మనలో నే దైవం గురువు, ఆధ్యాత్మిక ధ్యానం అంటూ, మరి దేవాలయంకు ప్రదక్షిణలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,431; 104 తత్వాలు (Tatvaalu) and views 226,482.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ, మనలో నే అలాగే తల్లి దండ్రుల లోనే, దైవాన్ని గురువు ను చూడమని, ఆధ్యాత్మిక ధ్యానం మంచిది చేయమంటూ, మీరు ప్రతి వారం దేవాలయంకు ఎందుకు వెళుతున్నారు? ఇంత కష్టపడి ప్రదక్షిణలు ఎందుకు చేస్తున్నారు?

జవాబు, ధన్యవాదాలు మంచి ప్రశ్న, కనీసం ఆ రెండిటి లో, ఏదో ఒకటైనా మీరు చిత్తశుద్ధి తో చేస్తుంటే పర్లేదు. అర్థం తెలిసి, త్రికరణ శుద్ధి తో చేస్తుంటే, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు.

ఎందుకంటే, ఈ రోజుల్లో మన చదువు లు అలా ఉన్నాయి, ఒకటి ఉంటే రెండోది ఉండదు. బడికి వెళ్ళమంటే వెళ్లి శ్రద్ధగా కూర్చుని కబుర్లు చెప్పి వస్తున్నాను కదా, పేరెంట్స్ ని గౌరవించి, మరలా గురువు లకు గౌరవం, పాఠం అర్థం కావడం, ఇంట్లో రాత్రి వల్లె వేయడం, పరీక్షలు రాయడం, ఏమిటో ఈ తలనొప్పి అంటున్నారు, ఈ కాలం పిల్లలు. లేదా జైలు లాంటి హాస్టల్ లో, హృదయం బంధాలు లేకుండా పెరిగి, రాంకులు తెచ్చి ప్రపంచం మరచి, దైవం అమ్మ నాన్న బంధువులు తో, గౌరవం మర్యాద అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు, అవేంటో తెలీక వంటబట్టక చిన్నప్పుడు నుంచి అలవాటు లేక.

శివయ్య, విష్ణువు, ఆంజనేయుడు అందరూ ధ్యానం లోనే ఉంటారు. మనలో దేవుడు ని చూడాలంటే, మన మనసు ను ధ్యానం వైపు మరలించి, లోపల వెతకాలి పట్టుకోవాలి. దానికి ఎంతో సాధన, ఓర్పు నేర్పు పట్టు, కావాలి కదా? 108 ప్రదక్షిణలు కూడా తిరగలేక, ఆ కష్టం ఆ పాదాల నొప్పులు భరించలేక పోతే, కోతి లాంటి మన మనసు ను నిశ్చలంగా, దేవుని పై నిలిపే శక్తి సామర్థ్యం, మనకు ఉంటుందా?

పోనీ మంచి నడకకు, అనువైన సురక్షిత ప్రదేశం, ఇంకోటి ఉందా? అంటే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఎదగాలని చూస్తున్నా, అరిషడ్ వర్గాల ను దాటాలంటే, మనసు ను కట్టడి చేయాలంటే, సొంత పూజలు ప్రదక్షిణలు, తప్పక ఉండాలి సమాంతరంగా.

విగ్రహారాధన, కేవలం మనసు నిగ్రహం కొరకే. పూజలు ప్రదక్షిణలు కేవలం ఒక మార్గం, గమ్య స్ధానం కాదు అని తెలుసు కదా. కనుక అక్కడ నే ఆగిపోకూడదు. మనం, మొదటి మెట్టు నే సరిగ్గా ఎక్కామో లేదో తెలీనప్పుడు, వీలయినంత అన్ని దోవలు లో, కఠిన సాధన చేయాలి. మన చదువు ఉద్యోగం కోసం చేసినట్లు గా.

అంటే సొంత పూజలు, ధ్యానం, ప్రదక్షిణలు, దేవాలయ దర్శనం, తల్లి దండ్రుల సేవ, తెలుగు భాష సేవ, హైందవ సేవ, స్నేహితులు బంధువులు సేవ, దేశ సేవ, శాఖాహారం, చాప నిద్ర, . . .

ఇంక మనం ప్రతి వారం పలకరింపుకు, ఎవరి ఇంటికి వెళతాం, 7 ఏళ్లుగా? ఎవరు రానిస్తారు నవ్వుతూ, ప్రతిసారి? బంధువులు స్నేహితులు రానిస్తారా, వస్తారా, అవసరం అవకాశం లేనిదే? అంత బంధాలు అను బంధాలు మిగిలి ఉన్నాయా, ఏ ఇంట్లో అయినా?

అదే గుళ్లో దేవతలు, ఎన్నిసార్లు వెళ్ళినా, చిరునవ్వు తో రమ్మంటారు కదా? 100 మంది మన జనం ఉన్నా, మన నిజ శాశ్వత బంధువులు స్నేహితులు దేవుళ్ళే కదా? అందుకే దిక్కు లేని వారికి, దేవుడే దిక్కు అంది. మరి మన దైవ బంధువులు ఇంటికి, వార పలకరింపు కు అయినా, వెళ్ళవద్దా?

ఇవన్నీ కేవలం మార్గాలు మాత్రమే, మనసు నిశ్చలంగా ఉంచడానికి. పరమాత్మ ను పట్టుకోవడం జరిగేది, మన ధ్యానం లోనే, ఎన్ని జన్మలకో. అదే బ్రహ్మానందం, అదే పరమపదం, అదే మోక్షం. అరిషడ్ వర్గాలు ను జయించిన తర్వాత నే, ప్రాపంచిక వాసనలు వదలిన తర్వాత నే, అది సాధ్యం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,431; 104 తత్వాలు (Tatvaalu) and views 226,482
Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 1099 ( + More Social Media views ), Id : 960 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guru , god , within us , heart , mind , spiritual , meditation , temple , puja , pradakshin
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content