బోర్డ్ నెత్తిన పాపం వేసుకోకుండా, ఓటర్ల నెత్తిన రుద్దడానికి, ఎన్నికలు పెట్టి, డమ్మీనే? పాపం మీకు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1944 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1979 General Articles and views 1,676,082; 102 తత్వాలు (Tatvaalu) and views 207,612.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

తెలుగు సంఘ బోర్డ్ తమ నెత్తిన పాపం వేసుకోకుండా, ఓటర్ల నెత్తిన రుద్దడానికి, ఎన్నికలు పెట్టి, తిరిగి డమ్మీనే గెలిపించుకుంటే? మరి దానిని ప్రోత్సహించిన పాపం, మీకు అంటదా?

If any telugu board do not want to bear sin and to rub sin on voters, hold an election and let dummy win again? And don't you have the sin of encouraging it?

*ప్రశ్న/ స్పందన* - ఎక్కడ నేర్చుకున్నారు, ఇంత మంచి ముక్కుసూటి జర్నలిజం. అమ్ముడుబోయిన పచ్చ మరియు బులుగు మీడియాలు, కేవలం ఎదుటి వారిని, కోపం తో బూతులు రాస్తున్నాయి, చూపిస్తున్నాయి, తమ నేటి అలాగే నాటి నలుపు దాచి - పాపం వారి ఇంట్లో మరి ఏమి సంస్కారం నేర్పుతున్నారో.

మీ రాతలో కోపము ఉందా లేదో అర్ధం కాదు. మెత్తగా తిట్టింది మనల్నా, వారినా తెలీదు. ఇంతకీ పొగడుతున్నారా, తెగడతున్నారా అర్ధం కాదు. అన్ని సందేహాలే, అయోమయం మాకు. ఎందుకంటే మీరు ఎత్తి చూపిన వంకర లక్షణాలు అన్ని సంఘాలు/ పార్టీలులో, ఆఖరుకు ఓటర్లతో సహా ఉన్నాయి. అవి 100 శాతం వాస్తవం.

సినిమా రావు గోపాలరావు గారి పాత్ర ని అడ్డుపెట్టుకుని, సూటిగా నేడు జరుగుతున్న, రేపు జరగబోయే అన్యాయం చెప్పేసారు, చివరికి అనుచరుల, నాయకుల, ఓటర్ల బతుకు అంతే అని.

మా అందరినీ భయపెడుతున్న అంశం, పంచభూతాల శిక్షణ అంటున్న మీ మాట. దేవుడు అంటే ఎక్కడో ఉన్నారు అనుకుంటాము. కానీ పంచభూతాలు మనలో మరియు మన చుట్టూ ఉన్నాయి, అది ఇంకా భయం వేస్తుంది. ఈ రోగాలు, కరోనా, బయట వెన్నుపోటులు చూస్తా ఉంటే రోజు. ఆఖరికి, ఇంట్లో వారిని నమ్మలేని పరిస్తితి, 20 ఏళ్ళ ఆదర్శ కాపురం వారు కూడా, నేడు మేము భరించలేము విడాకులు అంటున్నారు, ఇంక సొంత పిల్లలు ఎటూ మనల్ని ఆశ్రమానికే పంపుతున్నారు మన కుసంస్కారానికి.

మేము 100 కి 80 మంది చేసే పాపాల వలనే, ఈ ఘోరాలు అని మాకు తెలుసు, కానీ సంస్కారం లేని మా బలహీన మనసులు మారవు, ప్రపంచం పూర్తిగా నశించినదాకా. అది ఒప్పుకోవడానికి, మాకో సిగ్గు కపటం నటన 2 నాల్కల ధోరణి తగలబడింది - అదే మనకు వెనక్కి వస్తుంది అని తెలిసి కూడా. రాక్షసుల స్థాయిలో ఉండండి సిగ్గు నటన విడిచి, శిక్షణ తప్పించుకోండి అని మీరు చెపుతున్నారు కూడా, మారలేకపోతున్నాము.

ఏముంది తెలుగు సంఘ/ పార్టీ వారే ధైర్యముగా, మాకు ఈ సంస్థ అనుబంధం, మేము ఈ గాడ్ ఫాదర్ కు 10 ఏళ్ళు బానిసలం, మోచేతి నీళ్ళు తాగుతూ ఉన్నాము, వీసా/ పచ్చ కార్డులదే రాజ్యం ఎందుకంటే అక్కడ రాజకీయం ముఖ్యం, మేము ఇక్కడ డొనేషన్ ఇచ్చి, అక్కడ ఈ విధముగా వాడుకుంటాం లేదా మా కుల వర్గ పార్టీకి సంస్థ కు ఇచ్చుకుంటాం, ఇంత మంది హీరో హీరొయిన్లను మాతో తిప్పుతాం, ముదుసలి అమ్మ నాన్న మాతో ఉండరు, మా పిల్లలకు తెలుగు రాయడం చదవడం పాడడం రాదు, ఫలానా వారికి పార్టీ టిక్కెట్లు కు ప్రయత్నం అని నేరుగా చెప్పిన కూడా, బానిస ఓటర్లు సభ్యులు మన వెంటే ఉంటారు కదా.

