లోకేశన్న- 23 స్థానాలు, ఆత్మ విమర్శ చేసామా? జగనన్న ను దింపడానికి, ధర్మ ఆయుధం? చంద్రన్న బయటకు? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1943 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1978 General Articles and views 1,672,746; 102 తత్వాలు (Tatvaalu) and views 207,293.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*చంద్రన్న/ లోకేశన్న - 23 స్థానాలు ఎందుకు, ఆత్మవిమర్శ చేసామా? జగనన్న ను దింపడానికి, మన దగ్గర ఉన్న, ధర్మ ఆయుధం ఏమిటి? చంద్రన్న బయటకు వస్తారా?*

*Chandrananna/ Lokesanna - Why 23 positions, did we self-criticize? What is the Dharma weapon we have to bring down Jagannana? Will Chandranna come out?*

1* మా పెద్దాడు బీజేపీ, 2వ వాడు తెదేపా, 3 వ వాడు వైసీపీ, 4 వ చిన్నోడు జనసేన. అందరూ మా (మన) పిల్లలే. అందరికీ మన దీవెనలు కావాలి, అలాగే మనము బుద్ది కూడా చెప్పాలి. వింటారా వినరా, వారి ఖర్మ. మనము వాళ్ళ ఇంట్లో ఉండం, వారితో తిరగం. పెళ్ళిళ్ళు అయ్యి వారి వేరు కాపురాలు, కాబట్టి వారి పాపాలతో పుణ్యాలతో, మాకు సంబంధం లేదు.

మా పిల్లలు 4 గురు చేసే తప్పుడు వాటిని సమర్ధించము, 4 గురు చేసే మంచిని పొగుడుతాము. కాబట్టి అన్ని పార్టీలకు/ నాయకులకు, కొన్ని సార్లు అధికారులకు, మన సందేశాలు 5 ఏళ్ళు గా వెళుతున్నాయి.

అయితే, ఒక్కరు కూడా, మనల్ని వ్యక్తి గతము గా, తిట్టలేదు. వీలైతే పెంపక సంస్కారం ఉన్న వారు, జవాబు/ శుభాకాంక్షలు చెప్పారు. కొంత మంది మంచి వినలేక, తట్టుకోలేక, దూరము అయ్యారు.

క్రుష్ణుని మాటలు అంటే, దుర్యోధనునికి ఒళ్ళు మంట. అలాగే హనుమంతుని మాటలు అంటే, రావణునికి అమిత కోపం. తెలుసు కదా, అలాగే వీరికి మంచి చేయడం, వినడం, ప్రోత్సహించడం, స్పందించడం అంటే ఇబ్బంది. రేపు వారి పిల్లలే బుద్ది చెపుతారు.

2* అధికార మదం నెత్తిన ఎక్కితే, ఇంట్లో మన సొంత పిల్లలకైనా, బుద్ది చెప్పకపోతే, భస్మాసురులు గా, మన సొంత ఇంటిని, అంటే మనల్నే నిర్దాక్షిణ్యముగా పాతేస్తారు.

చూసాము కదా, ఏళ్ళ క్రితం ఓ కధ చదివాము గుర్తు ఉందా, ఒక్కొక్కరికి 20 కోట్లు అన్నదమ్ములకు, వారి తండ్రి ఇస్తే, ఒక పిల్లాడు పోతే, 2 వ పిల్లాడు కోడలు ఇంటి బయట షెడ్ లో నిర్ధాక్షిణ్యముగా పడేసి, కనీసం అన్నం పెట్టకుండా, సొంత తల్లి దండ్రులను కడుపు కాల్చి చంపారు.

అంటే ఏమిటి నీతి? విలువలు నేర్పకుండా, ధనం/ పదవి/ అధికారం ఇస్తే, మనల్నే కాటేస్తారు. ఇంటి భస్మాసురులను, ఈశుడైనా పట్టుకోలేడు సుమా, వ్యామోహం లో ఉంటే. అందుకే, బంధం కన్నా ధర్మం ముఖ్యం.

