కోరి కొని తెచ్చుకోమాకు కర్మ, దాన్ని విడిపించు కోలేదు జన్మ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1562 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1597 General Articles, 54 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

బ్లఫ్ మాస్టర్ చిత్రము, రామజోగయ్య గారు రాసింది, ఆ పాట ఎవరు పాడారో గాని, సరియైన విధముగా పాడారు.

చాలా రోజులుగా వాట్సప్ లో తిరుగుతూ ఉంది. ఆ పాటలో ఏదో ఉంది శక్తి, ఆ గొంతులో ఏదో ఉంది అనురక్తి, ఆ మాటలలో ఉంది పరాశక్తి, హృదయం లో తడిమి నట్టుగా , వెన్నులో చిన్న వణుకు వచ్చినట్లుగా ఉంది.

ఆ మాట గొంతు సంగీతం సరిగ్గా కలిసి నర్తించాయి. వినేయండి ఆ పాట స్పీకర్లు లో, బొమ్మలు చూస్తూ, నోటితో ఆ మాటలను పలికే ప్రయత్నం చేయి.

ఒక్క కన్నీటి బొట్టు అయినా వచ్చిందా, భయం తో వణికావా, సాత్వికం వైపు అడుగేస్తున్నావు సుమా. ఎప్పుడో ఒకప్పుడు అయినా భగవంతుని చూస్తావు.

ఏమీ అనిపించలేదా, హృదయ స్పందన లేదా, పర్లేదు రాజస తామస గుణాలలో మునిగి తేలుతూ, ప్రపంచ భ్రమలలో ఉయ్యాల ఊగుతూ ఉన్నావు. వాస్తవం గ్రహించే సమయం వస్తుంది.

భయం లేదు పాటను ఆస్వాదించు. భవిష్యత్తు గమనించు సరిచేయడానికి.


ఏదో ఉంది ఈ పాటలో, ఆ గొన్తులో, ఆ మాటలలో, ఒక మాయ లోకి, ట్రాన్స్ లోకి వెళ్తున్నాము, ఈ పాట వింటే ....!

అద్భుతము, అనిర్వచనీయము, గుండె లోతుల్లో, ఏదో తెలియని బాధ, వణుకు, భయము, అనుభూతి.


సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం, సత్యంబలానుభవమిహం

ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే
అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే

ఎన్ని కన్నీళ్ళ ఉసురిది వెంటాడుతున్నది, నీడల్లే కర్మ
ధర్మమే నీ పాలి దండమై దండించ ,తప్పించుకోలేదు జన్మ

సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

పాపం, పుణ్యం రెండింటికీ నీదే పూచి, కన్ను తెరిచి అడుగువెయ్ ఆచి తూచి

ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే
అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే

ఏ కన్నూ చూడదనా, నీ విచ్చలవిడి మిడిసిపాటు
ఏ చెయ్యి ఆపదనా, తప్పటడుగే నీ అలవాటు

అదృశ్య దృష్టిగా సకల సృష్టి నిను గమనిస్తున్నది లెక్కగట్టి

ఎంత బతుకు నీదెంత బతుకు, ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా... మనుజా

ఏమారిక నిన్ను కబళిస్తుందిరా మాయదారి పంజా

కోరి కొని తెచ్చుకోమాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు జన్మ

సత్కర్మభీశ్చ సత్ఫలితం, దుష్కర్మ ఏవ దుష్ఫలం
అత్యుత్కట పుణ్య పాపానాం సత్యంబలానుభవమిహం

ఈ చోటి కర్మ ఈ చోటే, ఈ నాటి కర్మ మరునాడే
అనుభవించి తీరాలంతే, ఈ సృష్టి నియమం ఇదే  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1597 General Articles, 54 Tatvaalu
Dt : 21-Jul-2020, Upd Dt : 21-Jul-2020, Category : Songs
Views : 2554 ( + More Social Media views ), Id : 604 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : dont seek bring , bad thoughts , result , birth , cant escape , Satkarmabhisha , song BluffMaster , Rama Jogayya Sastri
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content