భక్త తుకారాం - ఓ అభినవ సౌందర్యరాశీ, చిందులు వేయకురా, ఉన్నామా అసలున్నామా - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1491 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1526 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

భక్త తుకారాం జీవితకాలం 1608 నుండి 1649 వరకు. మహారాష్ట్ర పూనేలోని దేహూ అనే గ్రామంలో జన్మించారు. విఠోబా (పాండురంగడు)ను పూజించే వారు. శివాజీ ఇవ్వజూపిన సంపదను తుకారాం నిరాకరించాడంటారు. శివాజీ గురువైన రామదాసును కూడా, తుకారాం శివాజీకి పరిచయం చేశాడంటారు, భగవత్ సాక్షాత్కారం కోసం పట్టుదలతో దీక్ష సాగించారు.

చివరికి పండరీపురం చేరారు. వారు రచించిన భక్తి గీతాలను అభంగాలు అంటారు. మానవసేవయే మాధవసేవ అని భావించిన మహనీయుడు తుకారాం. తుకారం తన జీవితంలో ఎక్కువ భాగంలో దేహూ గ్రామంలోనే నివసించారు. ఇది మహారాష్ట్రలోని పూనాకు దగ్గర్లోని చిన్న పట్టణం.

తుకారాం చే చెప్పబడిన కొన్ని సూక్తులు
* సాధువులు దీపావళి, దసరా పండుగలలో మన ఇండ్లకు వస్తారు. వారి రాక వైకుంఠం కలివచ్చినట్లే వుంటుంది.
* మనసుకు కొంచెం దైవభక్తి రుచి గనుక చూపిస్తే, అది దానిని ఇంక వదలనే వదలదు.
* విగ్రహాన్ని మనస్సులో ప్రతిష్టించు, మానసిక నైవేద్యం పెట్టు, అది అక్కడే పూజలందుకుంటుంది.
* దశరథ పుత్రుడు రాముడు మొన్నటివాడు కాగా, మనలో ఉన్న ఆత్మారాముడు శాశ్వతుడు.

భక్త తుకారాం లో అన్ని మాటలు పాటలు, హ్రుదయాన్ని కదిలించే, కమనీయ ఆధ్యాత్మిక రసామ్రుత గీతాలు, మన నిత్య జీవిత సత్యాలు. అరిషడ్వర్గాలను జయించే మాట, భగవంతుని కీర్తించే పాట, మనదైనా సినిమాదైనా ఎవరిదైనా, దాని పరమార్ధం మన మనసుకు ఎక్కాలి, మన ఆచరణలో చూపాలి.

భక్తాగ్రేసరులు తుకారాం తన నిత్య జీవితములో అవి ఆచరించి చూపించారు. విఠ్ఠలుని ప్రసన్నం చేసుకున్నారు, తన మాటలు చేతలు పాటలతో, ప్రజలందరికీ ముక్తి దారి చూపించారు, తప్పుడు వారి కళ్ళు తెరిపించారు.

ఎదురుగా పాయసాన్ని ఎంత సేపు చూసినా, మన నాలికకు రుచి తెలియదు, కడుపు నిండదు.

అలాగే దేవుని గుడులు తీర్ధాలు ఎన్ని తిరిగి, ఎన్ని బయట పూజలు చేసినా, ఎన్ని సార్లు ఊరికే జపించినా, దేవుడు అక్కడ మాత్రమే ఉన్నాడు అనుకుని, మన మనసులో నిలపడం మానేసి, చుటూ మనుషులలో చూడడం ఆపేసి, నిత్య ఆచరణలో ఆ దేవుని గుణగణాలను మన పనులలో చూపించలేక పోతే, మానసిక ఆధ్యాత్మికత ఏనాటికీ సిద్దించదు, 100 జన్మలు ఎత్తి ఎన్ని కష్టాలు పడినా, కన్నీళ్ళు నిండినా.

చూడండి, కోరి వచ్చిన సౌందర్య రాశిని, వాస్తవాన్ని భవిష్యత్తును తెలిపి, ప్రాపంచిక మోహ మాయను వదిలించి, ఆధ్యాత్మిక దైవ సేవ వైపు ఎలా తిప్పారో. నువ్వు అనుకునే ఈ సొగసు, కొన్ని రోజులే, ఆ తర్వాత, అవి దూది పింజలు, దివ్వెల పోలిక, వాడి న వక్కలు, తోలు తిత్తులు, వడ వడ వణికే వంగిపోయిన శరీరము అని స్పష్టముగా గుర్తు చేసారు.