3* చంద్రన్న/ లోకేశన్న - ముందుగా మనకు కష్ట కాలం నడుస్తున్నది, పెద్దాయన జైలు మాకు బాధగానే ఉంది. ఇవన్నీ ముందుగానే ఊహించి, ఎన్నో జాగ్రత్తలు 2019 నుంచి చెప్పాము. మన 2 వ శ్రేణి వాళ్ళు, అందరూ జైలు కు వెళ్ళి వచ్చారు. ఇప్పుడు అసలు నాయకుల వంతు. మన వైపు మంచి ఉంటే, తప్పకుండా, న్యాయం జరుగుతుంది. అన్యాయం ఉంటే, శిక్షణ తప్పించుకోలేము.

మనల్ని మనము సరి చేసుకుందాము, తప్పులు ఒప్పుకుందాము, ఆత్మ శుద్ది చేసుకుందాము, భవిష్యత ఘోర శిక్షణ తప్పించుకుందాము.

4* జనం మనకు 23 స్థానాలు ఎందుకు, ఆత్మవిమర్శ చేసామా? మీ చుట్టు ఉండే కోటరి జవాబు ఏమిటి? జగనన్న బలం అనా? జనం మాయలో పడ్డారు అనా? తూచ్, అదంతా అబద్దము.

వారు మీకు నిజాలు ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే, నిజాలు చెపితే, మీరు వారిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తారు, వారి ఆదాయం ఆగిపోతుంది. అవే అబద్దాలు, ఇప్పుడు మనల్ని కోలుకోకుండా ముంచేసాయి. మన మిత్రుడు, మనల్ని దైవిక కారణాలతో విమర్శ చేసేవాడు మాత్రమే, సుమా. వ్యామోహములో మనల్ని పొగిడేవాడు, మనకు శత్రువు.

5* మనకు 23 రావడానికి, ప్రధాన కారణం, మన పసుపు మీడియా, అలాగే పసుపు గుంపు/ మంద ఉన్మాదం. కులం/ వర్గం కాదు సుమా, కేవలము మీ చుట్టూ తిరుగుతూ అబద్దాలు అవసరాలు అవకాశాలతో మీ నాశనం కోరుకునే, మీరు నమ్మే మీ శ్రేయోభిలాషులు - అన్ని వర్గాల వారు ఉన్నారు. వీరు ఎప్పుడూ నిజము చెప్పరు. తప్పుని సమర్ధన చేస్తారు, ఒప్పును అంగీకరించరు.

తాగుబోతులు, తిరుగుబోతులు, వెన్నుపోటు దారులు అంతా, ఒక చోటికే చేరుతారు, ఆప్త మిత్రులు లా. వీరికి నీతి నియమం జాలి దయ క్రుతజ్ఞత విశ్వసనీయత పాపభీతి ఉండదు - ధనం/ అధికారం/ పదవి/ అహంకారం/ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం.

ఇప్పుడు బులుగు మీడియా/ గుంపు ఉన్మాదం కూడా, జగనన్న కు అదే దౌర్భాగ్య పరిస్తితి తెచ్చే ప్రయత్నములో, విపరీతమైన బిజీలో ఉంది.

6* పసుపు మీడియా/ గుంపు ఎంత దిగజారి పోయారు అంటే. వీరు, తన మానాన తాను సినిమాలు చేసుకునే, రామన్నను తెచ్చి పైన కూర్చోబెట్టారు. వారి విలువ తగ్గగానే, చంద్రన్న ను పైన కూర్చో బెట్టి, నిర్ధాక్షిణ్యముగా మన వాడైన రామన్న ను పిచ్చి వాడిగా ముద్ర వేసి, తెలుగు రాజ్యం అలాగే ప్రపంచం అంతా, పేపర్ల లో ప్రచారం చేసారు.

