అరిషడ్ వర్గాల, అష్ట వ్యసనాల బానిసత్వం మరియు ఫలితాలు - వరాహా బురదోపాఖ్యానం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,708; 104 తత్వాలు (Tatvaalu) and views 225,615.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Enslavement of the Arishadvarg, Ashtavyasan and results - Varaha Buradopakhyanam

వరాహాలు సంవత్సరాల పాటు గా, తర తరాలు గా, బురదలో ఆనందంగా ఆహ్లాదకరంగా ఐకమత్యంగా, పొర్లుతున్నాయి పొర్లుతుంటాయి.

అవే వాటి లోకం, బయటకు రావాలంటే, ప్రాణం పోయినంత బాధ. దీనినే అశాశ్వత ప్రాపంచిక మోహాలు, భ్రమలు అంటాము. అదే అరిషడ్ వర్గాల, అష్ట వ్యసనాల బానిసత్వం.

మిగతా ప్రాణులకు, ఈ ఇంగిత జ్ఞానం లేదని, ఈ ఆనందం కోల్పోతున్నారు అని, తమలాగా ఇలా ఇతరులు బురదలో ఎక్కువసేపు ఉండలేరు అని గేళి చేస్తాయి.

బుద్ది జీవులకు దూరం గా ఉంటాయి. అలాగే బుద్ది జీవులు, బురదకు, అందులో ఆనందం వెతికే వారికి, దూరంగా ఉంటారు.

ఇప్పుడు ఒకటో రెండో లేదా కొన్ని వరాహాలు, తమ అవసరం అవకాశం తీరగానే, లేదా ఫలితాలు మొదలు కాగానే, తోకతో మూతితో, బురద చల్లాయి చల్లుతాయి ఆనందం అహంకారం తో, అందరిమీదా లేదా కొందరిమీద, పరిస్తితి ని బట్టి.

బురద లో ఉన్నప్పుడు, కారాలు వికారాలు చాలా ఉంటాయి. కాబట్టి, తమ తోటి వారిపైనే, అవి ఆ కపటం నాటకం చూపించాలి కదా, తప్పదు. వీరికి తమ స్వార్ధం తప్ప, ఇతరుల మంచి కనపడదు, బయటవారైనా లేదా కుటుంబ సభ్యులైనా, ఒకే సిద్దాంతం, నా ఆనందం నా జీవితం అంతే.

హాయిగా, బురదలో ఆనందముగా నిద్ర పోయే, మిగతా వరాహాలు, ఏయ్ ఎందుకు బురద జల్లుతావు, నీతి నియమం సంస్కారం లేదా అని కోపాలు కు పోతాయి, ఊగిపోతాయి. అలా అడగవచ్చు నా? తమకు బాధ కలిగింది అనో నచ్చకపోవడం లేదనో, ఆ సమయములో. మరి వారి మాటలకు, విలువ ఉంటుందా?

ఎందుకంటే వాటి ఒంటిపై ఉంది, అవి ఉందీ, బురదలోనే కదా, ఇన్ని ఏళ్ళు ఇన్ని తరాలు? ఇంక సంస్కారం నీతి నియమాలు గురించి అసలు మాట్లాడవచ్చునా? అవి కోప్పడినా, మిగతావి, విదిలింపు ఆపుతాయా?

తమ సహజ గుణం, బురద ఆనందం అదే కదా? మరి ఆ కష్టాలు కన్నీళ్ళు పతనం అనారోగ్యం అందరు ఉండి ఒంటరితనం భరించాలి కదా?

అవి నీతి నియమాలను గురించి మాట్లాడాలి అంటే, అర్హత, సాధనతో సంపాదించాలి. అంటే కష్టం అయినా, బురద వదలి బయటకు రావాలి. శుభ్రంగా నీతి నియమాలతో, బురదకు దూరంగా ఉండాలి.

అప్పుడు దాకా వాటికి, వేటికి మనశ్శాంతి రాదు, దేవుని కి దగ్గర కాలేము. బురదలో ఉండి, ఎన్ని బురద ప్రయత్నాలు చేసినా, ఫలితము ఉండదు.

నేడు 80 శాతం మంది పరిస్థితి ఇదే. బురదలో ఉన్నాము అని ఒప్పుకోలేరు, బురద బయటకు రాలేరు, వస్తే తట్టుకోలేరు, మనసు విల విల లాడిపోతుంది. మానసిక బలం మరియు ధైర్యం లేదు. ఎందుకంటే, అరిషడ్ వర్గాల అష్ట వ్యసనాల బానిసలు కాబట్టి.

ఇప్పుడు అయినా, బురద కడుక్కుని, పూర్తిగా వదిలించుకుని, బయట ఉండే ప్రయత్నం చేద్దాం, చిత్తశుద్ధి తో. లేదంటే, కర్మ/ ఖర్మ ఫలితాలు తప్పవు.

మామూలు బంగారం ను కాల్చక పోతే, అది నగ కాదు, ధరించడానికి పనికి రాదు. అలేగే కష్టమైనా, సాధనతో అరిషడ్వర్గాలను జయించవచ్చు సుమా.

అందుకే, భగవంతుడు చెప్పారు గీతలో, కోటికి ఒకరు మాత్రమే నావైపు చూస్తారు, వారిలో ఒకరు మాత్రమే, నన్ను చేరుతారు అని. మరి భౌతిక పరీక్షలు లో 75 పైన మార్కులు తెచ్చుకునే మనము, దేవుని పరీక్షలో ఎందుకు ఓడిపోతున్నాము?

దేవుడు మనతో ఉండాలి అంటే, అర్హత ఉండాలి కదా. మోహ ఓటర్లు నాయకులు, తప్పుడు వారు, 2 నాల్కలు, సజీవ గురువు సేవ లేని, వాక్సుద్ది త్యాగం లేని, అరిషడ్ వర్గాల అష్ట వ్యసనాల బానిసలు కూడా, దేవుడు మాతో ఉన్నారు అంటారు. అది నిజమైతే, ఇంక 80 శాతం పాపం ఎందుకు ఉంది? గురువు గారు చెప్పింది, అర్హత గల వారి గురించి. ఏదైనా, మనకు అర్హత సాధన కష్టం లేకుండా వస్తుందా, చదువు ఉద్యోగం వివాహం పిల్లలు పాప పుణ్యాలు? మరి దేవుడు స్తితప్రజ్ఞత అంతే కదా?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,708; 104 తత్వాలు (Tatvaalu) and views 225,615
Dt : 26-Dec-2022, Upd Dt : 26-Dec-2022, Category : General
Views : 368 ( + More Social Media views ), Id : 1667 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : enslavement , arishadvarg , ashtavyasan , results , varaha , buradopakhyanam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content