కలం రాతతో గుణపం గుచ్చింది మా గుండెలోనే ఓ పేరా వరకు, సూటిగా మా చెంప పగలగొట్టి మా అన్న లా, తండ్రిలా కడిగారు, చెడ మడా, కింద పైనా. మా వాళ్ళకు ఇప్పుడైనా సిగ్గు వస్తుందో లేదో.

కోపముతో మిమ్మల్ని, నన్నెందుకు అన్నావు అని అడగాలంటే, అక్కడ మా పేరు నేరుగా లేదు. మా సంస్థ నెందుకు అన్నారు అని అడగాలి అంటే అడగలేము అదీ లేదు, తానా తందనానా అనే సంస్థ లేదు, అలాంటి డూడూ బసవన్నలు చవటలు డమ్మీలు అన్ని సంఘాలు/ పార్టీలలో ఉన్నారు, 20 ప్రశ్నలకు జవాబు లేదు మా దొంగల వైపు నుంచి.

అదేమంటే అన్ని ప్రపంచ తెలుగు సంస్థ/ పార్టీ లు అంటారు. మిగతావారు అసలు ఉలకరు పలకరు, మేమొక్కరమే ఎగేసుకుని అరవలేము. ఇదెక్కడి టార్చరు అండి. తెలుగు సంస్థ/పార్టీ ల సభ్యులమూ అని చెప్పుకోవాలంటే, మా బానిసత్వం అలాగే సినిమా రాజకీయ బంధం గురించి అడుగుతారేమో జనాలు.

ఇంకో విధముగా చూస్తే, తెలుగు సంఘాల బోర్డ్ మెంబర్ల నెత్తిన పాలు పోసారు, తండ్రిలా నిద్ర లేపి, మీ తప్పులు మీరు కొనసాగించండి నేరుగా అందరి ఎదురుగా, కానీ మీరొక్కరే మీ కుటుంబమే, బానిసల ఏకగ్రీవ ఎన్నికతో, పతనం అవ్వడం ఎందుకు? ఆ పాపం లో ఓటర్లను కూడా చేర్చి, మీ పాపం తగ్గించుకోండి అన్నారు.

ఈ ఒక్క మాటకే, వాళ్ళు అంతా మీకు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు. ఎందుకంటే ఇంత బాగా విడమరచి చెప్పే ధైర్యం, పక్కన ఉన్న అవకాశ వాదుల కు ఉండదు. ఏమి చెపితే ఏమంటారో, ఉన్న పదవి రాబడి ఊడుతుంది, అని భయం.

కానీ ఇక్కడ మాకో ధర్మ సందేహం, ఇప్పుడు వారు తమ నెత్తిన పాపం వేసుకోకుండా ఓటర్ల నెత్తిన రుద్దడానికి, సెలెక్టెడ్ డమ్మీని రద్దు చేసి, ఎన్నికలు పెట్టి, తిరిగి అతనినే గెలిపించుకుంటే? మిగతా సంఘాలు అదే పని చేస్తే తూ తూ మంత్ర ఎన్నికలు పెట్టి తమ వారినే గెలిపిస్తే, మరి వారి తప్పులు కొనసాగిస్తారు కదా? మరి దానిని ప్రోత్సహించిన పాపం మీకు అంటదా?

*జవాబు* - ధన్యవాదాలు, మన చుట్టూ ఉండే ప్రపంచం బాగుపడాలి అన్న మీ తపన, బాగుంది. ఇది ఉంటే, మన ఇంట్లో పిల్లలు భాగస్వామి కూడా బాగుండాలి అన్న తపన ఉంటుంది.

అందుకే అందరికీ మేము చెపుతాము, మీ ప్రతి మాట అలాగే సమాధానం అలాగే మౌనం నుంచి, మీ సంస్కారం మీ ఇంట్లో క్రమశిక్షణ, మీ ముదుసలి తనం భవిష్యత్ గురించి మీకు తెలీకుండానే, మనకు అలాగే అందరికీ చెప్పినట్లే.

స్పందన లేని హ్రుదయముతో, వారి ఇంట్లో వారికి కూడా మనశ్శాంతి ఉండదు. అందుకే ఈ ఇంటి తగవులు, విడాకులు, లేదా పిల్లల పనులతో తలనొప్పులు.