అంటే, మనవాడైనా కూడా కరుణించి వదలరు వీరు, ఇక బయట వారి సంగతి చెప్పక్కరలేదు, కేవలం వారి స్వార్ధం మాత్రమే ముఖ్యం. కానీ ఎంత కాలం వీరి ఆటలు సాగుతాయి? అదుగో, మన 3 వ వాడు వైసీపీ వచ్చేంత కాలం.

7* గతము లో కూడా, మీకు కధనం పంపాము. మీరు స్పందించరు, సరి చేసుకోరు. తర్వాత, పంచభూతాల శిక్షణకు వెళతారు అని, 2019 లోనే చెప్పాము ఎన్నికలకు ముందు. కానీ మీరు లెక్క చేయరు, పెడ చెవిన పెడతారు. అదేమంటే మా బ్రీడ్ వేరు అంటారు. అందుకే జనం మిమ్మల్ని దూరంగా పెట్టారు, నమ్మలేక పోతున్నారు.

రేపు జనం నమ్మినా గెలిపించినా, మరలా మీకు కూడా, చంద్రన్న లాగనే ఇబ్బందులు తప్పవు. కానీ జనం మిమ్మల్ని నమ్మకుండా చేయడానికి, పసుపు మీడియా/ గుంపు తగిన జాగ్రత్తలు తీసుకుంది. వారు ఏదైతే మీ గురించి, జనానికి మంచి చెపుతారో, ప్రజలు దానిని వ్యతిరేక అర్ధములో తీసుకుంటున్నారు.

8* రామన్న, శాపాలు మీ వెంట పడుతున్నాయి, మరువద్దు. మీరు మారతారు అని పంచభూతాలు ఎదురు చూసాయి. కానీ మీరు మారరు అని అర్ధం అయ్యాక, జగనన్న రూపములో, పైన పెద్దల రూపములో, తమ శిక్షణ అమలు జరుపుతున్నాయి.

అదే అందరికీ మేము మొత్తు కునేది రోజూ, శిక్షణ ముందు, మంచి మాటలతో మారండి. శిక్షణ మొదలు అయ్యాక, మేము, దేవుడు, పూజలు, యాత్రలు, యాగాలు ఏవీ ఆపలేవు. యుద్దములో పోయే ముందు, కర్ణుడు, భీష్ముడు బాధపడి, క్రిష్ణుడు కాళ్ళ పై పడితే, వారి పతనం క్రిష్ణుడు ఆపుతారా, ఆపగలరా?

9* ఉత్తమ కొడుకు గా, మీ తండ్రిని సరి చేసే ప్రయత్నము, ఎప్పుడైనా చేసారా? తండ్రి పాపాలు, బిడ్డలు భరించాలి, అలాగే బిడ్డల పాపాలు తల్లి దండ్రులు భరించాలి. అలాగే సంస్కార బిడ్డలు, తండ్రి తప్పులను సరి చేయాలి. ప్రహ్లాద చరిత్ర చదవండి.

మీరు కనీసం, ప్రజా క్షేత్రము లో గెలవకుండా, ఎమ్మెల్సీ అలాగే మంత్రి పదవి తీసుకోలేను అని ఒక నాయకుడు గా చెప్పలెదే? ఇదేనా సరైన సంస్కార యువ నాయకత్వ లక్షణము?

మేము స్పష్టముగా చెప్పాము ఇలా బహిరంగముగా చెప్పమని, పంచభూతాలను శాంత పరచడానికి ఏళ్ళ క్రితం - మామ గారు, తెలిసో తెలీకో ఆనాడు మోహము లో చేయకూడని తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, ఇక నుంచి అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాం అని కన్నీళ్ళు పెట్టుకుని, ప్రజల ముందు, మన రామన్నను వేడుకోండి అన్నాము.

మీరు చంద్రన్నతో చెప్పించారా? ఇకనైనా చెప్పిస్తారా? తండ్రి లాంటి సొంత మామకు, క్షమాపణ చెపితే, మన బుద్దులు మారితే, నష్టం ఏముంది మనకు? ఎందుకు మీ నాయకులు అది మీకు నచ్చ చెప్పరు?

