సొంతవారిని, పోగొట్టుకుంటున్నాము. అది తప్పు అని మీరు అంటే, మనము జవాబు వెంటనే చెప్పి తప్పు చేసామా అని ఇతరులు అనుకుంటారు? తప్పన్నా, మంచి చెడు అనుకోవాలి, చెప్పుకోవాలి, మనుషులు గా. స్నేహితులం అంటే అవసరాలకేనా? ఇదేనా, పిల్లలకు నేర్పే మంచి?

ఆదాయం లేదు కాబట్టి 3 ఏళ్ళు పైగా మాకు, ఇప్పుడు సహాయం చెయ్యలేము మన్నించాలి అన్నదాన్ని, మీరు తప్పు అన్నట్లు గా, మేము అనలేము కదా, 10 రోజుల తర్వాత ఇబ్బందులకు కారణం చెపుతాను అన్నా కూడా? గౌరవించాము.

అన్నా, అన్ని ఏళ్ళు ఆదాయం లేకుండా, ఎలా అంత అంత ఖర్చులు భరిస్తున్నావు, సజీవ గురువు సేవ చేసే మిమ్మల్నే దేవుడు ఇలా పరీక్షిస్తే రేపు మా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిస బతుకులు ఏమిటి, పెద్ద వయసు అమ్మ వైద్య సౌకర్యాలు ఇతర సౌకర్యాలు ఖర్చులు ఎలా భరిస్తున్నావు, అంత సహనం ఓర్పు ఎలా కొనసాగిస్తున్నావు చెయ్యి చాచకుండా అప్పుకు పోకుండా తాకట్టు పెట్టకుండా, కొండలు కరిగిపోవా, అని 3 ఏళ్ళు పైగా అడిగావా మనసుతో? అడగకపోవడం, తప్పు అని అన్నామా? లేదు, ఇతరులు ఎందుకు అడగుతారు?

అసలు మీరు ఏమి పని చేస్తున్నారో కూడా, గత ఏడాది గా చెప్పలేదు. పిల్లలు ఏమి చదువుతున్నారో కూడా చెప్పలేదు, ఈ మధ్యలో. ఎవరము అది తప్పు అనలేదు కదా, మన ఇష్టం, మనకు నమ్మకం ఉన్నవారితోనే చెపుతాం కదా. అందరికీ ఎందుకు చెపుతాం. ఎవరిదీ తప్పు లేదు.

మా ఇల్లు పాడుపడుతున్నది, వెళ్ళి చూడలేదు అని ఎవరినైనా అన్నామా? అంటామా? మన సమస్యలు బాధలు మనవి, ఇతరులను ఎందుకు నిందించాలి?

రేపు ఎవరిచేతన్నా ఇప్పించాక కూడా, ఇలాగే బై బై అని సంస్కార జవాబు లేకుండా వెళ్ళడం, తప్పు కదా?

సరెలే అన్నా, ఇకనుంచి సమాచార సంస్కార లోపం ఉండదు, ఇంకా ఎన్నో అవసరాలు వస్తాయి ముందు ముందు, మీరు అన్నట్లు సంస్కార పిల్లలకు, మంచి దోవ చాల పెద్ద విషయం. రేపు వారు అక్కడకు వచ్చినా, మీరే అండగా ఉండాలి, ఒకవేళ అక్కడ మీరు ఉంటే అప్పుడు, అని మంచి మనసుతో అనాలి అన్నా.

ఎందుకంటే, మనము ఒక అబ్బాయిని చూపించి ఇతను గుణవంతుడు అంటే రాముడు కింద, ఈమె గుణవంతురాలు అని చెపితే, సీతమ్మ కింద భావించే వారు చాలా మంది ఉన్నారు, మన మాట మీద అంత నమ్మకం - అది పెళ్ళి అయినా, ఉద్యోగం అయినా, ఇంకోటి అయినా. ఎప్పుడూ తొందరపడి గుణ గణాలు, వారి మనసు ఆలోచనల లోతు పాతులు స్తిరత్వం సంస్కారం తెలియకుండా, ఎవరినీ ఇతరులకు అందించలేదు, అందించము. మనము నమ్మకం విశ్వసనీయతను ఎప్పుడూ నిలబెట్టుకోవాలి. అపాత్రదానం, ఇరువురికీ చేటు మరువద్దు అని రాము సోముతో చెప్పెను.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,768; 104 తత్వాలు (Tatvaalu) and views 226,445
Dt : 11-Feb-2024, Upd Dt : 11-Feb-2024, Category : General
Views : 117 ( + More Social Media views ), Id : 2018 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : blessings , testimonies , meekness , God , fault , blame
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content