పాటతో పరమార్ధం- భక్త తుకారాం - భలే భలే అందాలు సృష్టించావు - ANR, అంజలి, శివాజీ గణేశన్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,696; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Bhakta Tukaram - Bhale Bhale Andalu - ANR, Anjali, Sivaji Ganesan

సౌందర్యముగా ఈ లోకాన్ని సృష్టించిన ఓ భగవంతుడా, ఏల మరచావు ఈ మానవ జాతిని, దయ లేకుండా అంటున్నారు. మన చేతగాని తనం, మన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం కు కూడా, దేవుడిని నిందించడమేనా?

భలే భలే అందాలు సృష్టించావు, అలా అందరినీ మురిపించావు, మరి అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో నీతి నియమాలు లేని మానవులము, మాకేల ఈయవు అన్నారు. ఆ ఆనందం మనమేల ఉంచుకోలేక పరుగులు తీస్తున్నాము కోరికలతో అని మాత్రము అనుకోము, తెలివైన మూర్ఖులము.

అడవిలో నివసించే, ఆ మాటలు రాని క్రూర మృగాలు సైతం, మంచిగ కలసి జీవించేను, కానీ నగరాలు గ్రామాలలో అతి తెలివి మాటలు నేర్చిన మా నరజాతి, నిత్యం మనసులో కుటుంబములో పార్టీలో సంఘములో సమాజములో మారణహోమం సాగించేను.

సాంకేతికముగా మనిషే పెరిగి, విపరీతమైన తిండి లావు బరువు భోగాల్ రోగాల తో కూడా ఎదిగి, మానవత్వం ఉన్న మనసే తరిగి, ఆత్మజ్ఞానం తో పాటుగా, సొంత ముదుసలి తల్లి దండ్రులు అత్త మామల మీద, సంస్కార పిల్లల పెంపకం మీద, గుణ పెళ్ళి భాగస్వామి మీద, మమతే మరచాడు మానవుడు, నీవేల మార్చవు అని అడుగుతున్నారు, ఎందుకంటే మనము ఎటూ మానసిక బలహీనులం అని నిర్ణయం చేసి.

ప్రక్రుతిలో చల్లగ సాగే సెలయేటి ఓలే, మన అందరి మనసే నిర్మలమై వికసించాలి, కనీసం సొంత ముదుసలి తల్లి దండ్రులకు అత్త మామలకు సమాన వైద్యం ఇద్దాము అని, సొంత పిల్లలకు సంస్కారం నేర్పుకుందామని, ఇంగిత జ్ఞానం రావాలి. ఆకాశం లో గుంపుగ ఎగిరే, గువ్వల ఓలే, అందరు ఒక్కటై నివసించాలి.

ప్రతి వ్యక్తి తమ స్వార్ధం మానుకొని, అందరితో సమతే పెంచుకొని, మంచిగ మానవుడే, మాధవుడై, మహిలోన నిలవాలి అని కోరుకుందాము, ఈ పాట మనసున్న ప్రతి వారు పాడుతూ, అందరితో పంచుకుంటారు కదూ.

ఆ... నందన వనముగ, ఈ.. లోకమునే సృష్టించిన
ఓ... వనమాలి., మరచితివో..., మానవజాతిని దయమా.లి..

భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు
అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేల ఈయవు
భలే భలే అందాలు సృష్టించావు...

మాటలు రా.ని మృగాలు సై.తం.., మంచిగ కలసి జీవించేను
మాటలు నేర్చిన మా నరజా.తి.., మారణహోమం సాగించేను
మనిషే పెరిగి.. మనసే తరిగి.. 2
మమతే మరచాడు మానవుడు, నీ.వే.ల మార్చవు. ||భలే భలే అందాలు||

ఆ...ఆ... ఆ... ఆ...ఆ..ఆ..
చల్లగ సాగే సెలయేటి ఓలే.., మనసే నిర్మలమై వికసించాలి
గుంపుగ ఎగిరే. గువ్వల ఓలే.., అందరు ఒక్కటై నివసించాలి
స్వార్ధం మానుకొని., సమతే పెంచుకొని..2
మంచిగ మానవుడే, మాధవుడై, మహిలోన నిలవాలి ||భలే భలే అందాలు||

చిత్రం : భక్త తుకారాం (1973); సంగీతం : ఆదినారాయణరావు; గీతరచయిత : వీటూరి
నేపధ్య గానం : ఘంటసాల  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,696; 104 తత్వాలు (Tatvaalu) and views 226,444
Dt : 05-Feb-2024, Upd Dt : 05-Feb-2024, Category : Songs
Views : 142 ( + More Social Media views ), Id : 2004 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bhakta , Tukaram , Bhale , Andalu , ANR , Anjali , Sivaji , Ganesan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content