జగనన్న, మన రామన్నకు ఆత్మకు మనశ్శాంతిని ఇచ్చారు అంటే, మీరు నమ్మరు. కానీ రామన్న భక్తులు నమ్ముతారు. ఇది చారిత్రక వాస్తవం.

10* చంద్రన్న జైలు గురించి, కోర్టు ఒప్పుకోక ముందు, జగనన్న ను తిట్టారు. కోర్టు అంగీకరించాక, మోడీని తిడుతున్నారు. ఆ పసుపు మీడియా/ మంద ను, నోరు మూసుకోమని చెపుతారా? వీరు ఎంత గందర గోళం స్రుష్టిస్తూ, ధర్నాలు చేస్తారో, అది పెద్దాయనకు, అంత తల నొప్పి ఇబ్బంది అవుతుంది, మరువద్దు. మన ఒప్పులు చెప్పకుండా, జగన్ తప్పులు మనకు ఎందుకు ఇప్పుడు?

ఇంకా అన్ని పక్కల, ఎన్నో కేసులతో మలుపులతో, బిగుసుకుపోతుంది, ఊపిరి ఆడదు, ఇంకా నష్టం కలుగుతుంది. మనము ఎలాగ వ్యవస్తలను మేనేజ్ చేసామో ఇన్నాళ్ళు, ఇప్పుడు ఇతరులు కూడా, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అని, అవే రుచులు మీకు చూపబోతున్నారు.

చెరపకురా చెడేవు అంటే, ఇదే సుమా. మనము వెన్నుపోటు కరెక్టే అంటే, అంత కన్నా ఘోరాలు కూడా కరెక్టే అని, తర్వాత తరం అంటుంది. అందుకే ఎంత ఎదిగినా, ఒదిగి ఉండమనేది.

11* తాగుబోతులు 10 మంది కలసి, మందు విందు చిందు పొందు చేసుకుంటుంటే, పసి వారు వస్తే, తప్పు నాయనా ఇటు రావద్దు చెడిపోతావు అని, వారిని దూరముగా పంపాలి. అది కనీస సంస్కారం.

తెలీక, పవనన్న మన ఇంటికి వచ్చి మీతో కలుస్తాను అన్నా కూడా, మనము ఏమి చెప్పాలి? పవన్ మీ దోవ వేరు, మా దోవ వేరు, మావి మీరు నేర్చుకుంటే, చాలా నష్టపోతారు అని మర్యాదగా చెప్పి పంపించాలి.

మనతో కలుపుకుంటే, మనకు ఉన్న 100 పాపాలు కాకుండా, వారిని చెడగొట్టి వెన్నుపోటు పొడిచిన ఇంకో 100 పాపాలు వస్తాయి. ఎందుకు మనకు ఆ కొత్త తలనొప్పి?

చంద్రన్న కోసం ఇంత మంది ధర్నాలు చేస్తున్నారు దేశం లో విదేశాల లో కదా, వారి అండతో గెలవలేమా? మామ ఫోటో చాలదా? అంటే ఇవన్నీ ఉత్తుత్తి పెయిడ్ ధర్నాలు అని అంగీకరిద్దామా? మరి ఇంకొకరి అండ మనకెందుకు?

12* మీ పుట్టుక గురించి, ఇతరులు ఎన్ని విధాలు గా ప్రయత్నం చేస్తే మీరు ఎంత బాధపడ్డారో తెలుసు. కానీ, అసలు వ్యక్తి గత దూషణ, ఈ దరిద్రపు స్తాయికి తెచ్చిన ఘనత, చంద్రన్నదే అంటే, మీరు ఒప్పుకుంటారా?

