నేటి నిజ నీతి నియమము గల స్నేహితులు ను అడగండి - స్నేహం అంటే ఏమిటి అని? మరి ఏది నిజ స్నేహం? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,386; 104 తత్వాలు (Tatvaalu) and views 226,480.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నేటి నిజ నీతి నియమము గల స్నేహితులు ను అడగండి - స్నేహం అంటే ఏమిటి అని? మరి ఏది నిజ స్నేహం?

Ask todays true ethical friends - what is friendship? And what is the real friendship?

స్నేహితుల దినం వెళ్ళిపోయింది అనుకుంటా, నేటి నిజ నీతి నియమము గల స్నేహితులు ను అడగండి - స్నేహం అంటే ఏమిటి అని?

మనము మందు పొగ తాగుతూ, ఉదయం 7 తర్వాత నిద్ర లెగుస్తూ, మనుషులతో ఫోన్ చేసి మాట్లాడకుండా సోషల్ మీడియాలో చస్తూ కళ్ళు పోగొట్టుకుంటూ, బయట బిర్యాని సోడాలు చిప్స్ తిండి తిని ఆసుపత్రుల చుట్టూ, క్లబ్ లకు పేకాటకు సాని/పక్క కొంపలకు తిరుగుతూ, చెడిపోతూ, అప్పుల పాలు అవుతూ, పది మందిని మోసం చేస్తూ, ముదుసలి తల్లి దండ్రులను అత్త మామలును దూరంగ విడుస్తూ, పిల్లల సంస్కార పెంపకం వదిలేస్తూ, నక్క పాము పులికి ఓటేస్తూ, ఆవులను ఓడిస్తూ గేళి చేస్తూ, నాయక సినిమా వారి సోషల్ మీడియాలో రీల్స్ వీడియోలు బూతు బొమ్మలు కధల చెంచాగిరి చేస్తూ, ఉద్యోగ వ్యాపారాలలో మోసము చేస్తూ, రాష్ట్రం అప్పుల పాలు అవుతుంటే మాకు నష్టం లేదు అని, సిగ్గు మానం మర్యాద వాకుద్ది విశ్వసనీయత క్రుతజ్ఞత లేని, కపట నాటక 2 నాల్కల స్వార్ధ, యాంత్రిక బండరాయి మనసత్వం గల, మా మిత్రులతో కలసి పతనము అయ్యేదే, నమ్మక ద్రోహం దైవ ద్రోహం చేసేదే, నిజమైన స్నేహితం/ బంధుత్వం అని గర్వముగా నిజాయితీ గా చెపుతారు.

ఎవరినీ లెక్క చేయము అంటారు, అంటే వారి ఆత్మనే అవమానిస్తారు. ఇదే మాయ, ఇదే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం. ఏ మిత్రుడూ ఇంకో మిత్రుని బతుకు కోరడు, మంచి చెప్పడు, కేవలం అవసరం అవకాశం వెన్నుపోటు. వీడు దొంగ, వాడూ దొంగ, ఇంక ఎవరు ఎవరికి చెపుతారు?

వీరు ముదుసలి తల్లి దండ్రులకు, అత్తమామలకు, భాగస్వామికి వెన్నుపోటు, వారు అంతే. వీరి స్నేహ బంధం కలకాలం, వారు ఒకరికొకరు వెన్నుపోటు పొడుచుకున్నదాకా. అది ఎటూ జరుగుతుంది.

వార్తలలో చూసాము కదా, ప్రేమ/ ధనం/ ఆస్తి/ పదవి/ అందం/ అధికారం/ వీసా/ పౌరసత్వం కోసం భాగస్వామి పతనం/ విడాకులు - భర్త, భార్య, ప్రేయసి, ప్రియుడు, పిల్లలు/ తల్లి తండ్రులు, ఐపాయే.

కర్ణుడు ని, దుర్యోధనుని అడగండి, మీ నిజమైన స్నేహితులు ఎవరు అని? వారిద్దరే అంటారు, ఎందుకంటే ఇద్దరూ తోడు దొంగలు, అవసర అవకాశవాదులు. వారి ఇద్దరి నిజమైన మిత్రుడు, వారి బతుకు కోరిన వాడు, క్రిష్ణుడు. నిండు సభలో, ధైర్యముగా, వారి తప్పులు ఎత్తి చూపి, సరి చేసుకోమన్నారు. వినలేదు, నాశనం అయ్యారు, తమ చుట్టూ ఉండే అందరినీ నాశనం చేసారు.

రావణుని అడగండి, ఎవరు నిజమైన మిత్రులు అంటే, తమ్ముడు భార్యను చెరపట్టిన వాలి, అలాగే తన నీడలో మందు తాగుతూ, పది మంది తో తిరుగుతూ, రాజా నువ్వే దేవుడివి అనే వారు, నా మిత్రులు అంటారు.

సేం, మన ఓటరు, నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సినిమా వారి లాగా. ప్రజా పన్నుల పధకాలకు, మన కుటుంబ పేరు పెట్టకూడదు, రాష్ట్రం అప్పుల పాలు చేయకూడదు, నక్క పాము పులికి ఓటు వేయము, అని చెప్పే ధైర్యం ఒక్క సంస్కార హీనునికి లేదు.

ఇప్పుడు మనము అలాగే ఎంతో మందికి చెప్పినా, వారు వినరు, భవిష్యత్ వారికీ తెలుసు. ఆ తర్వాత గతం మరచి అంటారు, అయ్యో దేవుడు ఎందుకు మాకు ఇంత అన్యాయం చేశారు అని, లేదు అన్నాయ్ నీకు నువ్వు, నువ్వె నీ కుటుంబానికి అన్యాయం చేసావు, అంటే అహంకారం వినదు, పంచభూతాలు విడవవు, తమ సొంత వారితోనే కాలరాస్తాయి.

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వీడిన వారే, సజీవ గురువు సేవ చేసే వారే, మనకు దేవుళ్ళు, గురువులు, స్నేహితులు, శని రాహు కేతు గ్రహ ప్రభావం తగ్గించే వారు. మనకు వచ్చే జన్మలో కూడా, ఇవే లేదా ఇంత కన్నా ఎక్కువ సౌకర్యాలు లేదా మోక్షమునకు దారి చూపించే వారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,386; 104 తత్వాలు (Tatvaalu) and views 226,480
Dt : 08-Aug-2023, Upd Dt : 08-Aug-2023, Category : General
Views : 432 ( + More Social Media views ), Id : 1869 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : true , ethical , friends , friendship , ravana , duryodhana , vali , krishna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content