ఈ రోజు మన చుట్టూ ఉండే, ఎంతో మంది, అరిషడ్వర్గాల బానిసలకు, బాబాయి అనుచరులకు, మొదటి నెలలో కొత్త సినిమా ఖర్చుతో లేదా ఆసక్తితో తప్పక చూడాలి అనుకునే మోహాంధులకు, ప్రజలను దోచుకునే నాయకులకు, ఓటును అమ్ముకునే దౌర్భాగ్యులకు, పిల్లలకు సంస్కారం నేర్పలేని పెద్దలకు, ముదుసలి తల్లిదండ్రులను ఒంటరిగా వదిలే క్రుతగ్నులకు విశ్వాసఘాతకులకు, కళ్ళు తెరిపించే మాటలు ఇవి -

తానెవరో తెలుసుకొని, తన తప్పులు ఒప్పుకొని, తన బాధ్యత గ్రహించువాడే, జ్ఞాని విజ్ఞాని. విత్తముపై ఆశలు విడచి, చిత్తములో రంగని కొలిచి, పరమార్ధం గ్రహించరా, తత్వము తెలిసి తరించరా అని ఎంత బాగా చెప్పారో?

సినిమాలో దేవుడిని ప్రశ్నిస్తూ అసలు పాట ఉన్నావా, అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా, ఈ లోకం కుళ్ళు చూడకున్నవా అని పాడారు.

కానీ అది తప్పు, ముందు మనల్ని మన బుద్దిని మన సంస్కారాన్ని మనము ప్రశ్నించుకోవాలి ఇలా - ఉన్నానా, అసలున్నానా, ఉంటే కళ్ళుమూసుకున్నానా, ఈ లోకం కుళ్ళు చూడకున్నానా. సినిమాలో దేవుడిని ప్రశ్నిస్తూ అసలు పాటకు, లోకములో మనిషిని, అసలు స్వరూపాన్ని, ప్రశ్నిస్తూ కనువిప్పు కలిగించే, మన మార్పుల పాట ను వినండి మీరూ పాడండి.

1) పూజకు వేళాయెరా పాటలో భాగము

ఓ అభినవ సౌందర్యరా..శీ
ఓ అపూ.ర్వ చాతుర్యమూర్తీ..
నీ కటాక్షముల లాలనమ్ములో, నీ మధురాధర చుంబనమ్ములో 2
మధురిమలెన్నో పొదుగుకున్న, నీ స్తన్య సుధల ఆస్వాదనమ్ములో
అప్రమేయ దివ్యానందాలను అందించే నీ చల్లని ఒడిలో
హాయిగా నిదురించ గలిగే, పాపగా, నీ కడుపున జన్మించు భాగ్యమే
లేదాయె తల్లీ… తల్లీ… తల్లీ…

స్వామీ…అవునమ్మా నీవు ప్రదర్శించిన సౌందర్యం అనిత్యం
నీవు నమ్ముకున్న యవ్వనం అశాశ్వతం

దువ్వుకున్న ఆ నీలిముంగురులె, దూదిపింజలై పోవునులే
నవ్వుతున్న ఆ కంటి వెలుగులే, దివ్వెల పోలిక ఆరునులే
వన్నెలొలుకు ఆ చిగురు పెదవులే, వాడి వక్కలై పోవునులే
పాలుపొంగు ఆ కలశాలే, తోలుతిత్తులై పోవునులే
నడుము వంగగా, నీ ఒడలు కుంగగా 2
నడువలేని నీ బడుగు జీవితం, వడవడ వణకునులే
ఆశలు రేపే, సుందర దేహము, అస్థిపంజరంబౌవ్వునులే

స్వామి మన్నించండి అందగత్తెననే అహంకారంతో
మిమ్మల్ని అపకీర్తి పాలు చెయ్యాలని ప్రయత్నించాను
మిమ్మల్ని ఓడించాలనుకొని నేనోడిపోయాను
మీరు నా హృదయంలోని చీకటి తెరలను తొలగించారు
పోరలుకమ్మిన నా కళ్ళు తెరిపించారు
స్వామి ఇక మీరే నాకు శరణ్యం ఈ నరకకూపం నుండి తప్పించి
నాకు వెలుగుబాట చూపించండి

మహిన పతిత పావనుడైన ఆ పాండు రంగడే మనందరికీ శరణ్యం
ఆ దేవ దేవుని సేవించి తరించు

పాండురంగ హరి జైజై పాండురంగ హరి (5)
విఠల విఠల పాండురంగ (4)

2)శ్రీ పాండురంగ విఠల్ కి జై
జై జై విఠల్ పాండురంగా విఠల్ విఠల్ పాండురంగ (5)
ఓ నరుడా… పామరుడా…
చిందులు వేయకురా, ఆ… చిందులు వేయకురా, చిందులు వేయకురా ...
శ్రీరంగ నీతులు చెప్పకురా 2
తెలిసీ తెలియని అజ్ఞానముతో . . 2
ప్రజలను వంచన చేయకురా 2 ||చిందులు వేయకురా||