వారు ప్రభుత్వము నుంచి నాన్ ప్రాఫిట్ కింద టాక్స్ క్రెడిట్ తీసుకుంటారు. కాబట్టి వారు, మాకే కాదు, మీకు కూడా జవాబు చెప్పాలి. ఎందుకంటే సేవ ముసుగులో ఉన్నారు కాబట్టి. అది కాదు అన్నా, తెలుగు వారికి జవాబు చెప్పకుండా, ఇంక సేవ ఏమిటి?

క్రిష్ణునికి మహా భారత యుద్దం, 11 + 7 = 18 అక్షౌహిణుల సైన్యం నేల కూలిన పాపం అంటిందా? ఆ యుద్దం నుంచి ఆయన పొందిన లాభం ఏమిటి? ఏమీ లేదు, ధర్మ రక్షణ తప్ప.

మనము ఇక్కడ కపటం నాటకం బానిసత్వం వద్దు, అది ఒక్క బోర్డ్ మీద మాత్రమే ఎందుకు వేసుకోవడం అని చెప్పాము. వారు మార్చుకున్నా, మార్చుకోకపోయినా, మనకు ఎటువంటి ఫలితము సంబంధము లేదు కదా. ఓటర్లు ద్వారా ఆ డమ్మీ నే ఎన్నుకుంటే, చాటు వ్యవహారం శిక్షణ తప్పుతుంది కదా? అంటే 100 శాతం పాపం నుంచి, కనీసం 80 శాతం పాపానికి వస్తారు కదా?

ఒకే సారి రక్తం తాగే పులిని, ఆ పని చేయకు అంటే ఆగుతుందా? అందుకే దానికి ముందు, మనుషుల మీద పడకు అని నచ్చ చెప్ప గలిగితే, కొంత పాపము తగ్గినట్లే కదా? ఆ తర్వాత జంతువులలో కేవలం క్రుర జంతువులనే తిను అంటే, కొంత కొంత పాపము తగ్గుతుంది కదా? అలా మనిషి మనసు పనులను బట్టి, కొంత మేర తగ్గించుకుంటూ రావడమే, సన్మార్గములో శిష్యుని లేదా గురువుని మార్చడం.

అందుకే మనతో అంటే మన ఆత్మతో మాట్లాడేటప్పుడు నిజం చెప్పాలి మన మానసిక పరిస్తితి గురించి. 10 తప్పులు చేస్తున్నారు అని తెలిస్తే, కనీసం ఓ 4 ఎలా తగ్గించుకోవాలో చెపుతాము. అంటే వారికి పంచభూతాల శిక్షణ కొంత వెనక్కు వెళుతుంది కదా.

శిశుపాలునికి 100 తప్పులకు శిక్షణ వచ్చింది. మనము 90 నుంచి, 80, 60, 40 కి తీసుకుని వెళితే? కాబట్టి ఇక్కడ ఫలితము తో మాకు ఎటువంటి సంబంధము లేదు, వారితో ఎటువంటి లావాదేవీలు ఉండవు కాబటి, మనకు పాపము రాదు.

మంచి మాట ధైర్యముగా చెప్పినందుకు ఓ 10 మార్కులు, వారు ఎన్నికతో ముందుకు వస్తే ఇంకో 10 మార్కులు దేవుని తో పడతాయే కానీ, పాపపు స్వార్ధం మనకు లేదు, రాదు.

ఇది తెలుగు సంఘానికే కాదు, పార్టీలకు వ్యక్తులకు నాయకులకు మన ఇంట్లో వారికి కూడా, ఏకగ్రీవముతో బెదిరించి బలవంతముగా ఎన్నిక చేసి, ఆ పాపాన్ని మీరు మీ కుటుంబమే భరించి పతనం అవ్వద్దు. ఎటూ జనం ధనం తీసుకుని లేదా ఇంకో దానికి అమ్ముడుబోయి నక్క పులి పాము నే గెలిపిస్తారు వారి వంశ బుద్ది ని బట్టి.

మన చుట్టూ పాపమే అని, మనమూ పాపం చేయకూడదు. బురద ఉందని, బురదలోనే వెళతామా? చుట్టూ తిరిగో, మధ్యలో రాయి వేసుకునో, లేదా పరుగున బయటకు వచ్చి కాళ్ళు కడుక్కుంటాము. లేదూ వరాహం లాగా బురదలోనే విహరిస్తాము అంటే, మీ ఇష్టం. పంచభూతాలు ఆ అవకాశం కోసమే చూస్తున్నాయి, మెత్తని మాటలు లెక్క చేయము అంటే వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1979 General Articles and views 1,676,082; 102 తత్వాలు (Tatvaalu) and views 207,612
Dt : 20-Jul-2023, Upd Dt : 20-Jul-2023, Category : General
Views : 178 ( + More Social Media views ), Id : 1845 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : telugu , sangha , board , bear , sin , rub , voters , hold , election , dummy , win , tana , nats , ata , bata
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content