పవనన్న వ్యక్తిగత పెళ్ళిళ్ళ మీద లేదా లక్ష్మీ పార్వతి మీద, మన పసుపు మీడియా/ గుంపు ఎన్ని విధాలుగా రాసింది? మరి మన చంద్రన్న, చాటుగా జయప్రదముగా చేసిన పనుల గురించి, డిబేట్ చేస్తుందా? అంటే అందరూ తప్పులో సమానం కాదా? అన్ని కుటుంబాల పరువు ఒకటి కాదా? మన బ్రీడ్ తప్పు చేసినా ఓకేనా?

13* బాబాయి కేసులో జగనన్న తప్పుడు పని అని అనే మనము, బాలయ్య కేసులో రాజన్న కాళ్ళు పట్టుకుని, మెంటల్ సర్టిఫికేట్ తో బయటపడ్డాము అని ఎందుకు అంగీకరించము? ఎందుకు మన పసుపు మీడియా/ గుంపు, మన తప్పులను ఎత్తి చూపదు? రాజన్న కుటుంబానికి, మనము ఎంత రుణపడి ఉండాలి?

పోనీ, సర్టిఫికేట్ ఉందని, బాలయ్య ను రాజకీయాల లో లేకుండా, ఇంటికి పరిమితం చేసామా? లేదు కదా? అంటే, కోర్టులను మోసం చేసాము అంతేనా? ఇప్పుడు ఎవరైనా కోర్ట్ కు వెళితే? పోనీ బాలయ్య నోరు ఎత్తితే, మన పార్టీకి మంచి జరుగుతున్నదా, చెడునా? నిన్న అస్సెంబ్లీ లో ఈల వేసి, వారు అందరి చేత ఎన్ని తిట్లు తిన్నారు. అవసరమా, మనకు?

ఇవన్నీ అల్లుడు గా, మీరు సరి చేయగలరా? మీరు ఆప్రయత్నము చేస్తే, మన పసుపు మీడియా/ గుంపు, ఆఖరకు మిమ్మల్ని కూడా వదలదు సుమీ.

14* మీరు ఇన్ని తప్పులు చేస్తుంటే, మన అనుబంధ సంస్తలు, ఇంకెన్ని తప్పులు చేస్తున్నాయో తెలుసా, మిమ్మల్ని అడ్డం పెట్టుకుని? అమెరికాలో/ విదేశాలలో, మన తానా తందనానా అనే సంస్థలు ఎన్నో, ఎన్నికలు కూడా మానేసి, ఏకగ్రీవము అంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, తమ మోచేతి నీరు తాగే వారిని, నాయకులుగా పెట్టుకుంటున్నారు.

ఇది మనకు, మన ప్రజాస్వామ్యానికి, మన పసుపు దళం ఉత్తమ వెన్నుపోటు విలువలకు, నిదర్శనమా? మీరు ఫోన్ చేసి వారిని తిట్టి, కనీసం ఎన్నికలు గా నటించండి అని చెప్పలేరా?

వారికి, అమెరికా నాయకులు గా, ఎదురు ఎదురు డిబేట్లు చేసే ధైర్యం లేదు. కనీసం వాట్సాప్ తెలుగు రాయడం, పద్యాలు పాడడం, పిల్లల చేత రాయించడం పాడించడం కూడా రాదు, ఆ సంఘ నాయకులకు.

కనీసం సొంత ముదుసలి అమ్మ నాన్న అత్త మామలను కూడా, చివరి దశలో తమతో ఉంచుకోరు, సేవ చేయరు, ఉత్తమ సమాన వైద్యం ఇప్పించరు. పచ్చ కార్డులతో అటొక కాలు, ఇక్కడ పదవుల కోసం ఇటొక కాలు వేస్తూ, రెంటికీ చెడ్డ రేవడి లా తయారు అయ్యారు, విదేశాలలో.