తనకంతా తెలుసునని తన మాటే వేదమని 2
తానే ఒక ఘనుడని తలచే నరుడు, వానరుడు, పామరుడు

ఆ ఆ… తానెవరో తెలుసుకొని…
తన తప్పులు ఒప్పుకొని…
తన బాధ్యత గ్రహించువాడే జ్ఞాని విజ్ఞాని

విత్తముపై ఆశలు విడచి, చిత్తములో రంగని కొలిచి 2
పరమార్ధం గ్రహించరా, తత్వము తెలిసి తరించరా ||చిందులు వేయకురా||

3) సినిమాలో దేవుడిని ప్రశ్నిస్తూ అసలు పాట

ఉన్నావా… అసలున్నావా
ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా

ఉన్నావా… అసలున్నావా
ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా

ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు
ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు
ఉన్నావా… అసలున్నావా

నీ పేరిట వంచన పెరుగుతువుంటే… నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే
మనిషిని మనిషి దోస్తూవుంటే… మంచికి సమాధి కడుతూ వుంటే
రాతి బొమ్మవై నిలిచావు.. చాతగాని వాడనిపించావు
ఉన్నావా… అసలున్నావా

నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను 2
సేవలు చేశాను.. నా బ్రతుకే నైవేద్యం చేశాను
చేసిన మేలునుమరిచేవాడా.. నువ్వా దేవుడివి.. నువ్వొక వ్యర్థుడివి
నీకొక పేరూ లేదు.. రూపం లేదు ..
నీతి లేదు.. నియమం లేదు.. నిజానికి నువ్వే లేవు.. లేవు.. లేవు.. లేవు

- - -
సినిమాలో దేవుడిని ప్రశ్నిస్తూ అసలు పాటకు, లోకములో మనిషిని అసలు స్వరూపాన్ని ప్రశ్నిస్తూ కనువిప్పు పాట. అరిషడ్వర్గాలకు మరియు అష్ట వ్యసనాల బానిసలకు అంటే జీవచ్చవాలకు ఈ పాట -

ఉన్నామా… అసలున్నామా
ఉంటే కళ్ళుమూసుకున్నామా… ఈ లోకం కుళ్ళు ఆపకున్నామా - 2 ఒళ్ళు తెలియకున్నామా

ఉన్నామని, మేల్కొన్నామని, మున్నెందరెందరో అన్నారు
ఉన్నామని, మంచిచేస్తామని, నమ్మి ఎందరో ఉన్నారు
ఉన్నామా… అసలున్నామా

మంచి పేరిట వంచన పెరుగుతువుంటే… మన ఎదుటే హింసలు జరుగుతు వుంటే
మనిషిని మనిషి దోస్తూవుంటే… మంచికి సమాధి కడుతూ వుంటే
రాతి బొమ్మలై నిలిచామా.. చాతగాని వారనిపించామా
ఉన్నామా… అసలున్నామా

వ్యసనాల బానిస లయ్యాము.. నిత్య దరిద్రులమయ్యాము 2
సేవలు మరచాము.. మన బ్రతుకే పూర్తిస్వార్ధం చేశాము
చేసిన మేలుమరిచేవాళ్ళం.. మనమా మనుషులం.. మనమొక వ్యర్థులం
మనకొక తీరూ లేదు.. త్యాగం లేదు ..
నీతి లేదు.. నియమం లేదు.. నిజానికి మనమే లేము.. లేము.. లేము.. లేము

ఉన్నామా… అసలున్నామా
ఉండీ జీవచ్చవాలమయ్యామా … ఈ లోకం కుళ్ళు ఆపకున్నామా - 2 ఒళ్ళు తెలియకున్నామా

చిత్రం: భక్త తుకారాం (1973), సంగీతం: పి. ఆదినారాయణరావు, సాహిత్యం: వీటూరి
గానం: ఘంటసాల

రాందాస్ లేదా గతంలో నారాయణ్, 1608 లో రామ నవమి సందర్భంగా, ప్రస్తుత మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని జాంబ్ అనే, గ్రామంలో జన్మించారు. మన రామదాసు, కంచెర్ల గోపన్న, వేరు కదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1526 General Articles, 51 Tatvaalu
Dt : 25-Jul-2022, Upd Dt : 25-Jul-2022, Category : Songs
Views : 89 ( + More Social Media views ), Id : 1474 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : bhakta , tukaram , abhinava , soundaryarasi , chindulu , veyakura , unnava , asalunnava , akkineni , anjali , shivaji
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content