15* జైలు లో, చంద్రన్న ప్రాణాలకు ఏదైనా జరుగుతుందేమో అని బాధపడుతున్నాము కదా, మరి విజయవాడ ఎమ్మెల్యే వంగవీటి రంగాను, బహిరంగముగా తెల్ల వారు ఝామున, అయ్యప్ప దుస్తుల్లో వచ్చి హతమారిస్తే, మన ప్రభుత్వం, మన పోలీసు వ్యవస్థ ఏమి చేసింది? అంటే మన ప్రాణాల విలువ, ఇతరుల ప్రాణాలు చేయవా? ఆ పాపానికి శిక్ష ఎవరు అనుభవించాలి?

జైలులోనే చంద్రన్న కు క్షేమం. ఎందుకంటే, మన చుట్టు ఉన్న పసుపు మీడియా/ గుంపు , మన కే చేటు సలహా ఇస్తుంది. ఏదో సినిమాలో, నాయకునికి సలహా ఇస్తారు, మనము ఎటూ గెలవలేము, మీ నాన్నను ఉపయోగించుకుని గెలువు అని. మరి వెన్నుపోటులకు అలవాటు పడ్డవారు, ఎంత దూరమైనా వెళతారు.

కానీ ఇప్పుడు అది కూడా పని చేయదు. ప్రజలు కొత్త దనము కోరుకుంటున్నారు. మనకు ప్రధాన శత్రువు జగనన్న కాదు, మన చుట్టూ మన తో ఉండి కపటం నటనతో, మనల్ని మంచి విననీయకుండా చేసి, మనల్ని అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉంచి, మనల్ని బలి తీసుకునే, పసుపు మీడియా/ గుంపు.

16* ఇలా రాసుకుంటూ పోతే, ఎన్నో వస్తాయి మనము చేసిన తప్పులు. కరోనాకు వేల మంది, హైదరాబాద్ పరుగులు తీసిన, పాపం ఎవరిది? రాజధాని లేకుండా, చేసిన పాపం ఎవరిది? 3 పంటల మాగాణి ని, కాంక్రీట్ చేసిన పాపం ఎవరిది? నాన్న గారు, ప్రజల పన్నులతో కట్టే పధకాలకు, మన కుటుంబ పేర్లు ఎందుకు నీచముగా అని చెప్పలేరా?

జగనన్న ను దింపడానికి, మన దగ్గర ఉన్న, ధర్మ ఆయుధం ఏమిటి? ఏమీ లేదు. కేవలం ప్రజల అమాయకపు వారసత్వ కుటుంబ బానిసత్వ భిక్ష, అంతేనా? పోనీ జునియర్ రామన్న నచ్చుతాడా, అమ్మో మరలా పదవి తీసుకుంటాడేమో.

పోనీ పవనన్న ఉన్నాడు, కానీ అతనిని మీరు సీయెం గా అంగీకరించరు. వాడుకోవడమే కానీ, క్రుతజ్ఞత చూపించడం మనకు తెలీదు. కాబట్టి, జగనన్న గెలుపు కు, మీరే మార్గం వేస్తారు అని ప్రజల భావన.

17* గెలుపు ఓటములు దైవాధీనాలు, కానీ ధర్మం వీడవద్దు. చెడుతో కలవ వద్దు. ప్రజలు మంచిని చీత్కరిస్తే, నష్టం మనకు కాదు వారికే. అందుకే మహానుభావులు మనకు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చి వెళ్ళారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, కాఫీడేఅయ్య - వీరి జీవితాలలో చివరి పేజీలు చదవండి, పిల్లలకు, ప్రజలకు చెప్పండి. అలాగే మన జగనన్న, చంద్రన్న ను కూడా కేసులు, బెయిళ్ళు, స్టేలు, జైళ్ళు వదలలేదు. పంచభూతాలు ఎవరినీ వదలవు.  

Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1978 General Articles and views 1,672,746; 102 తత్వాలు (Tatvaalu) and views 207,293
Dt : 25-Sep-2023, Upd Dt : 25-Sep-2023, Category : Politics
Views : 217 ( + More Social Media views ), Id : 1926 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pavananna , political , downfall , jagananna , chandranna , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content